నరాల అల్సర్ల కారకాలు
దెబ్బతిన్న కాలిలోని నరం రక్తాన్ని తిరిగి గుండెకి సమర్థవంతంగా చేర్చడంలో విఫలమైనపుడు కాలి మీద తలెత్తే ఒక పుండునే నరాల పుండని, వేరికోస్ అల్సర్ లేదా వీనస్ స్టేసిస్ అల్సర్ అని కూడా అంటారు. నరాల దగ్గర రక్తం పోగవడం మొదలైనపుడు, దాని కారణంగా పెరిగిన ఒత్తిడి మరియు పోగైన ద్రవమనేది కణజాలాలకి పోషకాలు మరియు ఆక్సిజన్ వెళ్ళకుండా నివారిస్తుంది. పోషకాలు లేకపోవడం వలన, కణాలు చనిపోవడం మొదలవ్వొచ్చు, మరియు ఒక కురుపు కూడా అభివృద్ధి కావచ్చు.
నరాల అల్సరు యొక్క లక్షణాలు
ఒకసారి కురుపులు తలెత్తిన తరువాత, మీ చర్మం పైన ఈ లక్షణాలని గనుక మీరు గమనిస్తే నరాల అల్సర్లు వున్నాయని మీరు అనుమానించవచ్చు.
* లోతులేని రంధ్రాలు.
కాలి క్రింది భాగంలో రక్తం పోగవడం మొదలైనాకొద్దీ, ద్రవాలు మరియు రక్త కణాలనేవీ చర్మం మరియు కణజాలాల్లోకి కారిపోతాయి. సాధారణంగా కణజాలంతో కనిపిస్తూ, పసుపు రంగులో కురుపులు తలెత్తవచ్చు. మీరు వాటికి చికిత్స చేయడానికి ప్రయత్నించినప్పటికీ, నయం కావడానికి సంబంధించిన తక్కువ లక్షణాలతో ఈయొక్క కురుపులు తీవ్రతరం కావచ్చు.
* చర్మపు రంగు మారడం.
కురుపు చుట్టూ రక్తం పోగవడాన్ని సూచిస్తూ, చర్మం ఎరుపు రంగులో, ముదురు నీలంలో లేదా గోధుమ రంగులో వుంటుంది. చర్మం మీద లావైన, దురదతో కూడిన పొడిగా వుండే పొట్టు తేలి వుంటుంది.
* సమంగాలేని దద్దుర్లు.
చర్మపు అడుగు భాగంతో పోగైన రక్తం కలవడమనేది నరాల పుళ్ళ ద్వారా మనకి తెలుస్తుంది, ఆ విధంగా జరగడం సమంగాలేని దద్దుర్లకి కారణమవుతుంది.
* కాలి నొప్పి.
దురద మరియు జలదరింపు అనేది మెల్లిమెల్లిగా ప్రభావిత ప్రాంతంలో నొప్పితో కూడిన అల్సర్లలాగా మారవచ్చు.
* ఇన్ఫెక్షన్ యొక్క లక్షణాలు
గాయం నుండి చెడు వాసన లేదా చీము కారుతుండడం అనేది ఇన్ఫెక్షన్కి సంబంధించిన ఒక లక్షణం.
నయంకాని అల్సరుకి ఎలా చికిత్స చేయాలి?
మీయొక్క నరాల అల్సర్లకి ఒక వాస్కులర్ నిపుణుడి ద్వారా చికిత్స పొందడమే త్వరగా నయంకావడం వైపు మీరు వేసే మొదటి అడుగు. దాదాపు 80% శాతం కాలి అల్సర్లకి కారణం నరాల అసమర్థతే అని చెప్పవచ్చు. కేవలం ఒక నరాల నిపుణుడు మాత్రమే దీనికి వ్యాధి నిర్థారణ చేసి, వివిధ రకాల నాళాల సమస్యలకి వెనుకనున్న మూల సమస్యకి చికిత్స చేయగలడు. ఆ విధంగా ఈ సమస్యని వేగంగా నయం చేయడంలో సాయపడి, ఆ అల్సర్లు మళ్ళీ తలెత్తకుండా కాపాడతాడు. ఇంతకు ముందు డి.వి.టి (డీప్ వెయిన్ థ్రోంబోసిస్), వేరికోస్ వేయిన్స్, ఊబకాయం, లేదా కదలలేని స్థితిని అనుభవించి వుండటం కూడా ఈ సమస్య వెనుక మూల కారణాలుగా వుంటాయి.
కాలి నరాలలో అభివృద్ధి చెందిన ఒత్తిడిని వదిలించడం మీద నరాల అల్సర్ల చికిత్స దృష్టి పెడుతుంది. మీయొక్క నరాలలోని రక్త ప్రవాహాన్ని మెరుగుపరచి అల్సర్లని త్వరగా నయం చేసే ప్రక్రియలను మీయొక్క వైద్యుడు సిఫారసు చేయవచ్చు.
ప్రతీరోజు పీడనంతో కూడిన సాక్సులు లేదా బ్యాండేజీలను ధరించమని మీకు సూచించబడవచ్చు. రక్త ప్రసరణని పెంచడంలో, రక్తం పోగవడాన్ని తగ్గించడంలో మరియు దానికి సంబంధించిన వాపు మరియు నొప్పిని తగ్గించడంలో ఇది సహకరించవచ్చు. ఇన్ఫెక్షన్ యొక్క అవకాశాలను తగ్గించే విధంగా, మీయొక్క గాయాన్ని ఎల్లప్పుడూ కూడా శుభ్రంగా, బ్యాండేజీతో ఉంచుకోవాల్సి వుంటుంది. పట్టీని ఎంత తరచుగా మార్చుకోవాలో మీయొక్క ఆరోగ్య సిబ్బంది మీకు తెలియజేస్తూ వుంటారు. అల్సరు గనుక ఇన్ఫెక్షన్కి గురైతే యాంటిబయాటిక్స్ని సూచించడం జరుగుతుంది.
మీయొక్క అల్సర్లు గనుక నయం కాకపోతే, మీయొక్క వైద్యుడు తక్కువ కోతతో కూడిన చికిత్సా మార్గాలను సిఫారసు చేయవచ్చు. అవి మీయొక్క నరాలలోని రక్త ప్రవాహాన్ని మెరుగుపరచవచ్చు.
ఎవీస్ వాస్కులర్ సెంటర్లో అందుబాటులో వున్న అత్యాధునిక చికిత్సా మార్గాలలో స్క్లేరోథెరపీ, లేజర్ లేదా రేడియోఫ్రీక్వన్సీ అబ్లేషన్ మెడికల్ గ్లూ థెరపీ కూడా వున్నాయి. దెబ్బతిన్న నాళాలని తొలగించడం మీద ఈయొక్క పద్ధతులు దృష్టి పెడతాయి. అ విధంగా ఆరోగ్యవంతమైన నరాలలోనికి రక్తప్రవాహం మళ్ళించబడుతుంది. ఎటువంటి గీతలు, మచ్చలు లేదా వాపు లేకుండా ఈయొక్క తక్కువ కోతతో కూడిన ప్రక్రియలు కాలినొప్పిని తగ్గించి, కాలు ఆరోగ్యంగా కనబడే విధంగా సహకరిస్తాయి.
ఈయొక్క ప్రక్రియ మీద మరిన్ని వివరాలకి, ఎవీస్ వాస్కులర్ సెంటరుకి కాల్ చేసి మాయొక్క నిపుణులతో మాట్లాడండి.
Venous Ulcer Treatment Hyderabad | Vijayawada | Visakhapatnam
For Appointments Call : 9989527715