వేరికోస్ ఎక్జీమా లేదా వీనస్ ఎక్జీమా, అలాగే స్టేసిస్ ఎక్జీమాగా కూడా పిలవబడే ఈయొక్క చర్మ వ్యాధి వేరికోస్ వేయిన్స్ వున్న వ్యక్తులలో సాధారణంగా కనిపించే ఒక దీర్ఘకాలిక చర్మ వ్యాధి. నరాల అసమర్థత సమస్యలోని పైదశలలో ఈయొక్క వేరికోస్ ఎక్జీమా సంభవిస్తుంది. డెబ్బై ఏళ్ళు పైబడిన వారిలో దాదాపు 70% శాతంగా ఉంటూ, ప్రపంచ వ్యాప్తంగా కొన్ని లక్షల మంది దీని బారిన పడుతున్నారు.
వేరికోస్ ఎక్జీమాకి ఏది కారణమవుతుంది?
వివిధ రకాల వయసువారిలో, ధమనులలోని రక్త ప్రవాహంతో పోల్చినపుడు నరాలలోని రక్త ప్రవాహ వేగం తక్కువగా వుంటుంది. నియమిత ఎడంలో నరాల పొడవునా వుండే కవాటాలు రక్తం ఒకే దిశలో గుండెవైపుకి పోయేలా చేయడంతో పాటు నాళాల్లో ఒత్తిడి కూడా తక్కువగా ఉండేలా చేస్తాయి. కాళ్ళలో అడుగు భాగం గుండెకి దూరంగా వున్న ప్రదేశం కారణంగా, వాటిలోని నరాలు సులభంగా హానికి గురయ్యేలా వుంటాయి.
ఎక్కువ విమాన ప్రయాణం తరువాత లేదా ఎక్కువ గంటలు కూర్చొని వున్న తరువాత మీయొక్క పాదాలు ఎందుకు వాచిపోతాయో మీరెప్పుడైనా ఆలోచించారా? ఎక్కువ గంటలు కదలకుండా కూర్చొని వున్నపుడు నరాలలో ఒత్తిడి పెరగడం వలన, గుండెకి చేరే రక్తం నెమ్మదిగా ప్రయాణిస్తుంది. నరాలలో అధిక ఒత్తిడి ద్రవాన్ని దగ్గరున్న కణజాలలోనికి కారిపోయేలా చేస్తుంది, అది పాదాల వాపుకి కారణం అవ్వొచ్చు. ద్రవం అనేది చుట్టు ప్రక్కలున్న కణజాలాలలోనికి కారిపోయినాకొద్దీ వాపు అనేది మరీ ముఖ్యంగా చీలమండలో కనిపిస్తుంది మరియు సాధారణంగా చర్మం కందిపోవడం, రంగుమారడం జరుగుతుంది. ఈ పరిస్థితి చివరికి వేరికోస్ ఎక్జీమాకి దారితీస్తుంది.
చర్మం నల్లగా, పెళుసుగా, దురదగా, మరియు పొడిగా మారే అవకాశం వుంది. ఇతర తీవ్రమైన లక్షణాలు ఈక్రింది విధంగా వుంటాయి.
- మీయొక్క కాళ్ళలో వాపు పెరుగుతూనే వుడటం.
- చర్మం విరిగిపోయి నొప్పితో కూడిన కురుపులు లేదా పుళ్ళు తలెత్తడం.
- పగిలిన చర్మం.
- చర్మంపైన చీము నిండిన పొక్కులతో, ఎక్జీమా స్రవించడం.
వేరికోస్ ఎక్జీమాని కలిగించే అపాయక కారణాలు
వేరికోస్ వేయిన్స్ మరియు ముసలి వయసు, ఈ రెండు కారణాలు మీకు ఎక్జీమా తలెత్తే అవకాశాలని పెంచుతాయి. ఊబకాయంతో వుండడం లేదా గర్భంతో వుండటం కూడా మీకు ఎక్జీమా తలెత్తే అవకాశాలను పెంచవచ్చు. ఎందుకంటే ఈ సమయంలో నరాల మీద ఎక్కువ ఒత్తిడి పడుతుంది కాబట్టి.
డీప్ వెయిన్ థ్రోంబోసిస్, గుండె వైఫల్యం, కిడ్నీ వ్యాధులు, సెల్యూలైటిస్, మరియు అధిక రక్త పోటు లాంటి ఆరోగ్య సమస్యలు మీయొక్క అవయవాలలో రక్త ప్రవాహాన్ని ప్రభావితం చేసి చర్మం దెబ్బతినే అవకాశాలను పెంచవచ్చు.
నరాల సంబంధిత చర్మ వ్యాధుల అపాయాన్ని తగ్గించే అవకాశం
ఈయొక్క అపాయాన్ని తగ్గించడానికి కీలకమైన చర్య రక్త ప్రసరణని మెరుగుపరచడమే. ప్రతిరోజు నడవడం మరియు వ్యాయామం ఈ విషయంలో సహకరిస్తాయి. మీకు వేరికోస్ వేయిన్స్ వుంటే, అంతేకాకుండా ఇంతకూ ముందు డీప్ వెయిన్ థ్రోంబోసిస్ సంభవించిన చరిత్ర వుంటే గనుకా, మీయొక్క మొత్తం జీవితంలో మీ కాళ్ళపైన అధిక శ్రద్ధ పెట్టడమనేది అవసరం. దీని వలన వేరికోస్ ఎక్జీమా లాంటి సమస్యలు భవిష్యత్తులో రాకుండా వుంటాయి.
వేరికోస్ వేయిన్స్‌కి చికిత్స చేయడమనేది కేవలం నివారణ చర్య మాత్రమే, కాని మీయొక్క నరాలపై దీర్ఘకాలిక శ్రద్ధ అనేది అవసరం. ఆ శ్రద్ధ అనేది మీయొక్క జీవితంలో ఒక భాగం కావాలి. మీకు వేరికోస్ వేయిన్స్ వుందని మీకు ఆందోళన వుంటే, మీరు సరైన చికిత్స తీసుకోవడం చాలా అవసరం. అది దెబ్బతిన్న నరాలని నిర్మూలిస్తుంది. మీరు వేరికోస్ వేయిన్స్‌కి చికిత్సని ఆలస్యం చేసినాకొద్దీ, క్లిష్టతలు పెరిగే అవకాశం ఎక్కువగా వుంటుంది.
Varicose Veins Treatment In Hyderabad | Bengaluru |Mysore | Visakhapatnam | Vijayawada | Chennai |Coimbatore | Tirupati | Rajahmundry | Kolkata | Madurai | Kakinada | Delhi
For Appointment Call
Telangana: 9989527715
Andhra Pradesh: 9989527715
Tamilnadu: 7847045678
Karnataka: 8088837000
Kolkata: 9154089451
Delhi : 9701688544
Pune : 9701688544