మోనోపాజ్ వయసులో వున్న ఎంతోమంది మహిళలు ఎక్కువగా జరిగే లేదా ఒక క్రమం లేకుండా జరిగే ఋతు చక్రాలను ఎదురుకొంటారు. పిల్లలను కనే వయసులో వుండే ఎంతో మంది మహిళలు అసాధారణమైన రక్తస్రావం జరుగుతోందని లేదా నెలసరి మధ్యమధ్యలో ఎక్కువగా రక్తస్రావం అవుతోందని, ఆ సమయంలో నొప్పి కూడా ఉంటోందని పేర్కొంటారు. ఇవన్నీ కూడా గర్భాశయ కణితుల (Uterine Fibroid Embolization)ఉనికిని తెలిపే లక్షణాలు.
గర్భాశయ కణితులు అంటే ఏమిటి?
గర్భాశయ కణితులు అనేవి గర్భాశయ గోడల మీద వుండే క్యాన్సర్ రకం కాని కండరపు పెరుగుదలలు. అవి ఒక చిన్న లేదా పెద్ద కణితిగా లేదా ఎన్నో కణితుల సమూహంగా కనిపిస్తాయి. చిన్న కణితులు ఎటువంటి లక్షణాలు లేకుండా వుండి, మాములుగా ఎటువంటి హాని కూడా లేకుండా వుండి వాటికి ఎటువంటి చికిత్స కూడా అవసరం రాదు. కాని, కొన్ని పెద్ద కణితులు కొన్ని కిలోల వరకూ బరువు వుండి 20 సెం.మీ వరకూ వ్యాసార్థాన్ని కలిగివుండవచ్చు, అంటే దాదాపు ఒక చిన్న పుచ్చకాయ పరిమాణంలో ఉండొచ్చు. అవి ఊపిరితిత్తులు లేదా మూత్రాశయం లాంటి అవయవాలని కూడా ప్రభావితం చేస్తాయి. కణితులనేవీ పెద్దవిగా మరియు బరువుగా పెరిగినపుడు, స్త్రీలకి పొత్తికడుపు భాగంలో బరువు పెరగడమనేది మొదలవుతుంది, అంతేకాకుండా, చూడటానికి వాళ్ళు గర్భం దాల్చినట్లుగానే కనిపిస్తుంది. వైద్యుల సలహాల ఆధారంగా, అటువంటి పెద్ద కణితులకి మందుల ద్వారా లేదా ఇతర విధానాల ద్వారా చికిత్స చేయడం జరుగుతుంది.
గర్భాశయ కణితులకి ఎలా చికిత్స చేయడం జరుగుతుంది?
గర్భాశయ కణితుల చికిత్సల్లో భాగంగా హిస్టరెక్టమీ (గర్భాశయం తొలగింపు), పొత్తికడుపు మయోమెక్టమీ, లేదా ఏండోమెట్రియల్ అబ్లేషన్ లాంటి శస్త్రచికిత్సలు చేయబడతాయి. ఈనాటి అధునాతన సాంకేతిక సహాయంతో, గర్భాశయ కణితుల తొలగింపు (Uterine Fibroid Embolization) అనే చికిత్స అత్యంత ప్రజాదరణ పొందింది. అంతేకాకుండా, ఇది మంచి ఫలితాలని కూడా ఇస్తోందని కనుగొనబడింది.
శస్త్రచికిత్సకి తక్కువ కోతతో కూడిన ప్రత్యామ్నాయ చికిత్సా విధానం ఇది మరియు సురక్షితమైనది. ఈ విధానంలో తక్కువ సమయం ఆసుపత్రిలో ఉండవలసి వస్తుంది మరియు శస్త్రచికిత్సతో పోలిస్తే త్వరగా కోలుకునే అవకాశం కూడా వుంటుంది. గర్భాశయ కణితుల లక్షణాలు వుండే స్త్రీలకి మరియు శస్త్రచికిత్సని ఇష్టపడని వాళ్ళకి ఈ విధానం సిఫారసు చేయబడుతుంది. కణితి పరిమాణంతో సంబంధం లేకుండా గర్భాశయంలో వుండే కొన్ని లేదా ఎక్కువగా వుండే అన్ని రకాల కణితులకి ఈ చికిత్సా విధానం సమర్థవంతమైనది.
యు.ఎఫ్.ఇ చికిత్స సమయంలో ఏమి ఆశించవచ్చు?
యు.ఎఫ్.ఇ చికిత్స సమయంలో మీయొక్క వైద్యుడు, కణితులకి మరియు గర్భాశయానికి రక్తం సరఫరా చేసే గర్భాశయ ధమనుల్లోకి ఒక చిన్న సూది రంధ్రం ద్వారా క్యాథటర్‌గా పిలవబడే ఒక సన్నని వంగేగుణం గల ట్యూబుని మరియు చిన్న చిన్న గోలీలని చొప్పిస్తారు. కణితులకి రక్త సరఫారాని నిరోధించి వాటికి ప్రధానమైన పోషకాలు అందకుండా చేయడమే ఈ విధానం యొక్క ప్రధాన లక్ష్యం. ఇలా చేయడమనేది ఆ కణితులు ముడుచుకుపోవడానికి దారి తీస్తుంది. కేంద్రీకృత మత్తుమందు ఇవ్వడం ద్వారా ఈ మొత్తం ప్రక్రియ నిర్వహించబడుతుంది.
రక్త సరఫరా ఆగిపోయినపుడు, ఆ కణితులు క్రమక్రమంగా ముడుచుకుపోతాయి. అంతేకాకుండా, నొప్పిని మరియు అసౌకర్యానికి కారణమవుతూ అంతర్గత అవయాల పైన వుండే ఆ నిరంతర ఒత్తిడి మెల్లిమెల్లిగా మాయమవుతుంది. కొన్ని రోజుల నుండి కొన్ని నెలలలోపే రోగులు వారి యొక్క వ్యాధి లక్షణాలు తగ్గిన అనుభూతిని చెందుతారు.
ఎంబోలైజేషన్ ప్రక్రియ తరువాత ఏమి ఆశించవచ్చు?
ఒకసారి ఈ చికిత్స పూర్తైన తరువాత కోలుకోవడానికి ఒకటి లేదా రెండు వారాల సమయం పట్టొచ్చు. ముందు కొన్ని రోజులలో పొత్తి కడుపు నొప్పి, వణుకుతో కూడిన జ్వరం మరియు అలసట లాంటివి మీకు తలెత్తవచ్చు. మీరు కోలుకునే సమయంలో ఆసుపత్రిలోనే ఉండటాన్ని మీరు ఎంచుకోవచ్చు. ఈ చికిత్స జరిగిన రోజే ఇంటికి వెళ్ళాలని అనుకునే వారికి ఇంటివద్దనే వాడేలా నొప్పినివరణ మందులని కూడా సూచించబడవచ్చు.
ఈ చికిత్స జరిగిన తరువాత ఋతుస్రావం అనేది కాస్త ఎక్కువగా వుండి మీరు మామూలు కన్నా కూడా ఎక్కువ అసౌకర్యాన్ని అనుభవించే అవకాశం వుంది. మొదటి కొన్ని నెలలలో మీయొక్క ఋతుచక్రాల మధ్య మధ్యలో రక్తస్రావం కూడా జరగవచ్చు. ఏదేమైనప్పటికీ, తరువాతి నెలల్లో కణితులు ముడుచుకుపోతున్నాకొద్దీ మరియు మీ వ్యాధి లక్షణాలు తగ్గేకొద్దీ మీ ఆరోగ్య పరిస్థితి మెరుగైన అనుభూతి మీకు కలుగుతుంది.
ఈ చికిత్స పూర్తైన తరువాత 85% మంది రోగులు వారి వ్యాధి లక్షణాలు తగ్గడాన్ని అనుభూతి చెందుతారు. మిగతావారు వారి పరిస్థితి మెరుగుపడటానికి ఎంబోలైజేషన్ ప్రక్రియలని లేదా ఇతర చికిత్సా ప్రక్రియలని మళ్ళీ చేయించుకోవలసి రావొచ్చు.
మా ఎవీస్ వాస్కులర్ సెంటర్లో చికిత్స చేసుకున్న తరువాత రోజులలో, ఇంటి దగ్గర కోలుకుంటున్న మీకు వైద్య సలహాలు మరియు సహాయం అందుబాటులో ఉంటాయి.
Uterine Fibroid Embolization Treatment in Hyderabad | Chennai
For Appointments Call:
Hyderabad: 9989527715
Chennai: 7847045678