Book Appointment
X

Choose location for Appointment


వేరికోస్ వేయిన్స్ మరియు దాని చికిత్స గురించి ప్రచారంలో వున్న అవాస్తవాలని పారద్రోలడం

varicose veins vs spider veins

వేరికోస్ వెయిన్ గురించి మరియు దాని యొక్క పరిస్థితిని గురించిన విపరీతమైన సమాచారం అందుబాటులో వున్న కారణంగా, మనం అధికారిక నిజాలని వడగట్టి మిగిలిన పుకార్లన్నింటినీ అవాస్తవాలుగా పారద్రోలాలి.

మీ కాళ్ళపైన నీలిరంగు లేదా ముదురు నీలిరంగులో వాపుతో కూడిన నరాలని ఒక వికారమైన వాటిగా మరియు ఒక సౌందర్యపరమైన సమస్యగా మీరు చూడవచ్చు. కానీ ఈ సమస్యకి సంబంధించిన కట్టుకథలనేవి నిరంతరం తప్పుడు సమాచారాన్ని మోసుకేళ్తున్న కారణంగా ప్రజలు వారి యొక్క చికిత్సని వాయిదా వేసుకోవచ్చు మరియు ఆలా చేస్తే అది వారియొక్క ఆరోగ్యాన్ని ప్రమాదంలో కూడా పడవేయవచ్చు.

అవాస్తవం : వేరికోస్ వేయిన్స్ నయంకానివి, మరియు వాటికి చికిత్స చేయడంలో ప్రయోజనం లేదు.

వేరికోస్ వెయిన్ అనేది పెరుగుతూ పోయే ఒక వ్యాధి మరియు ఇది ఒక సౌందర్య సమస్య కన్నా కూడా ఎక్కువే. ఎంతో మందికి ఇది నరాల అసమర్థతకి (Venous insufficiency) మొదటి సంకేతంగా ఉండవచ్చు మరియు దీనికి చికిత్స గనుక చేయకపోతే, అది ఇతర సమస్యలకి దారితీయవచ్చు.

నాళాలలో దెబ్బతిన్న కవాటాల కారణంగా సరిగ్గా ఉండని రక్తప్రవాహం ఆ నాళాలలో క్రమంగా ఒత్తిడిని పెంచవచ్చు. ఈ పరిస్థితిలో రక్తనాళాలు సున్నితంగా మారినాకొద్దీ, ఒక చిన్న గాటు కూడా మీ చర్మాన్ని సులభంగా కోసేయవచ్చు, అది చివరికి ఒక పుండు ఏర్పడటానికి దారి తీయవచ్చు. వేరికోస్ వెయిన్ అనేది సూపర్‌ఫిషల్‌ థ్రోంబోఫ్లిబైటిస్‌కి దారితీసే ఒక సాధారణ కారణంగా వుంటుంది. ఇది ఒక మంటతో కూడిన వాపు. ఈ పరిస్థితి రక్తపు గడ్డలు ఏర్పడటానికి దారితీయవచ్చు. ఆ రక్తపు గడ్డలు ఒకటి లేదా మరిన్ని నరాలను మూసేయవచ్చు, మరీ ముఖ్యంగా కాళ్ళలో.

ఈనాడు అందుబాటులో వున్న చికిత్సా మార్గాల వలన, ఈ వ్యాధి పురోగమించకుండా నివారించడానికి మీరు కొన్ని చర్యలు తీసుకోవచ్చు. అంతేకాకుండా, కొద్ది స్థాయిలో వున్నపుడే ఈ పరిస్థితిని అదుపులో పెట్టడానికి మీకు ఆ చర్యలు సహకరిస్తాయి.

అవాస్తవం : చికిత్స తీసుకున్న తరువాత కూడా ఈ వేరికోస్ వేయిన్స్ అనేవి మళ్ళీ తలెత్తుతూనే వుంటాయి.

ముందుగా వ్యాధి నిర్థారణని సరిగ్గా చేయకపోవడం, ప్రారంభ శస్త్రచికిత్సని తగినంత చేయకపోవడం, మరియు పరిస్థితి పురోగమించడం అనేది వేరికోస్ వేయిన్స్ మళ్ళీ సంభవించడానికి ప్రధాన కారణమని కొన్ని ఇటీవలి అధ్యయనాలు వెల్లడించాయి.

సాంకేతిక విషయాలపై శ్రద్ధ వహించడం అనేది ఈ సమస్య మళ్ళీ సంభవించే అవకాశాలను గొప్పగా తగ్గించేస్తుంది. అందువలన ఒక ప్రత్యేక నైపుణ్యం గల ఒక వాస్కులర్ శస్త్రచికిత్సా నిపుణుని యొక్క పాత్ర ఉండవలసిందేనని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.

ఉత్తమ ఫలితాల కొరకు, ఎంతో మందికి చికిత్స చేసిన మరియు ఎన్నో వేల నాళాలకి శస్త్రచికిత్స చేసిన ఒక వాస్కులర్ నిపుణుడు మీకు అవసరం.

అవాస్తవం : వేరికోస్ వేయిన్స్ యొక్క చికిత్స అనేది నొప్పితో కూడుకొన్నది.

వెయిన్ స్త్రిప్పింగ్ లేదా లిగేషన్ లాంటి ముందుగా చేసే చికిత్సా ప్రక్రియలు చాలా నొప్పితో కూడుకొని వుండి మచ్చలు ఏర్పడటం మరియు శస్త్రచికిత్స సంబంధిత క్లిష్టతలని కూడా కలిగివుంటాయి. కానీ ఈనాడు సాంకేతికతలో వచ్చిన అభివృద్ధి వలన కోతలేని ఎన్నో చికిత్సా మార్గాలు మీకు అందుబాటులో వున్నాయి.

రోగులు ఎక్కువగా తక్కువ కోతతో కూడిన నరాల చికిత్సలను కొంత అసౌకర్యంతో కూడినవిగా మరియు అరుదుగా నొప్పితో కూడినవిగా భావిస్తారు. అంతేకాకుండా, సూదుల నొప్పులు మరియు మందులు ఇచ్చిన కారణంగా మండటం లాంటివి మాత్రం సాధారణంగా రోగి అనుభవించడం జరుగుతుంది.

అవాస్తవం : వేరికోస్ వెయిన్ ముసలి వాళ్ళకి మాత్రమే వస్తుంది.

వేరికోస్ వేయిన్స్ అనేవి వయసు పైబడిన వారికి మాత్రమే వస్తాయని నమ్మడం కూడా ఒక అవాస్తవమే. యాభై ఏళ్ళు పైబడిన వారిలో దీని సంబంధిత అపాయాలు ఎక్కువగా వున్నప్పటికీ, చిన్న వయసులో కూడా మీకు వేరికోస్ వేయిన్స్ తలెత్తవచ్చు. ఈనాడు, ఇరవై ఏళ్ళలో వున్నవారు సైతం తమకి ఈ పరిస్థితి సంభవించడాన్ని చూస్తున్నారు.

మీయొక్క జీవన విధానం, జన్యుపరమైన కారణాలు, ఊబకాయం, మరియు ఇతర కారణాల ఆధారంగా వేరికోస్ వేయిన్స్ అనేది ఏ వయసులోనైనా దాడి చేయవచ్చు.    

అవాస్తవం : ప్రతి ఒక్కరికీ ఎదో ఒక కాలి నొప్పి వుంటుంది, ఇందంతా కేవలం వయసు వల్ల మాత్రమే!

వయసు కారణంగా నాళాల యొక్క కవాటాలు క్రమక్రమంగా వాటి యొక్క సాగేగుణాన్ని మరియు దృఢత్వాన్ని కోల్పోయినకొద్దీ వేరికోస్ వేయిన్స్ తలెత్తే అవకాశం పెరుగుతుందనేది నిజం. కానీ, ఇతర కారణాల నుండి కూడా ఈ నాళాల సమస్యలు తలెత్తుతాయనేది కూడా నిజం. అంతేకాకుండా, ఈ సమస్యలు పురోగమించి తీవ్రమైన

సమస్యలను సృష్టించకుండా ఉండటానికి ఈ సమస్యలని సరైన సమయంలో పట్టించుకోవడమనేది చాలా ముఖ్యం.

అవాస్తవం : వేరికోస్ వెయిన్ చికిత్సకి భీమా వర్తించదు.

“సౌందర్యపరమైన చికిత్సలా” కాకుండా “వైద్యపరమైన అవసరంగా” పరిగణించబడే లక్షణాలు గల వేరికోస్ వేయిన్స్ యొక్క చికిత్స అనేది అన్ని ప్రముఖ భీమ సంస్థల ద్వారా అందించబడుతుంది.

మీకు తగిన ఉత్తమమైన చికిత్సా మార్గాలను అంచనావేయడానికి ఎవీస్ వాస్కులర్ సెంటర్లోని మాయొక్క వైద్యులతో మాట్లాడండి.

Varicose Veins Treatment In Hyderabad | Bengaluru |Mysore Visakhapatnam | Vijayawada Chennai |Coimbatore Tirupati | Rajahmundry Kolkata | Madurai

For Appointment Call

Telangana: 9989527715

Andhra Pradesh: 9989527715

Tamilnadu: 7847045678

Karnataka: 8088837000

Kolkata: 9154089451

Branches

Home
Services
Doctors
Branches
Blog