విశాల్ అనే అరవై సంవత్సరాల వ్యక్తి గత ఐదు సంవత్సరాలుగా టైప్ 2 మధుమేహంతో జీవిస్తున్నాడు. ఎప్పుడైనా సరే తన రక్తంలోని షుగర్ స్థాయిలని అదుపులో ఉంచుకోవడం గానీ మరియు సూచించబడిన మందులను తీసుకోవడం గానీ అంతా బాగానే చేసేవాడు. కానీ,ఆయన తన కుడి పాదం మీద ఎంతకీ నయంకాని ఒక కురుపుని గుర్తించాడు. అదొక చిన్న గాయమే అనుకొని దాని మీద అంత శ్రద్ధ వహించలేదు. కాని, కాలక్రమేణా, ఆ కురుపు మరింత నొప్పిగా మారింది. అంతేకాకుండా, దాని నుండి చెడు వాసన కూడా రావడాన్ని గుర్తించాడు.
అసౌకర్యంగా ఉన్నప్పటికీ, ఆ పుండు చికిత్స తీసుకొనేంతటి తీవ్రమైనది కాదని భావించాడు. అలా ఆయన దానిని పట్టించుకోకుండా ఉండిపోయాడు. వారాలు నెలలుగా మారిన తరువాత, విశాల్ తన కుడి కాలు వాచిపోవడం, అతని వేళ్ళలో జలదరించినట్లుగా స్పర్శ కలగడం లాంటి లక్షణాలని గమనించాడు. అలసట కూడా మొదలవడం, తన కాలిలో నిరంతర నొప్పి వలన నిద్రపోవడం కష్టంగా మారడం కూడా మొదలైంది.
చివరికి, తన కుటుంబం నచ్చజెప్పడంతో ఒక వైద్యుడిని కలవాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడే అతనికి కాలిలో అల్సరు వుందని నిర్థారణ జరిగింది. ఇది మధుమేహంలో సాధారణంగా తలెత్తే ఒక క్లిష్ట సమస్య. ఆ అల్సరు ఇన్‌ఫెక్షన్‌కి గురైంది, ఆ ఇన్‌ఫెక్షన్ అనేది చుట్టూ వున్న కణజాలాలకి వ్యాపించింది, ఆ విధంగా ప్రాణాంతకమైన సెల్యులైటిస్ అనే పరిస్థితికి దారితీసింది. ఆ ఇన్‌ఫెక్షన్‌కి చికిత్స కొరకు విశాల్ ఆసుపత్రిలో చేరవలసి వచ్చి, నరాల ద్వారా యాంటీబయోటిక్స్ తీసుకోవలసి వచ్చింది.
వైద్య సహాయం తీసుకోవడంలో ఆయన చేసిన ఆలస్యం అతని పాదానికి మరియు కాలికి విపరీతమైన హాని చేసింది. ఆ విధంగా, ప్రస్తుతం ఆయన గాయాన్ని అదుపులో వుంచి తదుపరి క్లిష్టతలని నివారించడానికి మరింత తీవ్రమైన మరియు దీర్ఘకాలికమైన చికిత్స అతనికి అవసరం. చికిత్స చేయకుండా వదిలివేసిన కారణంగా, ఇన్‌ఫెక్షన్ అనేది వ్యాపించి, బాగుచేయలేనంత తీవ్రంగా కణజాలాన్ని దెబ్బతీసింది. ఇపుడు అవయవాన్నే తొలగించే అపాయకర స్థితిలోకి ఆయన పడిపోయాడు.
మీ మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవడం అనేది మీ నరాలని రక్షించి అల్సరు ఏర్పడకుండా నివారించగలుగుతుంది.
రక్తంలో అధిక చక్కర స్థాయిలు మీ కాళ్ళలోని రక్త నాళాలని మరియు నాడులని దెబ్బతీయగలవు. ఇది శరీరంలో సరిగ్గాలేని రక్తప్రసరణకి కారణమయ్యి నాడులు దెబ్బతినడానికి దారితీస్తుంది. ఇది కాలి అల్సర్లు తలెత్తడానికి కారణమయ్యే ఒక తీవ్రమైన అపాయకర కారణంగా వుంటుంది. ఒక ఆరోగ్యవంతమైన భోజనం, రోజూ వ్యాయామం చేయడం, మరియు అవసరమైన మందుల వాడకం ద్వారా రక్తంలోని షుగర్ స్థాయిలని ఎప్పటికప్పుడు అదుపులో ఉంచుకోవడం ద్వారా మీరు ఈయొక్క క్లిష్టతలని నివారించవచ్చు.
పాదాలలోని మరియు కాళ్ళలోని నాడులకు రక్తాన్ని అందించే చిన్న రక్త నాళాలు దెబ్బతిన్నపుడు, నొప్పి మరియు తిమ్మిరి లాంటివి సంభవించవచ్చు. అంతేకాకుండా రోగులు తమ పాదాలలో స్పర్శ తగ్గడంతో పాటుగా సూదులు గుచ్చినట్లుగా ఉంటోందని చెబుతారు. తరువాత, స్పర్శ లేకపోవడం వలన తగిలిన గాయాలు గుర్తించబడనపుడు, అవి గుర్తించబడక ముందే అల్సర్లు తలెత్తవచ్చు మరియు పెద్దగా మారిపోవచ్చు.
మధుమేహ నిర్వహణ
పళ్ళు, కాయగూరలు, ధాన్యాలు, లీన్ ప్రోటీన్లు, మరియు ఆరోగ్యవంతమైన క్రొవ్వు పదార్థాలు మీ రక్తంలోని చక్కర స్థాయిలని అదుపులో వుంచి, క్లిష్ట సమస్యలు తలెత్తే అవకాశాలని తగ్గించగలవు. నోటి ద్వారా ఇచ్చే మందులు, లేదా ఇన్సులిన్ ఇంజక్షన్లు గనుక సూచించబడితే, వాటిని తప్పకుండా తీసుకోవాలి.
వారానికి కనీసం 4 నుండి 5 రోజుల వ్యాయామం మీయొక్క ఇన్సులిన్ లోపాన్ని మెరుగుపరచి మీయొక్క రక్తంలో చక్కర స్థాయిలని తగ్గించుకొనేలా మీకు సహకరిస్తుంది.
మీకు సిగరెట్ తాగే అలవాటు గనుక వుంటే, ఆ అలవాటుని మానుకోవడమే ఉత్తమం. ఎందుకంటే అలా చేయడమనేది మధుమేహ సంబంధిత క్లిష్టతలని తగ్గిస్తుంది.
మీయొక్క వైద్యుడి పరిధిలో వుండటం ద్వారా మీరు మీయొక్క మధుమేహాన్ని పర్యవ్యేక్షిస్తూ దానిని అదుపులో ఉంచుకోవలసి వుంటుంది. ఎవీస్ వాస్కులర్ సెంటర్లో, మీయొక్క పరిస్థితి యొక్క తీవ్రతను బట్టి ఒక ప్రత్యేకమైన చికిత్సా ప్రణాళిక మాయొక్క నిపుణులైన వైద్యుల ద్వారా రూపొందించబడుతుంది.
Venous Ulcer Treatment Hyderabad | Vijayawada | Visakhapatnam
For Appointments Call : 9989527715