వేరికోస్ వేయిన్స్ అనేది ప్రతీ సంవత్సరం లక్షల సంఖ్యలో ప్రజలని ప్రభావితం చేస్తున్న ఒక వైద్య సమస్య. తమ దెబ్బతిన్న నరాలకై ఒక సరైన చికిత్సా మార్గం కొరకు అన్వేషిస్తున్న వారిలో మీరు కూడా వున్నారా? శస్త్రచికిత్స లేదా స్క్లెరోథెరపీ, లేదా అబ్లేషన్ పద్ధతులు లాంటి తక్కువ కోతతో కూడిన చికిత్సలనేవీ వేరికోస్ వేయిన్స్‌కి అందుబాటులో వున్న చికిత్స మార్గాలలో ఉత్తమమైనవి. ఇవి మరణించిన నరాలను మూసివేయడానికి లేదా వాటిని పూర్తిగా తొలగించడానికి ఉద్దేశించబడ్డాయి. రక్తం తిరిగి ఆరోగ్యవంతమైన నరాల్లోకి మరలేలా ఈయొక్క ప్రక్రియలు వేడిని మరియు స్క్లెరోసెంట్లను ఉపయోగిస్తాయి.
వైద్యపరమైన జిగురు థెరపీ (మెడికల్ గ్లూ థెరపీ) లాంటి కొత్త పధ్ధతి రాకతో, నరాలకి వేగవంతంగా మరియు మరింత సౌకర్యవంతమైన పద్ధతిలో చికిత్స చేయడం ఇప్పుడు సాధ్యపడుతోంది. ఈ ప్రక్రియలో ఒక అదనపు ప్రయోజనం కూడా వుంటుంది. అదేంటంటే, అబ్లేషన్ థెరపీలో ఉపయోగించే వేడి లేదా స్క్లెరోసెంట్ల యొక్క అవసరం ఈ ప్రక్రియలో వుండదు. ఆ విధంగా నరానికి గాయం జరిగే అవకాశాన్ని ఇది లేకుండా చేస్తుంది.
పీడనంతో కూడిన సాక్సుల అవసరంలేని సౌకర్యవంతమైన చికిత్స
గ్లూ థెరపీ ప్రక్రియలో మరణించిన నరంపై కేవలం ఒక చిన్న సూది రంధ్రం మాత్రమే అవసరం వుంటుంది. ఈ ప్రక్రియ జరిగే సమయంలో మరియు ప్రక్రియ తరువాత రోగులు తక్కువ నొప్పిని అనుభవిస్తారు. మరొక ప్రయోజనం ఏంటంటే, ప్రక్రియ సమయంలో పలురకాల మత్తుమందు ఇంజెక్షన్లను లేదా సెలైన్ ఇంజెక్షన్లను ఇచ్చే అవసరం వుండదు. దీనివలన ఇది ఇతర ఆరోగ్య సమస్యలతో వున్న పెద్ద వయసు రోగులకి కూడా యోగ్యకరంగా వుంటుంది.
ఈ ప్రక్రియ సమయంలో కేంద్రీకృత మత్తుమందుని ఇవ్వడం జరుగుతుంది, ఆ విధంగా మోకాలి దగ్గరి చర్మం మోద్దుబారే విధంగా చేయడం జరుగుతుంది. ఆ తరువాత నరంలోనికి ఒక సూదిని ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఆ సూదిగుండా ఒక తీగని చొప్పించి సూదిని లాగివేయడం జరుగుతుంది. తరువాత ఒక క్యాథటర్‌ని తీగగుండా నరంలోనికి చొప్పించడం జరుగుతుంది. జిగురుని ఆ క్యాథటర్ గుండా జొప్పించి దానిని వెనక్కి లాగివేయడం జరుగుతుంది. వేరికోస్ వేయిన్స్ పైన వున్న చర్మం మీద 30 సెకన్ల వరకూ ఒత్తిడిపెట్టి వుంచడం జరుగుతుంది. కొన్ని నిమిశాలలో జిగురు పాడైన నరాన్ని మూసేసి దానిని నిర్వీర్యం చేస్తుంది. ఇప్పుడు, ఇక తరువాత మరొక చోట మరొక ప్రక్రియ కొరకు జిగురుని వాడటం జరుగుతుంది, అదే విధంగా క్యాథటర్‌ని వెనక్కి లాగి ఒత్తిడిని పెట్టడం జరుగుతుంది. మరణించిన నరం పొడవునా ఈయొక్క ప్రక్రియని మళ్ళీ మళ్ళీ నిర్వహించడం జరుగుతుంది. ఈ మొత్తం ప్రక్రియ కూడా ఒక అల్త్రాసోనిక్ మార్గదర్శకత్వంలో జరుగుతుంది.
నరాలకి అందించే ఇతర ఏ రకమైన చికిత్సలోనైనా సరే, వైద్య ప్రక్రియ సమయంలో మరియు ఆ ప్రక్రియ తరువాత నిరంతరంగా పీడనపు సాక్సుల వాడకమనేది అవసరమవుతుంది. కానీ గ్లూ థెరపీ ఎంతో ప్రత్యేకమైనది. దీనిలో చికిత్స తరువాత సాక్సుల అవసరం వుండదు. అందువలన, రోగులకి ఇది మరింత సౌకర్యవంతమైన మరియు సమస్యలులేని కోలుకునే సమయాన్ని అందిస్తుంది.
జిగురు చికిత్స యొక్క ఫలితాలు & ప్రయోజనాలు.
1. జిగురు థెరపీలో నరాలు దీర్ఘకాలంలో మూసుకుపోయే రేటు >96% శాతంగా వుందని రుజువు ఆధారిత ఫలితాలు వెల్లడిస్తున్నాయి.
2. వైద్య ప్రక్రియ చేసే సమయంలో నొప్పి తక్కువగా వుంటుంది కాబట్టి రోగి యొక్క సంతృప్తి ఈ చికిత్సకి సంబంధించి ఎక్కువ వుంది.
3. జిగురు చికిత్స వేగవంతమైనది, మరియు తక్కువ సమస్యలతో తక్కువ నొప్పిని కలిగివుంటుంది. చుట్టూవుండే నరాలకి ఎటువంటి దెబ్బతగిలే అవకాశం కూడా వుండదు, మరీ ముఖ్యంగా పెరిఫెరల్ నరాలకి.
4. సాధారణంగా జిగురు చికిత్సలో బ్యాండేజీలు కానీ లేదా పీడనంతో కూడిన సాక్సుల అవసరంగానీ వుండదు.
5. తాత్కాలిక రోగి విధానంలోనే ఈ ప్రక్రియ నిర్వహించడం జరుగుతుంది.
6. ఒక అనుభవజ్ఞుడైన మరియు నైపుణ్యం కలిగిన ఇంటర్వేన్షల్ రేడియోలాజిస్ట్ ద్వారా ఈ ప్రక్రియ నిర్వహించబడితే రోగికి అత్యంత భద్రత వుంటుంది.
7. ఈ వైద్యపరమైన జిగురులోని మూలకాలు గొప్పగా వుంటాయి. అందువలన ఆ జిగురు సాధారణ రక్తప్రసరణలోనికి వ్యాప్తి చెందకుండా ఎక్కడ అమర్చబడిందో అక్కడే నిలకడగా వుంటుంది.
మరణించిన నరానికి మీరు స్క్లెరోథెరపీ లేదా శస్త్రచికిత్స చేయించి ఉండకపోతే, మరియు జిగురు చికిత్సకి సరిపోయేలా వున్న “ఖచ్చితమైన నరాన్ని” గనుక అల్ట్రాసౌండ్ పరీక్ష కనిపెట్టివుంటే, అపుడు మీరు జిగురు చికిత్సకి సరైన వ్యక్తి అయివుండవచ్చు. ఈయొక్క చికిత్స గురించిన అదనపు సమాచారం కొరకు, ఎవీస్ వాస్కులర్ సెంటర్లో మాయొక్క నిపుణులకి కాల్ చేసి, వెంటనే ఒక అపాయింట్‌మెంట్‌ని బుక్ చేసుకోండి.
Varicose Veins Treatment In Hyderabad | Bengaluru |Mysore | Visakhapatnam | Vijayawada | Chennai |Coimbatore | Tirupati | Rajahmundry | Kolkata | Madurai | Pondicherry | Delhi|
For Appointment Call
Telangana: 9989527715
Andhra Pradesh: 9989527715
Tamilnadu: 7847045678
Karnataka: 8088837000
Kolkata: 9154089451
Delhi : 9701688544