నీలిరంగు మరియు ఎరుపులో వుండి సాగిన విధంగా మరియు ఉబ్బెత్తుగా కాళ్ళమీద కనిపించే వేరికోస్ వేయిన్స్ అనేవి పెద్ద అసౌకర్యమైన మరియు సౌందర్యపరమైన ఇబ్బందిగా చెప్పవచ్చు. మీయొక్క పూర్తి ఆరోగ్యానికి మరియు సంక్షేమానికి తప్పనిసరి కాబట్టి వాటికి చికిత్స చేయడమనేది ప్రధానంగా అవసరం.
వేరికోస్ వేయిన్స్కి సంబంధించిన ఎన్నో చికిత్సా పద్దతులు సంవత్సరాల తరబడి పుట్టుకొచ్చాయి, కాని వాటిల్లో దేనిని ఎంచుకోవాలనేదే ఇక్కడ తలెత్తే ప్రశ్న. ముందు రోజుల్లో “వెయిన్ స్ట్రిప్పింగ్” అనబడే ఒకేఒక చికిత్సా ఎంపిక మాత్రమే రోగులకి అందుబాటులో వుండేది. ఎక్కువగా కోత అవసరమయ్యే ఈ విధానంలో రోగిని ఆసుపత్రిలో చేర్చవలసి రావడం, సాధారణ మత్తుమందుని ఇవ్వడం, కొన్నివారాల వరకూ వుండే నొప్పితో కూడిన కోలుకునే సమయం మరియు ఎక్కువ అపాయాలు కూడా ఈ చికిత్సలో ఉండేవి. అపాయాలు ఎక్కువగా ఉండేవి కాబట్టి, అంతకు ముందే ఇతర వైద్య సమస్యలని కలిగివున్న రోగులు ఈ చికిత్సని తీసుకొనేవారు కాదు. కానీ ఎవరైతే ఈ చికిత్సని తీసుకున్నారో, వారు కూడా కోలుకునే ప్రక్రియని చాల కఠినంగా అనుభవించేవారు. ఎందుకంటే నయమవడం అనేది చాలా నెమ్మదిగా వుండి కొన్ని రోజుల వరకూ కూడా వారియొక్క పనులన్నింటినీ వాయిదా వేసుకోవలసి వచ్చేది.
ఇటివలే అభివృద్ధి చేయబడిన చికిత్సా విధానంలో ఒక వైద్యపరమైన జిగురుని ఉపయోగించడం జరుగుతోంది. ఈయొక్క బ్లాగులో ఈ చికిత్సా విధానం గురించి మరింతగా చర్చించుకుందాం.
వేరికోస్ వేయిన్స్
వేరికోస్ వేయిన్స్ అనేది సాధారణంగా రక్తనాళాల అసమర్థత యొక్క ఒక లక్షణంగా పరిగణించబడుతుంది మరియు ఇది శరీరంలోని రక్త ప్రసరణ సమస్యలతో సంబంధాన్ని కలిగివుంటుంది.
శరీరంలోని అన్ని భాగాల నుండి రక్తాన్ని తిరిగి గుండెకి సరఫరా చేసే నాళాలలోని కవాటాలు దెబ్బతిన్నపుడు, వీనస్ రిఫ్లక్స్ అనే సమస్య సంభవించే అవకాశం తలెత్తుంది. దీనర్థం రక్తం అనేది వెనుకకి ప్రవహించి కాళ్ళలోనే పోగవుతుంది. దీని ఫలితంగా వేరికోస్ వేయిన్స్ అనబడే వాచిపోయిన మరియు ఉబ్బిన నరాలు కాళ్ళలో ఏర్పడతాయి.
వేరికోస్ వేయిన్స్కి చేయబడే జిగురు చికిత్స (Glue treatment) అంటే ఏమిటి?
ఒక ప్రత్యేక రకమైన “సూపర్గ్లూ” ఈ చికిత్స కొరకు ఉపయోగించబడుతుంది. ఈ జిగురు సరిగ్గా పనిచేయని కవాటాలని కలిగివున్న నాళాలని మూసివేస్తుంది. తీవ్రమైన వేడి ద్వారా నరాలని మూసివేసే ఎండోథర్మల్ అబ్లేషన్ (EVLA) పద్ధతి లేదా “వెయిన్ స్ట్రిప్పింగ్” అనబడే శస్త్రచికిత్సలో లాగానే ఈ జిగురు కూడా వేరికోస్ వేయిన్స్ని మూసివేస్తుంది.
జిగురు చికిత్స ఎలా నిర్వహించబడుతుంది?
కేంద్రీకృత మత్తుమందు ఇచ్చి మోకాలి దగ్గరున్న చర్మాన్ని మోద్దుబారేలా చేయడం జరుగుతుంది. దీనిని అనుసరించి ఒక సూదిని రక్తనాళంలోకి ప్రవేశపెట్టడం జరుగుతుంది. తరువాత ఆ సూదిగుండా ఒక తీగని చొప్పించి సూదిని వెనక్కి తీసుకోవడం జరుగుతుంది. తరువాత క్యాథటర్ని ఆ తీగగుండా చొప్పించడం జరుగుతుంది. ఇక జిగురుని చొప్పించి క్యాథటర్ని వెనక్కి లాగడం జరుగుతుంది. వేరికోస్ వేయిన్స్ పైన వున్న చర్మం ఉపరితలం పైన ముప్పై సెకండ్ల వరకూ ఒత్తిడిని కలిగిచి వుంచడం జరుగుతుంది. కొన్ని నిమిశాలలోనే ఈ జిగురు సంబంధిత నరాన్ని మూసివేసి దాని పనిని ఆపివేస్తుంది. ఇక ఇప్పుడు, తరువాత మరొక చోట కూడా జిగురు ఉపయోగించబడుతుంది, క్యాథటర్ని వెనక్కి లాగడం జరుగుతుంది మరియు ఒత్తిడిని ప్రయోగించడం జరుగుతుంది. చనిపోయిన నరం పొడవునా ఈయొక్క ప్రక్రియని మళ్ళీ మళ్ళీ పునరావృతం చేయడం జరుగుతుంది. ఒక అల్ట్రాసోనిక్ వ్యవస్థ మార్గదర్శకత్వంలో ఈయొక్క మొత్తం ప్రక్రియ నిర్వహించబడుతుంది.
వేరికోస్ వేయిన్స్ కొరకు స్క్లెరోథెరపీ మరియు అబ్లేషన్
దెబ్బతిని వికారంగా కనిపించే నరాలను తొలగించే తక్కువ కోతతో కూడిన ప్రక్రియనే స్క్లెరోథెరపీ అంటారు. ఈ ప్రక్రియ నిర్వహించే సమయంలో లోపంతో వున్న నరాలలోనికి స్క్లెరోసింగ్ ద్రావణాన్ని పంపించడం జరుగుతుంది, దానియొక్క సాంద్రత చికిత్స చేయబడుతున్న వేరికోస్ వేయిన్స్ యొక్క పరిమాణం మీద ఆధారపడి వుంటుంది.
ఈ స్క్లెరోసింగ్ ఏజెంట్ దెబ్బతిన్న నాళాలలో గడ్డలు ఏర్పడేలా చేసి వాటిని మూసివేయడానికి సహకరిస్తుంది. ఇది రక్తం ఆరోగ్యవంతమైన నాళాలలోనికి మరలించబడేలా చేసి కొత్త నాళం యొక్క పెరుగుదలకి సహకరిస్తుంది. పడిపోయిన నరాలను శరీరం కాలక్రమేణా తనలోనికి గ్రహించుకుంటుంది.
అబ్లేషన్ చికిత్సా విధానంలో, అసహజమైన నరాలని రేడియోఫ్రీక్వన్సీ ద్వారా లేదా లేజర్ శక్తి ద్వారా వేడిచేసి వాటిని నాశనం చేయడం జరుగుతుంది. క్యాథటర్ లేదా ఒక సన్నని ట్యూబుని వేరికోస్ వేయిన్లోకి ప్రవేశపెట్టడం జరుగుతుంది. రోగిలోపల చూసే విధంగా అల్ట్రాసౌండ్ ప్రక్రియని ఉపయోగించడం జరుగుతుంది మరియు ఆ సంబంధిత నరం పొడవునా కూడా క్యాథటర్ని వైద్యుడు నిర్థారిస్తాడు. సరైన స్థానంలో మొన వున్నపుడు, లేజర్ ఫైబర్ ద్వారా తయారు చేయబడిన వేడి నరం లోపల ప్రయోగించబడుతుంది. దెబ్బతిన్న నరాలు పడిపోయి మూసివేయ బడతాయి. చనిపోయిన కణజాలం శరీరం ద్వారా గ్రహించబడుతుంది.
ఎవీస్ వాస్కులర్ సెంటర్లో వివిధ రక్తనాళాల వ్యాధులకి మాయొక్క నిపుణులైన వైద్యులు అబ్లేషన్, స్క్లెరోథెరపీ, మరియు జిగురు చికిత్సా విధానాన్ని అందిస్తున్నారు. ఈ ప్రక్రియలపై మరిన్ని వివరాలకి, చికిత్సా అర్హతల గురించి మరియు చికిత్సలకి సంబంధించిన ఖర్చు గురించి మరింత తెలుసుకోవడానికి, దయచేసి మాయొక్క సెంటరుని సందర్శించండి.
Varicose Veins Treatment In Hyderabad | Bengaluru |Mysore | Visakhapatnam | Vijayawada | Chennai |Coimbatore | Tirupati | Rajahmundry | Kolkata | Madurai
For Appointment Call
Telangana: 9989527715
Andhra Pradesh: 9989527715
Tamilnadu: 7847045678
Karnataka: 8088837000
Kolkata: 9154089451