శరీర అట్టడుగు బాగాలలో (కాళ్ళు, పాదాలు) పుండు వుందని తెలుపుతూ ఒక రోగి ఒక ఆసుపత్రిని సంప్రదించినపుడు, ఆ పుండుని జాగ్రత్తగా పరిశీలించవలసిందిగా వుంటుంది. సిరలు లేదా/ మరియు ధమనుల సంబంధిత వ్యాధులు, మధుమేహము, కీళ్ళ వాతము, కణజాల వ్యాధులు, రక్త నాళాల వాపు, గ్రంథివాపు (లింఫడిమా), నరాల వ్యాధులు మరియు కురుపులతో సహా వివిధ రకాల కారణాల వలన ఈ పుళ్ళు అనేవి సంభవించవచ్చు
వాస్కులర్ అల్సర్లు (పుళ్ళు)
వాస్కులర్ అల్సర్లు అనేవి రక్తప్రసరణ వ్యవస్థలో తలెత్తిన సమస్యల కారణంగా దీర్ఘకాలికంగా లేదా ఎక్కువ కాలంపాటు చర్మంలో తలెత్తే పగుళ్ళు. ఇవి ప్రధానంగా రెండు రకాలు, అవి:
సిరల (సంబంధిత) అల్సర్లు:
కాలి పుళ్ళలో 80% శాతం వరకూ కూడా సిరల సంబంధిత పుండ్లు ఉంటాయని వివిధ రకాల అధ్యయనాలు అంచనవేసాయి. ఎక్కువ శాతం వరకూ వేరికోస్ లేదా స్టేసిస్ అల్సర్లుగా పిలవబడే ఈయొక్క కాలి పుండు అనేది, మీయొక్క కాలిలోని నరాలలో (సిరలలో) రక్తప్రసరణలో వుండే సమస్య వలన తలెత్తుతుంది. కాలిలోని నరాలలో రక్తం పోగయ్యేలా చేసే ఏ సమస్యైనా కూడా ఇటువంటి పుళ్ళకి కారణమవుతుంది మరియు ఇందులో వేరికోస్ వేయిన్స్, డీప్ వెయిన్ థ్రోంబోసిస్ (DVT), లేదా నరాల అసమర్థత లాంటి సమస్యలు కూడా ఇమిడి వుంటాయి.
నరాలలోని రక్తపోటుని మీయొక్క నరాలలోని కవాటాలనేవీ నియంత్రిస్తాయి, ఆ విధంగా మీరు నడిచేటప్పుడు ఈ కవాటాలు రక్తపోటుని తగ్గేలా చేస్తాయి. లోతైన నరాలలోని గోడలు ఇక ఏమాత్రం సరిగ్గా పనిచేయనపుడు లేదా పనిచేయని విధంగా తయారయినపుడు, నరాల అసమర్థత అనే సమస్య ఏర్పడవచ్చు. దీర్ఘకాలిక నరాల అసమర్థత అనేది నరాలలోపల రక్తపోటుకి దారితీయవచ్చు. ఆ పరిస్థితి అలానే కొనసాగితే, అది చివరికి అల్సర్లు ఏర్పడటానికి దారితీయవచ్చు.
సాధారణంగా ఈయొక్క అల్సర్లు నొప్పిలేకుండా వుండి మరింతగా నీరుపట్టి (ఎడీమా) వుంటాయి. ఏదేమైనప్పటికీ, ప్రభావిత ప్రాంతంలో ఇన్‌ఫెక్షన్ గనుక వుంటే, అక్కడ నొప్పిగా వుండి వివిధ రకాల సమస్యలకి దారితీయవచ్చు.
ధమనుల అల్సర్లు:
కాలి క్రింది భాగాలలో 10% నుండి 30% స్థాయి వరకూ వుండి, ధమనుల అసమర్థత కారక అల్సర్లు అనేవి రెండవ అతి సాధారణమైన సమస్యగా చెప్పవచ్చు మరియు ఇవి ధమనులు ఇరుకుగా మారడం లేదా వాటిల్లో అడ్డంకులు ఏర్పడటం (Atherosclerosis) లాంటి సమస్యల వాటి వలన సంభవిస్తాయి. ఆ విధంగా అవి గాయం యొక్క ప్రదేశానికి రక్త ప్రసరణని నిరోధిస్తాయి.
అటువంటి అల్సర్లు రక్తపోటు, హైపెర్లిపిడెమియా, మధుమేహం మరియు పొగత్రాగడం లాంటి సమస్యలతో సంబంధాన్ని కలిగివుంటాయి. ధమనుల అల్సర్లు నయం కావడానికి, అంతర్గతంగా వున్న లోపాన్ని సరిచేయాలి. అందువలన ఆయొక్క లోపాన్ని గుర్తించడానికి ఆ అల్సర్ల యొక్క ధమనుల వ్యవస్థని డ్యూప్లెక్స్ స్కానింగ్ చేయడం లేదా డయోగ్నోస్టిక్ ఆర్టిరియోగ్రఫీ లాంటి పరీక్షలను చేయించుకోమని సిఫారసు చేయడం జరుగుతుంది.
అటువంటి అల్సర్లకి సంబంధించిన నొప్పి ఒక మోస్తరు నుండి తీవ్రస్థాయి వరకూ వుంటుంది. కండర నొప్పితో పాటు అప్పుడప్పుడూ సళపడం, తిమ్మిరి, స్పర్శలేకపోవడం, రాత్రిల్లో కాలినొప్పి, లేదా విశ్రాంతి తీసుకున్నపుడు కాలినొప్పి లాంటి లక్షణాలని రోగి వెల్లడించవచ్చు.
ధమనుల అల్సర్లు ఖచ్చితమైన సరిహద్దుల్ని కలిగివుండి ఒక “గుండ్రని రంధ్రం” ఆకారంలో కనిపిస్తాయి.
మధుమేహకారక కాలిపుళ్ళు
మధుమేహకారక అల్సర్లు అనేవి మధుమేహం యొక్క వాస్కులర్ లేదా నరాల సంబంధిత సమస్యల వలన ఏర్పడతాయి. చర్మం యొక్క కణజాలం క్రింది భాగంలోని పొరలని బహిర్గతపరచే విధంగా చర్మం కణజాలంలో పగుళ్ళు సంభవించినపుడు ఈయొక్క అల్సర్లు ఏర్పడతాయి. ఎక్కువగా ఇవి చీలమండ క్రింద సంభవించినప్పటికీ, ఇటువంటి అల్సర్లు పాదం మీద ఏ భాగంలోనైనా సంభవించవచ్చు, కానీ ఎముకలని ప్రభావితం చేసేంతటి లోతుగా కూడా సంభవించవచ్చు.
మధుమేహ రోగులలో ఎక్కువ చక్కర స్థాయిలనేవీ (గ్లూకోజు) కాళ్ళు మరియు పాదాలలోని నాడులకి రక్తం సరఫరా చేసే చిన్న రక్త నాళాలని దెబ్బతీయవచ్చు. ఈ పరిస్థితి నొప్పి మరియు తిమ్మిరికి దారితీయవచ్చు. అంతేకాకుండా, “సూదులు గుచ్చినట్లుగా” మరియు నొప్పి తగ్గిన స్పర్శ కలుగుతోందని రోగులు ఫిర్యాదు చేస్తారు. దీని ఫలితంగా, స్పర్శలేకపోవడం వలన గాయాలు గుర్తించబడనపుడు, వాటిని గుర్తించక ముందే అల్సర్లు అనేవి అభివృద్ధి చెంది పెద్దగా మారేందుకు అవకాశం వుంటుంది.
బొబ్బగా పిలవబడే ఒక నల్లని కణజాలం అల్సరు చుట్టూ పెరుగుతుంది. ఇది పాదాల అల్సర్లకి సంబంధించిన ఒక ముఖ్యమైన సంకేతం. ఈ అల్సర్ చుట్టూ ఇన్‌ఫెక్షన్‌ల వలన కొద్దిగా లేదా పూర్తిగా ఒక గ్యాంగ్రిన్ (కుళ్ళిన పుండు) ఏర్పడవచ్చు లేదా కణజాల మరణం సంభవించవచ్చు. అది నొప్పి మరియు తిమ్మిరిని కలిగించి, వాసనతో కూడిన స్రవాన్ని కూడా కలిగివుండవచ్చు.
సకాలంలో కనిపెడితే గనుక, పాదాల అల్సర్లకి చికిత్స చేయడం వీలవుతుంది. ఎంతకీ నయంకాని ఒక పుండుని గానీ ఒక కురుపుని గానీ మీరు గమనిస్తే, వెంటనే ఒక వైద్యున్ని సంప్రదించండి. మీరు ఎంత కాలయాపన చేస్తే, ఈ అల్సర్ల యొక్క నిర్వహణ అంత కష్టతరం అవుతుంది.
Venous Ulcer Treatment Hyderabad | Vijayawada | Visakhapatnam