Book Appointment
X

Choose location for Appointment


వేరికోస్ వేయిన్స్ యొక్క ప్రమాదాలు

varicose veins

సాధారణంగా కాళ్ళ పైన లేదా ఇతర ప్రదేశాలలో ఉబ్బుగా, మెలితిరిగి నీలిరంగులో వుండే నరాలనే వేరికోస్‌ వేయిన్స్‌గా మనలో చాలా మంది గుర్తిస్తారు. వేరికోస్ వేయిన్స్ అన్ని వేళలా కంటికి కనిపిస్తాయని మీరు నమ్ముతున్నారా? మీ కంటికి కనిపించకుండా కూడా అవి ఉనికిలో ఉండగలవా?

దాగివున్న వేరికోస్‌ వేయిన్స్‌ని కలిగివుండటం సాధ్యమేనా?

దీనికి జవాబు అవుననే చెప్పవచ్చు. మీరు వేరికోస్‌ వేయిన్స్‌ని కలిగివుండి కూడా మీరు వాటిని చూడలేకపోవచ్చు. 

ప్రపంచ జనాభాలో 20% నుండి 30% శాతం మంది వేరికోస్‌ వేయిన్స్‌తో బాధపడుతున్నారని అంచనా. అంతే నిష్పత్తిలో వుండే పెద్దలలో కూడా బయటకి కనిపించకుండా దాగివున్న వేరికోస్‌ వేయిన్స్‌ ఉంటాయని అంచనా వేయబడింది. 

కానీ, ఇది మిమ్మల్ని అంతగా భయపెట్టాల్సిన అవసరం లేదు. నిజానికి, వేరికోస్ వేయిన్స్ యొక్క ముందస్తు లక్షణాలనేవీ మీ కాళ్ళ పైన కనిపించే నరాలుగానే వుండవు. వాటి యొక్క ఉనికి గురించి మిమ్మల్ని హెచ్చరించే ఇతర సంకేతాలు మరియు లక్షణాలు కూడా వుంటాయి. మీరు ఆ లక్షణాలని సకాలంలో పట్టించుకొని ఒక నరాల నిపుణుడితో పరీక్ష చేయించుకుంటే గనుక మీ ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి, కంటికి కనిపించే వాపుతో కూడిన నరాలకి సంబంధించిన సంకేతాలే కాకుండా నరాల వ్యాధులకి సంబంధించిన ఇతర సంకేతాలని మరియు లక్షణాలని కూడా గమనించండి. కాళ్ళలోని లోపలి నాళాలలో వేరికోస్ వేయిన్స్ సంభవించినపుడు, ఆ సమస్య అనేది చర్మం పై భాగంలో కనిపించకపోవచ్చు. చర్మం ఉపరితలం మీద కనబడే నరాల సమస్యలనేవీ ఏ లక్షణాలనైతే కలిగివుంటాయో అవే లక్షణాలని ఎక్కువగా లోపల దాగియున్న నరాలు కూడా కలిగివుంటాయి.

దాగియున్న వేరికోస్ వేయిన్స్ యొక్క లక్షణాలు. 

నరాల అసమర్థతని కలిగివుండి కూడా మీ కాళ్ళు సాధారణంగానే కనిపించవచ్చు. ఏదేమైనప్పటికీ, ఈ సమస్యలో కొన్ని లక్షణాలనేవి వుంటాయి. వాటికి గనుక చికిత్స చేయకపోతే, అవి మరిన్ని ఆరోగ్య సమస్యలకి దారితీయవచ్చు.

లోపల దాగివున్న వేరికోస్ వేయిన్స్ ఎందుకని ప్రమాదకరం?

వేరికోస్ వేయిన్స్ అనేవి ఎక్కువగా హానికరం కాకపోయినప్పటికీ, లోలోపల వేరికోస్ వెయిన్ ఏర్పడిన ప్రదేశంలో రక్తపు గడ్డలు ఏర్పడే అవకాశం వుంది. ఈ రక్తపు గడ్డలు ఏర్పడినపుడు, రక్త ప్రవాహం నిలిచిపోయి, అది తిరిగి గుండెకి వెళ్ళకుండా నివారించబడుతుంది. అపుడు రక్తం శరీరంలో, ముఖ్యంగా కాళ్ళలో పోగవుతుంది.

లోతైన నరాలలో ఏర్పడే రక్తపు గడ్డలు రక్త ప్రవాహం నుండి ఊపిరితిత్తులలోకి చేరి ప్రాణంతకమైన “పల్మనరీ ఎంబాలిజం” అనే పరిస్థితికి దారితీస్తాయి. కాబట్టి అవి చాలా ప్రమాదకరమైనవి.

దాగియున్న వేరికోస్ వేయిన్స్‌ని నిర్థారించడం

నాళాల సమస్యలని గుర్తించడానికి వైద్యులు సాధారణంగా ఒక డ్యూప్లెక్స్ అల్ట్రాసౌండ్ స్కాన్‌ని సిఫారసు చేస్తారు. 

పైకి కనిపించే వేరికోస్ వేయిన్స్ అనేవి మొత్తం సమస్యలో కనిపించే కొద్ది భాగం మాత్రమే అని వాస్కులర్ నిపుణులు చెబుతారు. ఒక వాస్కులర్ సోనోగ్రాఫర్ చేత నిర్వహించబడే ఒక అల్ట్రాసౌండ్ పరీక్ష ప్రతీదాన్ని పరిశీలించి నిర్థారిస్తుంది, మరీ ముఖ్యంగా చర్మం కిందనే వున్న చిన్న నరాలనేవీ పెద్దవైన లోపలి నరాలలోని లోపాల వలన ఎలా ప్రభావితమయ్యాయో నిర్థారిస్తుంది.

వేరికోస్ వేయిన్స్‌కి ఏ చికిత్సలు అందుబాటులో వున్నాయి?

నరాల వ్యాధులకి సంబంధించి శస్త్రచికిత్స ద్వారా వెయిన్ స్ట్రిప్పింగ్ మరియు లిగేషన్ లాంటి చికిత్సా ప్రక్రియలకి ఇప్పుడు ఏమాత్రం ప్రాధాన్యత లేదు. 

ఆధునిక చికిత్సా ప్రక్రియలు థర్మల్ (వేడి ఉపయోగించబడుతుంది) మరియు నాన్-థర్మల్ (స్క్లేరోసంట్స్ మరియు జిగురు యొక్క ఉపయోగం) అనే రెండు ప్రక్రియలుగా విభజించబడ్డాయి. స్క్లేరోథెరపీ, రేడియోఫ్రిక్వన్సీ అబ్లేషన్, ఎండోవీనస్ థర్మల్ అబ్లేషన్, మరియు మెడికల్ గ్లూ థెరపీ లాంటి తక్కువ కోతతో కూడిన పద్ధతులు ఉత్తమ ఫలితాలని అందిస్తాయి. అంతేకాకుండా, సాంప్రదాయకమైన స్ట్రిప్పింగ్ పద్ధతితో పోల్చినపుడు తక్కువ క్లిష్టతలని, తక్కువగా సమస్య మళ్ళీ సంభవించే రేటుని మరియు సమస్య నుండి త్వరగా కోలుకొనే అవకాశాన్ని కలిగివుంటాయి.

చివరగా చెప్పేదేంటంటే, వాస్కులర్ వైద్యులు వేరికోస్ వేయిన్స్‌ని నరాల వ్యాధి యొక్క ప్రత్యక్ష లక్షణంగా పరిగణిస్తారు. ఇది తరచుగా పెద్ద సమస్యలకి మరియు అపాయలకి ముందస్తు లక్షణంగా వుంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితులలోనూ ఈ సమస్యని అలక్ష్యం చేయకూడదు.

Varicose Veins Treatment In Hyderabad | Bengaluru |Mysore Visakhapatnam | Vijayawada Chennai |Coimbatore Tirupati | Rajahmundry Kolkata | Madurai | Pondicherry | Delhi|

For Appointment Call

Telangana: 9989527715

Andhra Pradesh: 9989527715

Tamilnadu: 7847045678

Karnataka: 8088837000

Kolkata: 9154089451

Delhi : 9701688544

Branches

Home
Services
Doctors
Branches
Blog