Book Appointment
X

Choose location for Appointment


వైద్యపరమైన జిగురు మరియు వేరికోస్ వేయిన్స్ – ఇది ఒక ప్రభావవంతమైన చికిత్సా ప్రక్రియేనా?

Glue therapy

ఎవీస్ వాస్కులర్ సెంటర్లో మాయొక్క వైద్యులు వేరికోస్ వేయిన్స్ కలిగిన రోగులను పరీక్షించినపుడు, తరుచుగా నరాల అసమర్థత (Venous insufficiency) యొక్క లక్షణాలను వారిలో గమనిస్తారు. దీనర్థం వేరికోస్ వేయిన్స్ అనేది ఒక సౌందర్యపరమైన సమస్య కన్నా కూడా ఎక్కువే మరియు దీనికి గనుక చికిత్స చేయకపోతే ప్రమాదకరంగా మారి మరిన్ని ఆరోగ్య సమస్యలకి అది దారి తీయవచ్చు.

ఒకసారి మీరు చికిత్స చేయించుకోవాలని నిర్ణయించుకున్న తరువాత, మీకు ఏ చికిత్సా పద్ధతి గొప్పగా సరిపోతుందనే ప్రశ్న మీకు తలెత్తుతుంది.

ఎప్పటికప్పుడు సాంకేతికతలో పురోగతితో వేరికోస్ వేయిన్స్ యొక్క చికిత్సా ప్రక్రియలు అభివృద్ధి చెందాయి. ఇంతకు ముందు రోగులకి ఎక్కువ చికిత్సా మార్గాలు ఉండేవి కావు మరియు ఎక్కువ శాతం రోగులు “వెయిన్ స్ట్రిప్పింగ్” అనే ఎక్కువ కోతతో కూడిన ప్రక్రియని చేయించుకోవలసి వచ్చేది. ఆ ప్రక్రియలో మత్తుమందు, నొప్పితో కూడిన ఎక్కువ కోలుకొనే సమయం మరియు ఎక్కువ సమయం ఆసుపత్రిలోనే చేరిక లాంటివి అవసరమయ్యేవి. ఎక్కువ కోత కారణంగా మరియు పెరిగే అపాయాల కారణంగా అంతకు ముందే ఏవైనా అనారోగ్య సమస్యలున్న రోగులుని ఈ చికిత్సా విధానం నుండి మినహాయించవలసి వచ్చేది. ఆ విధంగా దీనికి సంబంధించిన బాధని వారు భరిస్తూనే ఉండవలసి వచ్చేది.

అదృష్టవశాత్తు ఆ రోజులు పోయాయి! ఈనాడు, మీయొక్క నాళాల సమస్యలకి వైద్య జిగురు చికిత్సా ప్రక్రియతో సహా వివిధ రకాల కోతలేని చికిత్సా ప్రక్రియలని మాయెక్క ఎవీస్ ఆసుపత్రిలో మేము మీకు అందిస్తున్నాము.

మీయొక్క రక్తప్రవాహ వ్యవస్థలో సమస్య తలెత్తినపుడు వేరికోస్ వేయిన్స్ అనేవి ప్రత్యక్షమవుతాయి. వివిధ కారణాల వలన మీ రక్తనాళాలలోని కవాటాలు దెబ్బతిన్నపుడు, గుండెవైపుకి ప్రవహించే రక్తం మీయెక్క కాలి భాగాలలోనే పోగయ్యే అవకాశం వుంటుంది. కాలక్రమంగా ఈ నరాలు సాగడం మొదలయ్యి, వాచిపోయి మీయొక్క చర్మం లోనుంచే బయటకి కనిపిస్తాయి.

వైద్య జిగురు థెరపీ అనేది వేరికోస్ వేయిన్స్‌ యొక్క చికిత్స కొరకు తాజా మరియు అధునాతనమైన సాంకేతికత. నాళాల చికిత్సకి ఇది ఒకే ఒక నాన్-థర్మల్ ప్రక్రియ కాబట్టి ఇటీవలి కాలంలో ఇది ఎక్కువ ప్రజాదారణ పొందింది.

ఈ జిగురు చికిత్సలో దెబ్బతిన్న నరాలని మూసివేయడానికి వైద్యపరమైన జిగురుని ఉపయోగించడం జరుగుతుంది. ఈ ప్రక్రియ సురక్షితమైనది మరియు ఇందులో వుండే తేడా ఏంటంటే ఈ ప్రక్రియలో పెద్ద మొత్తంలో మత్తుమందుని ఉపయోగించాల్సిన అవసరం గానీ లేదా ఈ ప్రక్రియకి సిద్ధం చేయడానికి రోగికి ఏవైనా మందులు ఇవ్వడం గాని అవసరం వుండదు.

వైద్య జిగురు ప్రక్రియ యొక్క వివరణ.

అల్ట్రాసోనిక్ మార్గదర్శకత్వంలో ఈ మొత్తం ప్రక్రియ కూడా నిర్వహించబడుతుంది.

ఈ ప్రక్రియ చేసే సమయంలో కేంద్రీకృత మత్తుమందుని ఇచ్చి మోకాలి దగ్గర వున్న చర్మం మొద్దుబారేలా చేయడం జరుగుతుంది. ఒక సూదిని నరంలోనికి ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఆ సూది ద్వారా ఒక తీగని చొప్పించి తరువాత ఆ సూదిని తొలగించడం జరుగుతుంది. తరువాత ఆ తీగగుండా ఒక క్యాథటర్‌ని చొప్పించడం జరుగుతుంది. జిగురుని (ఒక వైద్యపరమైన జిగురు) ఆయొక్క క్యాథటర్‌ ద్వారా పాడైన నరంలోనికి పంపించి తరువాత క్యాథటర్‌ని వెనక్కి లాగివేయడం జరుగుతుంది.

ఒక ముప్పై సెకన్ల వరకూ వేరికోస్ వేయిన్స్ పైన వుండే చర్మం పైన ఒత్తిడిని కలుగజేసి వుంచడం జరుగుతుంది. నిమిశాల వ్యవధిలోనే ఈ జిగురు నరం యొక్క గోడతో బంధాన్ని ఏర్పరచుకొని దాని గుండా వెళ్ళే రక్తప్రవాహాన్ని మూసివేసి, తద్వారా ఆ నరాన్ని పూర్తిగా ఆపివేస్తుంది. ఇక ఆ తరువాత, మరొక చోట మరి కొంత జిగురుని పంపించడం, క్యాథటర్‌ని వెనక్కి లాగడం మరియు ఒత్తిడిని కలిగించడం జరుగుతుంది. 

పాడైన నరం యొక్క పొడవుని బట్టి ఎన్ని జిగురు వాడకాలు జరగాలో మరియు ఎంత సమయం ఆ ప్రక్రియని నిర్వహించాలనేది నిర్ణయించబడుతుంది. దెబ్బతిన్న నరం గుండా వెళ్ళే రక్తప్రవాహాన్ని గనుక నివారించినపుడు, దాని ఫలితంగా వేరికోస్ వేయిన్స్ అనేవి మాయమవుతాయి.

చికిత్స యొక్క సమర్థత

వైద్య ప్రయోగాలలో ఈ ప్రక్రియ సురక్షితమైనదిగా కనుగొనబడింది, మరియు వీనస్ రిఫ్లక్స్ వ్యాధులకి ఒక చికిత్సా మార్గంగా ఎఫ్.డి.ఏ ద్వారా 2015లో ఆమోదం కూడా పొందింది.

చికిత్స చేయబడిన నరాలని మూసివుంచడంలో ఈ ప్రక్రియ 95% సమర్థవంతమైనదిగా కొన్ని అధ్యయనాలు కూడా వెల్లడించాయి.

ఎవీస్ వాస్కులర్ సెంటర్లోని మాయొక్క వైద్యులతో మాట్లాడండి మరియు ఇందులోని ప్రయోజనాలు మరియు సంభావ్య అపాయాలతో సహా, జిగురు చికిత్సకి సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకోండి.

Varicose Veins Treatment In Hyderabad | Bengaluru |Mysore Visakhapatnam | Vijayawada Chennai |Coimbatore Tirupati | Rajahmundry Kolkata | Madurai

For Appointment Call

Telangana: 9989527715

Andhra Pradesh: 9989527715

Tamilnadu: 7847045678

Karnataka: 8088837000

Kolkata: 9154089451

Branches

Home
Services
Doctors
Branches
Blog