Book Appointment
X

Choose location for Appointment


గర్భధారణ మరియు డీప్ వెయిన్ థ్రోంబోసిస్‌ (డి.వి.టి) – ఈ రెంటి మధ్య సంబంధం వుందా?

Deep vein thrombosis

గర్భధారణ కాలం ఏందో ఆనందకరంగా ఉండొచ్చు. కాని కాబోయే తల్లికి ఇది తెచ్చిపెట్టే అపాయాలు, సవాళ్ళు ఎన్నో ఉండొచ్చు. రక్తం గడ్డల గురించి, అపాయల్ని తెచ్చిపెట్టే కారణాల గురించి మరియు మిమ్మల్ని మీయొక్క పాపని గర్భధారణ సమయంలో మరియు ప్రసవం తరువాత కూడా రక్షించుకునే చిట్కాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

ఎందుకని గర్భిణీ స్త్రీలలో రక్తం గడ్డకట్టే అపాయం ఎక్కువగా వుంటుంది?

రక్తపు గడ్డలు నరాలలోని సాధారణ రక్తప్రసరణకి అవరోధం కల్పించి కాళ్ళ వాపులకి మరియు అప్పుడప్పుడూ చర్మం రంగుకోల్పోవడం లాంటి సమస్యలకి దారితీస్తాయి. ఈ లక్షణాలు ఎంత తక్కువగా ఉంటాయంటే ఒక గర్భిణీ స్త్రీ వాటిని మామూలు లక్షణాలుగానే పరిగణించవచ్చు.

లోతైన రక్తనాళాలలో, ఎక్కువ శాతం కాళ్ళలో, పిక్కలలో, లేదా పొత్తికడుపు ప్రాంతంలో రక్తం గడ్డలు ఏర్పడే సమస్యని డీప్ వెయిన్ థ్రోంబోసిస్‌ (డి.వి.టి) అని అంటారు. అయినా కూడా వీనస్ థ్రోంబోసిస్‌ (ఒక రక్తనాళంలో రక్తపు గడ్డ) అనేది గర్భధారణ సమయంలో, లేదా ప్రసవం తరువాతి ఆరు వారాల వరకూ కూడా దాదాపు సంభవించదు. ఈ సమస్య వెయ్యి మంది స్త్రీలలో కేవలం ఒకటి నుండి రెండు మంది స్త్రీలలో మాత్రమే తలెత్తుతుంది. ఏదేమైనప్పటికీ, గర్భధారణ అనేది మీలో డి.వి.టి యొక్క అపాయాన్ని పెంచుతుందని అధ్యయనాలు వెల్లడించాయి. అందులో మరీ ముఖ్యంగా ప్రసవం అయిన వెంటనే అపాయం ఎక్కువగా వుంటుంది.

గర్భందాల్చని మహిళతో పోల్చినపుడు, గర్భందాల్చిన మహిళ యొక్క శరీరంలో, తన కడుపులో బిడ్డ ఎదిగే సమయంలో మార్పులు రావడం మరియు ప్రసవం తరువాత రక్తం గడ్డకట్టే అపాయాలు ఎక్కువవడం కారణంగా వారిలో రక్తపు గడ్డలు ఏర్పడే అవకాశం ఎక్కువగా వుంటుంది.

1. గర్భధారణ యొక్క తరువాతి దశలలో పొత్తికడుపు నరాలపై పెరిగే బిడ్డ యొక్క ఒత్తిడి కారణంగా కాళ్ళ వైపు జరిగే రక్త ప్రసరణకి ఆటంకం సంభవించవచ్చు.

2. ప్రసవం తరువాత కదలకుండా వుండటం అనేది కాళ్ళలో మరియు చేతులలో రక్తప్రసరణని పరిమితం చేస్తుంది.

రక్తప్రసరణ పరిమితం చేయబడినపుడు, కొన్ని కణాలు గడ్డకట్టి అవి ఒక మహిళలో డి.వి.టి తలెత్తే అవకాశాన్ని ఎక్కువ చేయవచ్చు.

మీయొక్క గర్భధారణ సమయంలో, మొదటి మూడు నెలలతో సహా ఎప్పుడైనా మీకు డి.వి.టి సంభవించవచ్చు. కాబట్టి మీకు ఆ అపాయం వుందో లేదో మీయొక్క వైద్యునికి తెలిసి వుండటమనేది చాలా ముఖ్యం. ఒక గర్భిణీ స్త్రీలో రక్తపు గడ్డలు తలెత్తడానికి కారణమయ్యే ఈక్రింద తెలుపబడిన మరికొన్ని అదనపు కారణాలు కూడా వుంటాయి.

* రక్తపు గడ్డలు లేదా రక్తపు గడ్డల వ్యాధులకి సంబంధించిన వంశ చరిత్రని కలిగివుండటం.

* ప్రసవం సమయంలో క్ర్లిష్ట సమస్యలు తలెత్తడం లేదా సి-సెక్షన్ ద్వారా ప్రసవం సంభవించడం.

* గర్భధారణ సమయంలో మధుమేహం, గుండె లేదా ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు సంభవించడం.

గర్భధారణ సమయంలో వేరికోస్ వేయిన్స్

గర్భధారణ సమయంలో పెరిగిన రక్త ప్రవాహం నరాలు సాగే విధంగా చేసి కాళ్ళలోని ఒకేవైపు కవాటాలని దెబ్బతీయవచ్చు, ఆ విధంగా అది వేరికోస్ వేయిన్స్ సమస్యకి దారితీయవచ్చు. వేరికోస్ వేయిన్స్ కొరకు నివారణా చర్యలు అతి ప్రధానమైనవి. చికిత్స చేయకుండా వదిలేసిన తీవ్రమైన వేరికోస్ వేయిన్స్ డి.వి.టి తలెత్తడానికి ప్రధాన కారణం కావచ్చు.

డి.వి.టి తలెత్తే అపాయాన్ని నేను తగ్గించుకోవచ్చా?

రక్తం గడ్డకట్టే సమస్యని మీరు కలిగివుండటం లేదా వంశపారపర్యంగా మీరు దీన్ని కలిగివున్నారో లేదో మీయొక్క వైద్యుడిని తెలుసుకోనివ్వండి. నియమిత వ్యాయామం, సమర్థవంతమైన బరువు నిర్వహణ, మీ కాళ్ళు పైకెత్తే వ్యాయామం చేయడం, మరియు పీడనంతో కూడిన సాక్సులని ధరించడం మొదలైనవి వేరికోస్ వేయిన్స్ యొక్క అపాయాన్ని గణనీయంగా తగ్గించగలుగుతాయి.

రక్తం గడ్డకట్టే అపాయాన్ని పెంచే థ్రోంబోఫిలియా అనే సమస్యని మీరు కలిగివున్నారేమో తెలుసుకోవడానికి ఒక రక్తపరీక్ష కూడా మీకు అవసరం రావొచ్చు. ఆ సమస్య నిర్థారణ జరిగితే మీయొక్క వైద్యుడు మీకు బ్లడ్ తిన్నర్లని ఇవ్వడం ప్రారంభించవచ్చు. మరింత సమాచారం కొరకు, ఎవీస్ వాస్కులర్ సెంటర్లోని మాయొక్క వైద్యునికి కాల్ చేసి మీయొక్క సమస్యలని చర్చించండి.

Deep Vein Thrombosis Treatment In Hyderabad

For Appointments Call: 9989527715

Branches

https://www.simoneetkurt.ch/daftar-situs-slot-bonus-new-member-100-to-kecil-3x-5x-7x-8x-10x-15x-20x-di-awal/ https://www.avisvascularcentre.com/wp-content/slot-gacor/ https://www.avisvascularcentre.com/what-type-of-doctor-will-treat-my-varicose-veins/ https://ecoqld.com/slot-bonus/ https://honolulujewelrycompany.com/Hawaiian-Names/ https://ecoqld.com/wp-includes/slot-pulsa/
Home
Services
Doctors
Branches
Blog