Book Appointment
X

Choose location for Appointment


రక్తనాళాల సమస్యలకి సంబంధించిన సాధారణ గురుతులు మరియు లక్షణాలు

ప్రపంచంలో ఎంతో మంది నరాల వ్యాధులకి సంబంధించిన గురుతులతో మరియు లక్షణాలతో జీవిస్తుంటారు, బహుశా ఆ వ్యాధులు వారికి వున్నాయని కూడా తెలియకుండానే. మనం తరచుగా ఇలాంటి మాటల్ని వింటాం, “సాయంత్రం వరకూ నా కాళ్ళు వాచిపోయి విపరీతంగా నొప్పులు పెడుతున్నాయి. కాని పరవాలేదు, ఒకవేళ అది వయసు వలన కావచ్చు.” ఈ సమస్యలు వయసు వలన కాదని, మిగత ఆరోగ్య సమస్యల కారణంగా వస్తున్నాయని వారు అరుదుగా తెలుసుకుంటారు. ఆ ఆరోగ్య సమస్యలకి గనుక వ్యాధి నిర్థారణ జరిగి చికిత్స జరిగితే, వారి జీవితాలు మళ్ళీ చక్కబడతాయి.

ఈ బ్లాగులో, నరాల వ్యాధి యొక్క సాధారణ గురుతులు మరియు లక్షణాలని చర్చించుకుందాం.

గురుతులు మన కంటికి కనిపిస్తాయి. నరాల వ్యాధులకి సంబంధించి మీరు పరిశీలించవలసిన సాధారణ లక్షణాలు ఈ విధంగా వున్నాయి:

  • ఎరుపు, ముదురు నీలం, లేదా నీలి రంగులో సన్నని గీతలు. అవి కాళ్ళ ఉపరితలం నుండి లేదా ముఖం నుండి పాకుతూ వెళ్ళే సాలీడు గూళ్ళలా లేదా కొమ్మలలాగా కనిపించవచ్చు. వాటిని స్పైడర్ వేయిన్స్ అని అంటారు.
  • సాధారణంగా ఎక్కువ శాతం కాళ్ళపైన మరియు పాదాల పైన మెలితిరిగిన, బొడిపెలుగా మరియు సాగిన నరాలు కనిపించడం. వీటిని వేరికోస్ వేయిన్స్” అంటారు.
  • చుట్టూ ప్రదేశంలో తెల్లని మచ్చలు, వాపు మరియు మంట కలిగివుండటం.
  • ముదురు ఎరుపులో లేదా ముదురు నీలంలో లేదా దురదతో కూడిన చిన్నగా ఎరుపు లేదా గోధుమ రంగు మచ్చల రూపంలో చర్మం రంగు కోల్పోవడం.
  • మీయొక్క కాలిపైన కణజాలం దెబ్బతినడం కారణంగా పుళ్ళు మరియు కురుపులు తలెత్తడం.

ఈ క్రింది లక్షణాలనేవి మీరు అనుభవించేవి.

  • కాలి పోటు, నొప్పి, మరియు తిమ్మిరి పట్టడం శ్రమతో కూడిన నడక, లేదా ఒక కొత్త వ్యాయామానికి సంబంధించి కూడా ఈ లక్షణాలు ఉండవచ్చు. ఇది నిజమైనప్పటికీ, నరాల అసమర్థత కారణంగా నరాల వ్యాధులు లేదా క్లిష్ట సమస్యలు తలెత్తిన అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేం.
  • కాళ్ళలో సలిపినట్లుగా లేదా మండినట్టుగా అనిపించడం- ఇది వేరికోస్ వేయిన్స్‌కి సంబంధించిన చాలా సాధారణ లక్షణం.
  • రెస్ట్‌లెస్‌ లెగ్ సిండ్రోమ్- కాళ్ళకి విశ్రాంతిగా ఉండకపోవడం, మరీ ముఖ్యంగా రాత్రి సమయాల్లో కాళ్ళు కదుపుతూనే వుండటమనేది కాళ్ళలో మంటతో కూడిన వాపు కారణంగా తలెత్తుతుంది. ఇది దీర్ఘకాలిక నరాల అసమర్థతకి సంబంధించినదై వుంటుంది.
  • దురద- దీనిని కొన్నిసార్లు ఒక అలర్జిక్ రియాక్షన్‌గా లేదా ఒక చర్మ సమస్యగా పరిగణించడం జరుగుతుంది. కాని, దీని వెనుక కూడా దీర్ఘకాలిక నరాల అసమర్థతే ఒక అంతర్గత కారణంగా వుండే అవకాశం వుంది.
  • అలసట- నరాల వ్యాధులతో జీవించేవారు సాయంత్రం అయ్యే సరికి బరువుగా అనిపించే మరియు అలసిపోయిన కాళ్ళ నొప్పులతో బాధపడతారు. కాని ఇది “మామూలే” అని వాళ్ళు అనుకుంటారు.

మీలో కొంతమందికి నరాల సమస్యలకి సంబంధించిన గురుతులు కనిపిస్తూనే ఉన్నప్పటికీ వాటికి సంబంధించిన లక్షణాలని మీరు అనుభవించకపోవడమనేది ఆసక్తికరమైన విషయమే. కొన్నిసార్లు లక్షణాలు కూడా వుంటాయి, కానీ హెచ్చరించే లక్షణాలు అంతగా కనిపించవు.

ఇప్పుడు నరాల సమస్యలకి సంబంధించిన గురుతులు మరియు లక్షణాలకి సంబంధించిన అవగాహన మీకు వుంది కాబట్టి, ఒకవేళ ఈమధ్య ఇటువంటి లక్షణాలనేమైనా మీరు అనుభవించారో లేదా ఇలాంటి గురుతులని మీయొక్క శరీరంలో గమనించారో లేదో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి!

మీయొక్క చర్మంలో జరిగిన మార్పులు బయటకి కనిపించడానికి సమయం పడుతుందని, జాబితాలో చిట్టచివరగా కనిపించే లక్షణం అదేననే విషయం కూడా మీరు తెలుసుకోవాలి. దీర్ఘకాలిక నరాల అసమర్థతని సూచించే ఈ లక్షణం గనుక కనిపిస్తే, దానికి గనుక చికిత్స చేయకుండా వదిలిపెడితే, అది పెద్ద సమస్యలకే దారితీయవచ్చు.

మిమ్మల్ని హెచ్చరించే గుర్తులని వెంటనే పసిగట్టండి. అంతేకాదు, నరాల సమస్యలకి సంబంధించిన ఎటువంటి లక్షణాలని మీరు అనుభూతి చెందినా, ఎవీస్ వాస్కులర్ కేంద్రాన్ని సంప్రదించి మాయొక్క వైద్యులని కలుసుకోండి. నరాల సంబంధిత వ్యాధులకి చికిత్సనందించడంలో వారు చక్కని అనుభవం కలిగివున్నవారు. ఇలాంటి పరిస్థితి ఒక పెద్ద ఆరోగ్య సమస్యగా మారక ముందే చికిత్స తీసుకోండి.

Varicose Veins Treatment In Hyderabad | Bengaluru |Mysore Visakhapatnam | Vijayawada Chennai |Coimbatore Tirupati | Rajahmundry Kolkata | Madurai

For Appointment Call

Telangana: 9989527715

Andhra Pradesh: 9989527715

Tamilnadu: 7847045678

Karnataka: 8088837000

Kolkata: 9154089451

Branches

https://www.avisvascularcentre.com/wp-content/pg-soft-slot/
Home
Services
Doctors
Branches
Blog
https://recyclestore.bigcartel.com/
https://hprojekty.sk/slot-gacor/