పోస్ట్ థ్రోంబోసిస్ సిండ్రోమ్ అంటే ఏమిటి?
పోస్ట్ థ్రోంబోసిస్ సిండ్రోమ్ (పి.టి.ఎస్) అనేది ఒక దీర్ఘకాలిక సమస్య. డి.వి.టి సంభవించిన తరువాత కొన్ని వారాలలో లేదా నెలలలో ఇది తలెత్తవచ్చు. ఒక వ్యక్తి డి.వి.టికి సరైన చికిత్స తీసుకోనపుడు ఈ సమస్య సంభవిస్తుంది. మీ శరీరంలో ఒకటి లేదా ఎక్కువ లోతైన నరాలలో ఏర్పడే పెద్ద రక్తపు గడ్డని వైద్య పరిభాషలో డి.వి.టి. లేదా డీప్ వెయిన్ థ్రోంబోసిస్ అని పిలుస్తారు, ఎక్కువ శాతం వరకూ కాలి నరాల్లో ఇది సంభవిస్తుంది. నరంలో ఒక రక్తపు గడ్డ ఏర్పడినపుడు, అది రక్త ప్రవాహాన్ని అడ్డగించి మంటతో కూడిన వాపుకి దారి తీయవచ్చు. అలా ప్రభావిత ప్రాంతంలో రక్తం పోగవడం మొదలైనపుడు, అది నరాలలో ఒత్తిడిని పెంచగలదు. ఇది దీర్ఘకాలిక నరాల అసమర్థతకి (సి.వి.ఐ) దారితీయవచ్చు, ప్రభావిత ప్రాంతంలోని నరాలలో మరియు కవాటాలలో గాట్లు ఏర్పడే పరిస్థితి ఇది. ఈ పరిస్థితి పి.టి.ఎస్ లక్షణాలకి దారితీయవచ్చు
పి.టి.ఎస్‌కి దారితీసే నరాల సమస్యలలో ఇవి కూడా ఉండవచ్చు:
డీప్ వెయిన్ థ్రోంబోసిస్ (డి.వి.టి): కాళ్ళు లేదా తొడ భాగంలోని లోతైన నరాలలో ఒక రక్తపు గడ్డ ఏర్పడే పరిస్థితిని డీప్ వెయిన్ థ్రోంబోసిస్ అంటారు. ఒక నరంలో ఒక రక్తపు గడ్డ ఏర్పడినపుడు, అది రక్త ప్రవాహాన్ని అడ్డగించి మంటతో కూడిన వాపుకి దారి తీయవచ్చు. అది నరం యొక్క గోడలని మరియు కవాటాలని దెబ్బతీయవచ్చు.
వేరికోస్ వేయిన్స్: వేరికోస్ వేయిన్స్ అనేవి శరీరంలో ఏ భాగంలోనైనా కనిపించే సాగిన మరియు మెలితిరిగిన నరాలు, కానీ ఇవి ఎక్కువగా కాళ్ళలో కనిపిస్తాయి. వేరికోస్ వేయిన్స్ అనేవి నరాలకి మరియు కవాటాలకి హాని చేయగలవు. ఆ పరిస్థితి సి.వి.ఐకి దారితీసి, పి.టి.ఎస్ తలెత్తే అపాయాన్ని కూడా పెంచగలదు.
దీర్ఘకాలిక నరాల అసమర్థత (సి.వి.ఐ): సి.వి.ఐ అనేది ఒక పరిస్థితి. ఇందులో కాళ్ళలోని నరాలు మరియు కవాటాలు దెబ్బతింటాయి, దాని ఫలితంగా ఆ ప్రాంతంలో రక్తం పోగయి, అది నరాలలో ఒత్తిడి పెరగడానికి కారణమవుతుంది. సి.వి.ఐ అనేది డి.వి.టి, ఎస్.వి.టి లేదా వేరికోస్ వేయిన్స్ కారణంగా సంభవించి, పి.టి.ఎస్ తలెత్తే అవకాశాన్ని పెంచవచ్చు.
పి.టి.ఎస్ యొక్క లక్షణాలు.
పి.టి.ఎస్ యొక్క లక్షణాలలో కాలిలో నొప్పి మరియు వాపు, చర్మం రంగు కోల్పోవడం, అల్సర్లు ఏర్పడటం మరియు ప్రభావిత ప్రాంతంలో మందంగా మారడం లాంటివి వుంటాయి. పి.టి.ఎస్ యొక్క తీవ్రమైన కేసుల్లో, అవయవం బిరుసుగా మారడం కారణంగా కదలడం కూడా కష్టమవుతుంది. కాలు బరువుగా అనిపించడం మరియు అలసిపోయినట్లుగా అనిపించడం, మరీ ముఖ్యంగా చాలా గంటలు నడవడం లేదా నిలుచోవడం గానీ చేసిన తరువాత అలా అనిపించడమనేది సాధారణ లక్షణంగా వుంటుంది.
పి.టి.ఎస్‌కి చికిత్స.
పి.టి.ఎస్‌కి సంబంధించి సరైన వ్యాధి నిర్థారణ చేయడం మరియు చికిత్స చేయడం యొక్క లక్ష్యం ఏంటంటే దాని సంబంధిత లక్షణాల నుండి ఉపశమనం కలిగించి తరువాత తలెత్తబోయే క్లిష్టతలని కూడా నివారించడమే. స్థిరంగా ఉండిపోయిన పి.టి.ఎస్ సమస్యకి పూర్తి స్వస్థత వుండదు. అంతేకాకుండా, డి.వి.టి సంభవించిన తరువాత పి.టి.ఎస్‌ని నివారించడం మీదే దాని యొక్క నిర్వహణ అనేది ఆధారపడివుంటుంది. పి.టి.ఎస్ చికిత్స అనేది మీ పరిస్థితి యొక్క తీవ్రత మీదే ఆధారపడి వుంటుంది. సాధారణంగా, ప్రభావిత కాలుని లేపి వుంచడం, పీడనంతో కూడిన సాక్సుల వాడకం, మందులు, మరియు వ్యాయామం మొదలైనవి చికిత్సలో భాగంగా వుంటాయి. నరాలలో మరిన్ని రక్తపు గడ్డలు ఏర్పడకుండా ఉండటానికి బ్లడ్ థిన్నర్లని కూడా సూచించడం జరుగుతుంది.
ఎండోవీనస్ ప్రక్రియలు: పి.టి.ఎస్‌కి కారణమయ్యే అంతర్లీనమైన సమస్యలకి చికిత్స చేయడానికి స్క్లేరోథెరపీ, లేదా అబ్లేషన్ ప్రక్రియల లాంటి ఎండోవీనస్ ప్రక్రియలని ఉపయోగించే అవకాశం వుంటుంది. ఈ ప్రక్రియలనేవి ప్రభావిత అవయవంలో రక్త ప్రవాహాన్ని మెరుగుపరచి లక్షణాలని తగ్గించవచ్చు.
మీ నరాలలో సమస్య వుందని మీరు అనుమానిస్తే, సకాలంలో వ్యాధి నిర్థారణ చేయడం మరియు చికిత్స చెయడమనేది పి.టి.ఎస్ లాంటి క్లిష్టతలని నివారించడంలో సహకరిస్తుంది కాబట్టి మీరు త్వరిత వైద్య సహాయం తీసుకోవడం చాలా ముఖ్యం. ఎవీస్ వాస్కులర్ సెంటర్లో, రోగి యొక్క సమస్య తీవ్రత, వైద్య చరిత్ర, మరియు మొత్తంగా అతని ఆరోగ్య పరిస్థితి ఆధారంగా ఒక వ్యక్తిగత చికిత్సా ప్రణాళికని అభివృద్ధి చేయడం జరుగుతుంది.
Deep Vein Thrombosis Treatment In Hyderabad
For Appointment Call: 9989527715