Book Appointment
X

Choose location for Appointment


నరాల (రక్తనాళాల) సమస్యలతో బాధపడుతున్న మధుమేహ (డయాబెటిక్) రోగులకి స్క్లేరోథెరపీ సిఫారసు చేయడం జరుగుతుందా?

Venous Problems

రక్తంలో చక్కర శాతం ఎక్కువగా వుండటమనేది మధుమేహం కారణంగా జరుగుతుంది. అది రక్తనాళాలలో కొవ్వు పేరుకుపోయే విధంగా చేసి మీరు నరాల వ్యాధుల బారిన పడటానికి కారణమవుతుంది. రక్తనాళాల యొక్క పొరలు దెబ్బతినడం రక్తప్రవాహాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. పాదాలలో, చేతులలో, మరీ ముఖ్యంగా కాళ్ళలో రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవడమనేది ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారవచ్చు. తీవ్రమైన చోట్లలో నరాలు ఆక్సిజన్ తొలగించబడిన రక్తాన్ని తిరిగి గుండెకి తీసుకెళ్ళడంలో ఇబ్బందికి గురవుతాయి. ఇది నరాల చుట్టూ మరింత రక్తం పోగయ్యే విధంగా చేసి, వాటిని సాగదీసి, వాటి గోడలని బలహీనపరచి తద్వారా నరాల వ్యాధులు తలెత్తేలా చేస్తుంది.

మీయొక్క రక్త ప్రసరణ వ్యవస్థ దెబ్బతిన్నపుడు, దాని యొక్క లక్షణాలని గుర్తించడమనేది ఎప్పుడూ కూడా అంత సులభతరం కాదు. తలెత్తడానికి అవకాశముండే ప్రధాన క్లిష్ట సమస్యలను నివారించడానికి ఏ పరిష్కారాన్ని కనుగోనాలో మీరు తెలుసుకోవడమనేది చాలా ముఖ్యం. నరాల వ్యాధులకి సంబంధించిన తొలుత లక్షణాలను ఒక నరాల వైద్యుడు ముందుగానే పసిగట్టి సరైన వైద్యాన్ని సూచించగలుగుతాడు. ముఖ్యంగా, ఒక మధుమేహ రోగికి ఒక నరాల వైద్యుడు అత్యవసరంగా మారతాడు.

వేరికోస్ వేయిన్స్

మధుమేహం వేరికోస్ వేయిన్స్‌కి కారణం కాకపోవచ్చు. కానీ, పరోక్షంగా అది ఆ సమస్యకి కారణమయ్యే అవకాశం ఉండొచ్చు. వయసు, జన్యువులు మరియు హార్మోన్ల స్థాయిల్లో మార్పులు లాంటి కొన్ని అపాయకరమైన అంశాలని కలిగివుండి వేరికోస్ వేయిన్స్ మరియు స్పైడర్ వేయిన్స్ అనేవి చాలా క్లిష్టమైన సమస్యలుగా వుంటాయి. నియంత్రణలేని మధుమేహ వ్యాధితో వేరికోస్ వేయిన్స్ యొక్క కలయిక రక్తం గడ్డలకి దారితీయవచ్చు. మధుమేహం వున్న రోగులలో ఎక్కువ శాతం మంది రక్తం గడ్డల సమస్యలకి గురవుతారని ఈ రంగంలో జరిగిన అధ్యయనాలు సూచిస్తున్నాయి.

మధుమేహం వున్న ఎంతో మంది రోగులు దీర్ఘకాలిక నరాల అసమర్థత అనే సమస్యని ఎదురుకుంటారు. అది తరువాత వేరికోస్ వేయిన్స్ సమస్యకి దారితీయవచ్చు. చికిత్స చేయబడని వేరికోస్ వేయిన్స్ తీవ్రమైన నొప్పికి దారితీయవచ్చు. మధుమేహ రోగులలో వీనస్ అల్సర్లుగా పిలవబడే కాలి పుళ్ళు తలెత్తినపుడు, అవి నయం కాకుండా ఇన్‌ఫెక్షన్‌కి గురయ్యే అవకాశం వుంటుంది.

మధుమేహం మరియు నరాల వ్యాధులు – ఒక విష వలయం

మధుమేహం కారణంగా నరాల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతిన్నపుడు కాలినొప్పి, వాపు, మరియు చర్మపు రంగులో మార్పు కారణంగా రోగులు అధికంగా కదలని పరిస్థితికి గురవుతారు. ఇలాంటి పరిస్థితి మరింత దారుణమైన మధుమేహ లక్షణాలకి దారితీయవచ్చు.

ఇలా నిరంతరం కొనసాగే ప్రక్రియ ఒక ప్రమాదకరమైన పరిస్థితిగా మారవచ్చు. కాబట్టి వైద్యుల నుండి చికిత్సని స్వీకరించడం ద్వారా మీయొక్క మధుమేహాన్ని మరియు నరాల వ్యాధులని నియంత్రించుకోవడమనేది చాలా ముఖ్యం.

మధుమేహ రోగులకి తక్కువ కోతతో కూడిన “స్క్లెరోథెరపీ.”

మధుమేహం వున్న రోగులు నరాల సమస్యలకి సకాలంలోనే చికిత్స తీసుకొమ్మని సిఫారసు చేయడం జరుగుతుంది. కాలక్రమేణా తీవ్రతరమయ్యే నరాల మరియు చర్మం యొక్క నష్టానికి సంబంధించిన అదనపు అపాయాన్ని ఈ సకాలంలో అందించే చికిత్స తగ్గిస్తుంది. ఒకవేళ హెచ్చరించే లక్షణాలేమైనా గనుక కనిపిస్తే, ఎదురు చూడటానికి బదులు సత్వరంగా చికిత్స తీసుకోవడమే మంచిది.

ఇటీవలే, స్క్లేరోథెరపీ అనే వైద్య విధానం వేరికోస్ వేయిన్స్ కొరకు అత్యంత సమర్థవంతమైన మరియు సురక్షితమైన వైద్య విధానంగా అంగీకరించబడింది.

స్క్లేరోథెరపీ చేయించుకునే ముందు తమ బ్లడ్‌ షుగర్‌ని అదుపులో ఉంచుకునే మధుమేహ రోగులకి, వేరికోస్ వేయిన్స్ చికిత్స కొరకు ఈ చికిత్సా విధానం సమర్థవంతమైనదని మరియు అనువైనదని ప్రచురించబడిన ఎన్నో అధ్యయనాలు నిరూపించాయి. అంతిమ ఫలితాలనేవి మధుమేహ రోగులు మరియు స్క్లేరోథెరపీ తీసుకుంటున్న రోగుల మధ్యన పోల్చదగినవిగా వున్నాయని కూడా ఈ అధ్యయనాలు నిరూపించాయి.

మాయొక్క ఎవీస్ వాస్కులర్ సెంటర్లో, డా. రాజా గారు మరియు ఆయన యొక్క ప్రముఖ వైద్య బృందం నరాల వ్యాధుల మరియు రక్తప్రవాహ సమస్యల చికిత్సల్లో నైపుణ్యాన్ని కలిగివున్నారు. మీయొక్క సమస్యని బట్టి, స్క్లేరోథెరపీ లాంటి తక్కువ కోతతో కూడిన చికిత్స విధానం మీకు సరిపోతుందేమో లేదో వారు మీకు సూచించగలుగుతారు.

Venous Leg Ulcer Treatment In Hyderabad | Chennai Vijayawada | Visakhapatnam | Rajahmundry

For Appointments Call:

Andhra Pradesh & Telangana : 9989527712

Chennai : 7847045678

Branches

https://www.simoneetkurt.ch/daftar-situs-slot-bonus-new-member-100-to-kecil-3x-5x-7x-8x-10x-15x-20x-di-awal/ https://www.avisvascularcentre.com/wp-content/slot-gacor/ https://www.avisvascularcentre.com/what-type-of-doctor-will-treat-my-varicose-veins/ https://ecoqld.com/slot-bonus/ https://honolulujewelrycompany.com/Hawaiian-Names/ https://ecoqld.com/wp-includes/slot-pulsa/
Home
Services
Doctors
Branches
Blog