ఇటీవలీ కాలంలో వేరికోస్ వేయిన్స్ కొరకు అందించబడుతున్న చికిత్సా విధానాల్లో జరిగిన నాటకీయమైన అభివృద్ధిని మనం చూడవచ్చు. పూర్వం ఈ సమస్యకి కేవలం వెయిన్ స్ట్రిప్పింగ్ మాత్రమే ఒకే ఒక చికిత్సా మార్గంగా వుండేది, ఆ చికిత్సలో పాడైన నరానికి కేంద్రీకృత మత్తుమందుని (స్పర్శనివారిణి) ఇవ్వడం దాన్ని తొలగించడం జరిగేది. అంతేకాకుండా, రోగి పూర్తిగా నయం కావడానికి కొన్ని వారాల సమయం కూడా పట్టేది. కాని ఈనాడు వెయిన్ స్ట్రిప్పింగ్ అనే చికిత్స దాదాపుగా ఎవరికీ నిర్వహించబడటం లేదు. దీని తరువాత మినిమలీ ఇన్వేజివ్ థర్మల్ అబ్లేషన్ అనే ప్రక్రియ అందుబాటులోకి వచ్చింది. ఈ ప్రక్రియలో వేరికోస్ వేయిన్స్‌కి చికిత్స చేసి వాటిని మూసి వేయడానికి లేజర్ లేదా రేడియో ఫ్రీక్వెన్సీని ఉపయోగించడం జరిగేది. ఏదేమైనప్పటికీ, ఈ ప్రక్రియలో ఎక్కువగా కేంద్రీకృత మత్తుమందుని ఇవ్వాల్సి వచ్చేది.
ఇక ఈ చికిత్స కొరకు వైద్యపరమైన “గ్లూని” (జిగురు) ఉపయోగించడమే ఇటీవలే వేరికోస్ వేయిన్స్ కొరకు అభివృద్ధి చేయబడిన ఒక చికిత్సా విధానం. ఈ సులభమైన వైద్య విధానం మీ వేరికోస్ వేయిన్స్‌ని అతికించేస్తుంది. ఆ తరువాత శరీరం ఆ మూసివేయబడిన నరాన్ని తిరిగి గ్రహిస్తూనే రక్తాన్ని ఆ ప్రదేశంలోని ఇతర ఆరోగ్యవంతమైన నరాల ద్వారా మళ్ళిస్తుంది. ఆ విధంగా శరీరం ఆ నరాన్ని లోపలికి గ్రహించడం ఫలితంగా ఆ నరం పూర్తిగా మాయమైపోతుంది.
వేరికోస్ వేయిన్స్ కొరకు చేసే గ్లూ చికిత్సా విధానం ఏమిటి?
ఈ చికిత్సలో ఒక ప్రత్యేక రకమైన “సూపర్‌గ్లూ” ఉపయోగించబడుతుంది. ఇది దెబ్బతిన్న కవాటాలని కలిగివున్న నరాలని మూసివేస్తుంది. తీవ్రమైన వేడితో నరాలని మూసివేసే ఎడోథర్మల్ అబ్లేషన్ (EVLA) ప్రక్రియ లేదా “వెయిన్ స్ట్రిప్పింగ్” ప్రక్రియలో లాగానే ఈ గ్లూ చికిత్స కూడా పనిచేస్తుంది.
గ్లూ చికిత్స ఎలా నిర్వహించబడుతుంది?
ముందుగా కేంద్రీకృత మత్తుమందుని ఇచ్చి మోకాలి దగ్గరి చర్మాన్ని మొద్దుబారేలా చేయడం జరుగుతుంది. ఆ తరువాత, ఆ నరంలోనికి ఒక సూదిని చొప్పించడం జరుగుతుంది. ఆ సూదిలోంచి ఒక తీగని లాగి ఆ తరువాత సూదిని తొలగించడం జరుగుతుంది. ఆ తరువాత ఆ తీగ వెంబడి ఒక గొట్టాన్ని చొప్పించడం జరుగుతుంది. ఇక ఆ గొట్టంలోంచి గ్లూని (జిగురుని) పంపించి ఆ గొట్టాన్ని వెనక్కి లాగేయడం జరుగుతుంది. 30 సెకన్ల వరకూ ఆ వేరికోస్ వేయిన్స్ పైభాగపు చర్మం పైన ఒత్తిడిని కలిగిచడం జరుగుతుంది. కొన్ని నిమిషాల్లో ఈ జిగురు ఆ నరాన్ని మూసివేస్తుంది. ఆ తరువాత మరొక చోట మరో కొంచెం జిగురుని పంపించడం, గొట్టాన్ని లాగివేయడం మరియు ఒత్తిడిని కలిగించడమనే ప్రక్రియ చేయడం జరుగుతుంది. ఈ ప్రక్రియని మొత్తం పాడైన నరాలన్నింటికీ చేయడం జరుగుతుంది. అల్ట్రాసోనిక్ మార్గదర్శకత్వంలో ఈ మొత్తం ప్రక్రియ నిర్వహించబడుతుంది.
గ్లూ చికిత్స వలన ప్రత్యేకమైన ప్రయోజనాలు ఏమిటి?
- ఎండోవీనస్ అబ్లేషన్ చికిత్సా ప్రక్రియల్లో (లేజర్, రేడియోఫ్రీక్వన్సీ) లాగా, ఈ ప్రక్రియలో ఎక్కువ మత్తుమందు ద్రవాన్ని ఇవ్వడం జరుగదు.
- ఎండోథర్మల్ అబ్లేషన్ లేదా సర్జికల్ స్ట్రిప్పింగ్ ప్రక్రియలో జరిగే ఏవైనా అసౌకర్యమైన గాయపు మచ్చలు ఈ గ్లూ చికిత్సలో మాత్రం జరగవు.
- మిగతా చికిత్సా పద్దతులలో కొన్ని రోజుల వరకూ అతికించబడిన నరాలపైన పీడనంతో కూడిన పట్టీలు గాని లేదా సాక్సులు గానీ అమర్చడం అవసరమవుతుంది, కాని ఈ గ్లూ చికిత్సా విధానంలో మాత్రం అటువంటి పట్టీలు గానీ లేదా పీడనంతో కూడిన సాక్సులని గానీ ఉపయోగించాల్సిన అవసరం లేదు. చికిత్సా సమయంలో చిన్న చిన్న కోతల ద్వారా నరాలను తొలగించినపుడు, చిన్న చిన్న గాయపు మచ్చలు ఏర్పడే అవకాశం వుంటుంది కాని, వాటిని కేవలం 24 గంటల పీడనాన్ని ఉపయోగించడం ద్వారా తగ్గించవచ్చు.
- కొన్ని రోజుల వరకూ ఎటువంటి కఠినతరమైన పనులను చేయొద్దని సిఫారసు చేయబడినప్పటికీ, సాధారణ కార్యకలాపాలు వెంటనే తిరిగి చేసుకోగలగడం సాధ్యపడుతుంది.
- సాధారణ మత్తుమందు అవసరం వుండదు. ఇది ఒకేరోజు ప్రక్రియ లాగానే నిర్వహించబడుతుంది.
- మొత్తం ప్రక్రియ ఒకే ఒక గంటలో పూర్తవుతుంది. అంతేకాకుండా, రోగులు త్వరగా కోలుకునే అవకాశం కూడా వుంటుంది.
నేను గ్లూ చికిత్సకి సరైన వ్యక్తినేనా?
2 సెం.మీ లేదా అంతకంటే ఎక్కువ వ్యాసార్థం వున్న వేరికోస్ వేయిన్స్ పైన లేదా కాలిలో లోతుగా దాక్కొని వున్న వేరికోస్ వేయిన్స్ పైన ఈ గ్లూ చికిత్సా విధానం సమర్థవంతంగా పనిచేస్తుంది. మీయొక్క వేరికోస్ వేయిన్స్ కొరకు స్క్లెరోథెరపీ లేదా ప్రభావిత నరంపైన శస్త్రచికిత్స జరిగి ఉండకపోతే మీరు ఈ చికిత్సకి సరైన వ్యక్తి అయ్యే అవకాశం వుంటుంది.
వేరికోస్ వేయిన్స్ చికిత్సలో ఆశించే ఫలితాలని అందిస్తూ ఎందరో రోగులకి ప్రయోజనం చేకూర్చిన అధునాతనమైన చికిత్సా మార్గాన్ని ఎవీస్ వాస్కులర్ సెంటర్ సమర్థవంతంగా స్థాపించింది. మీయొక్క నరాల సమస్యలని బాగు చేసేందుకు మీరు కలిగివున్న వివిధ చికిత్సా మార్గాలను మీకు వివరించడానికి ఎవీస్ వాస్కులర్ సెంటర్లోని వైద్యులు ఎల్లప్పుడూ సిద్ధంగా వుంటారు. ఈరోజే మాకు ఫోన్ చేసి మీయొక్క అపాయింట్‌మెంట్‌ని బుక్ చేసుకోండి.
Varicose Veins Treatment In Hyderabad | Bengaluru |Mysore | Visakhapatnam | Vijayawada | Chennai |Coimbatore | Tirupati | Rajahmundry | Kolkata | Madurai
For Appointment Call
Telangana: 9989527715
Andhra Pradesh: 9989527715
Tamilnadu: 7847045678
Karnataka: 8088837000
Kolkata: 9154089451