Book Appointment
X

Choose location for Appointment


గర్భాశయ కణితుల తొలగింపు (UFE) గురించి తెలుసుకోండి.

Uterine FibroiUterine Fibroid embolization treatment in hyderabadd Embolization Treatment In Hyderabad | Chennai specialist near me

2019లో జరిగిన సొసైటీ ఆఫ్ ఇంటర్వెన్షల్‌ రేడియోలాజిస్ట్స్ (SIR) యొక్క వార్షిక సమావేశంలో సమర్పించబడిన ఒక అధ్యయనం గర్భాశయ కణితుల తొలగింపు (UFE) యొక్క ప్రయోజనాలను వివరించింది. మయోమెక్టమీ లాంటి చికిత్సతో పోల్చినపుడు, గర్భాశయ కణితుల తొలగింపు చికిత్సలో చికిత్సానంతర క్లిష్టతలు తక్కువగా వుండటం మరియు శస్త్రచికిత్స చేయించుకున్న వారితో పోల్చినపుడు కొన్ని మాత్రమే అదనపు చికిత్సలు అవసరం వుండటం లాంటివి కూడా వివరించబడిన కొన్ని ప్రయోజనాల్లో వున్నాయి.

ఈయొక్క అధ్యయనంలో గర్భాశయ కణితులు కలిగిన 950 మంది రోగులకి అందించిన చికిత్సా ఫలితాల యొక్క దీర్ఘకాలిక పునర్విమర్శనాత్మక విశ్లేషణ వివరించబడింది. ఇందులో సగం మంది యూ.ఎఫ్.ఈ చికిత్సని మరియు మిగతా సగం మంది శస్త్రచికిత్సలనీ చేయించుకున్నారు. వారిని ఏడూ సంవత్సరాల పాటు గమనించడం ద్వారా తేలిందేంటంటే, యూ.ఎఫ్.ఈ చేయించుకున్న వారితో పోల్చినపుడు మయోమెక్టమీ చేయించుకున్న వారిలో అధిక చికిత్సానంతర క్లిష్టతలు తలెత్తాయి మరియు అధిక రక్త మార్పిడి అవసరం కూడా తలెత్తింది. మొదటగా మాయోమెక్టమీ చికిత్స చేయించుకున్న మహిళలలో రెండవసారి వైద్యపరమైన జోక్యం చేసుకోవలసిన అవసరం తలెత్తిన శాతం 9.9 శాతం వరకూ వుండగా, దానితో పోల్చినపుడు మొదటగా యూ.ఎఫ్.ఈ చేయించుకున్న మహిళలలో తక్కువగా (8.6 శాతం) వుంది.

40 సంవత్సరాలు పైబడిన మహిళలలో దాదాపు 50% మంది ఈ పరిస్థితిని అనుభవించడం కారణంగా మరియు అంచనా ప్రకారం ఈ లక్షణాలని కలిగివున్న 50% మంది మహిళలు నెలసరి రక్తస్రావం, పొత్తికడుపు నొప్పి, ఒత్తిడి మరియు అసౌకర్యం, సంతాన సమస్యలు, మరియు దారుణమైన జీవన నాణ్యతని కలిగివుండటం కారణంగా గర్భాశయ కణితుల సమస్య అనేది సంతానోత్పత్తి వయసు కలిగిన మహిళలలో చాలా సాధారణమని చెప్పవచ్చు. కణితులని తొలగించడానికి గర్భాశయ తొలగింపు (Hysterectomy) అనేది ఇప్పటికీ కూడా అత్యధికంగా నిర్వహించబడే చికిత్సా ప్రక్రియ. కానీ యూ.ఎఫ్.ఈ ప్రక్రియతో పోల్చినపుడు ఇందులో తీవ్రమైన క్లిష్టతలు తలెత్తే రేటు ఎక్కువగా వుంటుంది మరియు రోగియొక్క సంతృప్తి మరియు కోలుకునే సమయం కూడా తక్కువ అనుకూలతని వుంటుంది. మయోమెక్టమీ అనేది మరొక ప్రక్రియ. ఇది గర్భాశయ తొలగింపు చికిత్స కన్నా కూడా తక్కువ క్లిష్టమైనది. కానీ యూ.ఎఫ్.ఈ కన్నా కూడా ఎక్కువ వైఫల్యం రేటుని ఇది కలిగివుందని కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి.

గర్భాశయ కణితుల తొలగింపు (Uterine Fibroid Embolization) అంటే ఏమిటి?

గర్భాశయ కణితుల తొలగింపు (యూ.ఎఫ్.ఈ) (యుటరిన్ ఆర్టరీ ఎంబలైజేషన్, లేదా యూ.ఏ.ఈ గా కూడా పిలుస్తారు) అనే ఈ ప్రక్రియలో ఒక ఇంటర్వెన్షనల్ రేడియోలాజిస్ట్ ఒక లైవ్-స్ట్రీమింగ్ ఎక్స్-రే వీడియో కొరకు ఫ్లూరోస్కోపీని ఉపయోగిస్తాడు. దాని సహాయంతో వైద్యులు వారియొక్క పరికరాలను చికిత్సా ప్రక్రియ సమయంలో కణితుల వైపుకి ఖచ్చితత్వంతో నడిపించవచ్చు.

యుటరిన్-ఆర్టరీ ఎంబలైజేషన్ అనే ప్రక్రియ రోగికి కేంద్రీకృత మత్తుమందు ఇచ్చిన సమయంలో నిర్వహించబడుతుంది. ఇందులో గర్భాశయానికి రక్త సరఫరా చేస్తున్న ధమనులని తాత్కాలికంగా నిరోధించడం జరుగుతుంది. కణితులకి రక్త సరఫరా ఆపివేసినపుడు, అవి వాటికి కావలసిన పోషకాలను పొందకుండా వుండి, దాని ఫలితంగా అవి ముడుచుకుపోయే పరిస్థితి తలెత్తుతుంది.

దీనిపై స్పష్టత లేకపోవడం, అండాశయాల మరియు గర్భాశయాల పనితీరుపై ప్రతికూలమైన ప్రభావం ఉంటుందనే భయాల కారణంగా గర్భం ధరించాలనుకునే మహిళలు యూ.ఎఫ్.ఈ ప్రక్రియ చేయించుకోవడానికి వ్యతిరేఖంగా సిఫారసులు చేయబడ్డాయి. కానీ, అండాశయ నిల్వపై ఎటువంటి ముఖ్యమైన ప్రభావం ఈ ప్రక్రియలో తలెత్తదని ఇటివలీ పరిశోధనా ఆధారిత అధ్యయనాలు మరియు విశ్లేషణలు వెల్లడిస్తున్నాయి.

గర్భాశయ కణితుల తొలగింపు ప్రక్రియకి సంబంధించి ఒక పరిశోధనాత్మక నిర్ణయాన్ని తీసుకోండి.

సరైన నిర్ణయాన్ని తీసుకోవడానికి నిజాలని తెలుసుకోండి.

ఇతర ఏ రకమైన చికిత్సా ప్రక్రియలాగానే, యూ.ఎఫ్.ఈ ప్రక్రియకి సంబంధించి కూడా అపాయాలు వుంటాయి. కానీ, అనుభవం కలిగిన ఒక ఇంటర్వెన్షనల్ రెడియోలజిస్ట్ ద్వారా ఈ ప్రక్రియ నిర్వహించబడినపుడు, అపాయలనేవి సమర్థవంతంగా తగ్గించబడవచ్చు. అంతేకాకుండా, గర్భాశయ కణితుల తొలగింపు ప్రక్రియ సందర్భంలో తీవ్రమైన క్లిష్టతలు తలెత్తే అవకాశం 1% కన్నా కూడా తక్కువగానే ఉన్నట్లుగా అధ్యయనాలు సూచిస్తున్నాయి.

  • క్యాథటర్‌ని రక్తనాళంలో ప్రవేశపెట్టే ఏ ప్రక్రియలోనైనా సరే కొన్ని అపాయాలు వుంటాయి. అందులో రక్తనాళం దెబ్బతినడం గానీ, గాయం జరగడం గానీ లేదా రంధ్రం చేసిన చోటులో రక్తస్రావం జరగడం గానీ మరియు ఇన్‌ఫెక్షన్‌ లాంటివి కూడా వుంటాయి.
  • మీయొక్క అండాలకి గానీ లేదా ఇతర అవయవాలకి గానీ రక్త సరఫరా సరిగ్గా జరగకపోతే, అది సమస్యలకి దారితీయవచ్చు. 
  • యు.ఎఫ్.ఈ చికిత్స చేయించుకున్న కొంత మంది రోగులు మాత్రమే, ఈ చికిత్సా ప్రక్రియలో ఉపయోగించిన ఎంబాలిక్ ఏజెంట్ల కారణంగా అలర్జీ సమస్యలని ఎదురుకున్నారు. చిన్నగా దురదలు రావడం, లేదా రక్తపోటులో మార్పులు రావడం లాంటి సమస్యలని ఒక నైపుణ్యం కలిగిన వైద్యుడు త్వరగానే గుర్తించి సకాలంలో చర్యలు తీసుకోగలుగుతాడు.

Uterine Fibroid Embolization Treatment in Hyderabad | Chennai 

For Appointments Call:

Hyderabad: 9989527715

Branches

https://www.avisvascularcentre.com/wp-content/pg-soft-slot/
Home
Services
Doctors
Branches
Blog
https://recyclestore.bigcartel.com/
https://hprojekty.sk/slot-gacor/