కాలి పుళ్ళు అనేవి అరుదుగా సంభవించే వైద్య సమస్యేం కాదు. అంచనా ప్రకారం పెద్దల్లో దాదాపు 2% మంది తమ జీవితంలో ఎదో ఒక సమయంలో కాలి పుళ్ళ బారిన పడతారు. ఒక అమెరికా మరియు యూరప్‌లోనే కాదు, భారత దేశంలో కూడా సామాన్యంగా కనిపించే ఒక ఆరోగ్య సమస్య.
కాలి పుళ్ళు అనేవి చాలా నొప్పితో కూడి అసౌకర్యంగా వుంటాయి. అవగాహనా రాహిత్యం మరియు సరైన జ్ఞానం లేకపోవడం వలన, చాలా మంది ప్రజలు ప్రారంభ లక్షణాలను అలక్ష్యం చేసి ఈ సమస్యకు సకాలంలో చికిత్స తీసుకోరు.
ఇటువంటి వైద్య సమస్య గురించి మరింత తెలుసుకోవడమనేది దాని ప్రారంభంలోనే రోగ నిర్థారణ చేసి ఆ సమస్యకు సకాలంలోనే చికిత్స చేయడానికి దోహదపడే మొదటి అడుగు. ఈ బ్లాగు ద్వారా మేము జ్ఞానాన్ని మీతో పంచుకోవడమే కాకుండా కాలి పుళ్ళ గురించిన ఏడు ముఖ్యమైన నిజాలను మీతో చర్చించాలనుకుంటున్నాం. చివరి వరకూ మాతో కొనసాగండి:
1. కాలి పుళ్ళు (లెగ్ అల్సర్) అంటే ఏమిటి?
వైద్య పరిభాషలో పుండు లేదా అల్సర్ అంటే శరీరం ఉపరితంలో వుండే ఎపిథీలియం (ఉపకళా కణజాలం) లేదా పొరలో ఏర్పడే ఒక పగులు. ఉదాహరణకి నోటి పుండు అంటే నోటిపై వుండే పొరలో ఏర్పడే పగులు, అలాగే కాలి పుండు అంటే కాలి చర్మపు ఉపరితలం మీద వుండే పొరలో ఏర్పడిన ఒక పగులు. పుళ్ళు గాయం లేదా ప్రమాదం వలన సంభవించే అవకాశం వుంటుంది. నయం కావడానికి 6 వారాల కంటే ఎక్కువ సమయం తీసుకునే కాలి పుళ్ళని దీర్ఘకాలిక కాలి పుళ్ళు అని అంటారు.
2. కాలి పుళ్ళు ఏ కారణం చేత సంభవిస్తాయి?
ఐదు కాలి పుళ్ళలో నాలుగు (దాదాపు 80%) వరకూ కూడా ఒక నాళ సంబంధిత రుగ్మత వలన సంభవించి నరాల సంబంధిత కాలి పుళ్ళ జాబితాలోకి చేరతాయి. నాళాలు సరిగ్గా పనిచేయక పోవడం వలన ఈ కాలి పుళ్ళు సంభవిస్తాయి. అలా పని చేయని నాళాలు రక్తం తిరిగి గుండెకి చేర్చే ప్రక్రియని అడ్డుకొని తద్వారా రక్తం విపరీతంగా గడ్డకట్టే పరిస్థితికి దారితీస్తాయి.
చికిత్స ఆలస్యం కావడం లేదా పూర్తిగా చికిత్స తీసుకోకపోవడం లాంటివి సంభవించిన సందర్భాల్లో ఈ పరిస్థితి ఇంకా తీవ్రమయ్యి దీర్ఘకాలిక నరాల అసమర్థత మరియు లోతైన నరాల్లో రక్తం గడ్డకట్టే పరిస్థితికి (Deep Vein Thrombosis or DVT) దారితీస్తుంది.
తక్కువ సంఖ్యలో (దాదాపు 15%) నివేదించబడిన మొత్తం కాలి పుళ్ళ కేసులనేవి రక్తాన్ని గుండె నుంచి కాళ్ళకి తీసుకెళ్ళే ధమనులలో తలెత్తిన సమస్యల వలన సంభవించాయి. (నరాల కాలి పుళ్ళు సర్వ సాధారణం కాబట్టి, మనం ఈ బ్లాగులో వాటి గురించి తెలుసుకుందాం.)
3. కాలిలో ఏ భాగం పైన నరాల పుళ్ళు సంభవిస్తాయి?
నరాల పుళ్ళు అనేవి సాధారణంగా కాలి కింది భాగంలో సరిగ్గా చీలమండ పైన సంభవిస్తాయి. ప్రభావిత ప్రాంతంలో వాపు వుండి అక్కడ వేరికోస్ వేయిన్స్ అనేవి సాధారణ కంటికి కనిపిస్తాయి.
అలక్ష్యం చేయబడిన మరియు కొన్ని నెలల వరకూ కూడా వేరికోస్ వేయిన్స్‌కి చికిత్స ఆలస్యం చేయబడిన చాలా తీవ్రమైన కేసుల్లో, ఆ సంబంధిత పుండు చుట్టూ వున్న చర్మం అనేది వేరికోస్ ఎక్స్మా (తామర) కారణంగా గట్టిగా తయారయ్యి రంగుని కోల్పోతుంది. రక్త ప్రసరణలో తలెత్తుతున్న సమస్యలను తెలియజేసే ఖచ్చితమైన హెచ్చరిక ఇది.
4. నరాల పుళ్ళు ఎవరికి సంభవిస్తాయి?
నరాల పుళ్ళు హఠాత్తుగా సంభవించవు. ఉపరితల నరాల్లో గడ్డకట్టిన రక్తం వున్న వాళ్ళలో లేదా చీలమండని కదిలించడంలో సమస్యలున్న వాళ్ళలో ఈ పరిస్థితి తలెత్తుతుంది. వృద్ధులలో కాలి పుళ్ళు సర్వ సాధారణం, ముఖ్యంగా స్త్రీలలో.
5. నరాల పుళ్ళకి ఏ విధంగా చికిత్స తీసుకుంటారు?
పాడైన ప్రాంతంలో రక్త ప్రసరణని పునరుద్ధరించడమే కాలి పుళ్ళని నయం చేయడానికి ఏకైక మార్గం. సహాయక సాక్సులుగా (Support stockings) పిలవబడే పీడనంతో కూడిన సాక్సులు (Compression stockings) ధరించడం ద్వారా ఈ ఫలితాన్ని సాధించవచ్చు.
ఎక్కువ మంది రోగులకి ఆయింట్మెంట్లు లేదా క్రీములు కూడా అవసరం రావు. ఒకసారి నరాల పుళ్ళు నయం అయిన తరువాత, వేరికోస్ వేయిన్స్ వలన తలెత్తే రక్తం గడ్డకట్టడం లాంటి మూలాధార సమస్యని తొలగించుకోవడమనేది రోగికి చాలా ముఖ్యం. చికిత్స తీసుకోకపోవడం వలన ఈ నయం కాని పుళ్ళు మళ్ళీ తిరిగి సంభవించే అవకాశం వుంటుంది.
6. ఒక కాలి పుండుని మీరు నయం చేయగలుగుతారా?
సమస్యం ఉపరితల భాగంలో వున్న కేసుల్లో కాలి పుళ్ళు సులభంగా నియంత్రించబడతాయి. ఏదేమైనప్పటికీ, సమస్య లోపలి నరాల్లో వుంటే లేదా పుండు చుట్టు ప్రక్కల వున్న చర్మం ఎక్కువ మచ్చలతో గనుక నయం కాబడి వుంటే, ఆ ప్రభావిత ప్రాంతం సాధారణంగా ఈ నరాల వ్యాధి పూర్తిగా నయమైన తరువాత కూడా ఇంకా ప్రమాదకర పరిస్థితిలో వుంటుంది. ఈ పరిస్థితుల్లో ఒక చిన్న గాయం కూడా ఆ పుండు మళ్ళీ తిరిగి సంభవించేలా చేస్తుంది.
7. కాలి పుళ్ళని మనం ఎలా నివారించగలం?
మీకు గనుక వేరికోస్ వేయిన్స్ సమస్య వుంటే, మీ లోపలి నరాల్లో రక్తం గడ్డకట్టే పరిస్థితులని తగ్గించడానికి మీయొక్క వైద్యుడు మీ కొరకు బ్లడ్ థిన్నర్లని మరియు యాంటీ-కోగ్యులంట్లని సూచించవచ్చు.
చీలమండ దగ్గర బిగువుగా మరియు మోకాళ్ళ చుట్టూ వదులుగా వుండే పీడనంతో కూడిన సాక్సులని కూడా ఎక్కువ మంది వైద్యులు సూచించవచ్చు. ఇవి కాలి నుండి పై భాగంలోని గుండెకి రక్త ప్రసరణకి సహకరించి రక్త గడ్డకట్టడం వలన ఏర్పడే వాపుని తగ్గించడానికి సహకరిస్తుంది.
మీయొక్క పరిస్థితి ఇంకా తీవ్రంగా వుంటే, నాళ వ్యవస్థకు మరింత నష్టం జరగకుండ చేయడానికి ఈ పాడైన నరాలను తొలగించేందుకు కూడా సిఫారసు చేయడం జరగవచ్చు.
పూర్వ కాలంలో నరాల రుగ్మతలకు కేవలం శస్త్రచికిత్స చేసి తొలగించడం మాత్రమే ఒక మార్గంగా వుండేది. కాని ఈనాడు, లేజర్ ఉష్ణాన్ని ఉపయోగించి వేరికోస్ వేయిన్స్ అన్నింటిని కాల్చేసి, వాటిని ఒకే ఒక సిట్టింగులో తొలగించే నొప్పిలేని మరియు తక్కువ కోతతో కూడిన శస్త్రచికిత్స అవసరం లేని పద్ధతులు అందుబాటులో వున్నాయి.
ఈ పద్ధతి EVLT గా (Endo-Venous Laser Treatment) ప్రసిద్ధి చెందింది మరియు ఇది ఒక ఇంటర్వెన్షల్ రేడియోలాజిస్టు ద్వారా కేంద్రీకృత మత్తుమందుని ఉపయోగించి నిర్వహించబడుతుంది. ఇది తక్కువ సమయంలో నిర్వహించబడే విధానం. అంతేకాకుండా ఇది ఎటువంటి దుష్ప్రభావాలను కూడా కలిగించదు.
వేరికోస్ వేయిన్స్, డీప్ వేయిన్ థ్రోంబోసిస్ మరియు నరాల కాలి పుళ్ళు మొదలైన నరాల రుగ్మతలన్నిటికీ వ్యాధి నిర్థారణ మరియు చికిత్సని అందించే ఒక ప్రత్యేకమైన ఆసుపత్రే అవీస్ వాస్కులర్ సెంటర్. వేరికోస్ వేయిన్స్ వ్యాధులకి ప్రపంచ స్థాయి చికిత్సని అందించే విధంగా ఇది అత్యాధునిక మౌళిక సదుపాయాలని మరియు అత్యాధునిక వైద్య సదుపాయాలని కలిగివుంది.
ప్రపంచ స్థాయి అర్హత పొందిన ఇంటర్వెన్షల్ మరియు వాస్కులర్ శస్త్రచికిత్సా నిపుణుడు డా. రాజా వి కొప్పాలా గారి నాయకత్వంలో ఈ వైద్య కేంద్రం నడుస్తోంది. ఆయన గారు రెండు దశాబ్దాలకి పైగా వైద్యానుభావాన్ని కలిగివుండి 13000 కి పైగా రోగులకి చికిత్సనందించారు. వారందరూ కూడా అవీస్ వాస్కులర్ సెంటర్లో వారి యొక్క చికిత్సకి సంబంధించిన అనుభవం గురించి పూర్తి ఆనందంగా మరియు సంతృప్తిగా వున్నారు.
నరాల వ్యాధుల చికిత్సలో భాగంగా మీరు మీయొక్క నొప్పితో కూడిన నరాల పుళ్ళని తొలగించుకోవడానికి లేజర్ చికిత్సని చేయించుకోవాలని ఆలోచిస్తుంటే గనుకా, హైదరాబాద్‌లోనే అత్యుత్తమ నరాల శస్త్రచికిత్సా నిపుణుడైన డా. రాజా వి కొప్పాలా గారి యొక్క అపాయింట్మెంటుని బుక్ చేసుకోండి! అవీస్ వాస్కులర్ సెంటర్లో ఉత్తమ వైద్య సహాయాన్ని సరసమైన ధరలలోనే పొందండి. మీయొక్క అపాయింట్మెంటుని ఈరోజే బుక్ చేసుకోండి!