సాధారణంగా తొడలపైన, పాదాలపైన, మరియు చీలమండల పైన కనిపించే మెలితిరిగిన, సాగిన నరాలనే వేరికోస్ వేయిన్స్ అని అంటారు. అవి ఎక్కువగా నరాలపైన మితిమీరిన ఒత్తిడి వలన సంభవిస్తాయి. వీటి వలన తలెత్తే సమస్యలు అందానికి సంబంధించినవి గానే వుండవు, వీటికి చికిత్స చేయకుండా వదిలేస్తే, అవి ఇంకా పెద్ద ఆరోగ్య సమస్యలకి దారీతీసే అవకాశం కూడా వుంటుంది. నొప్పి, వాపు, చర్మం రంగు కోల్పోవడం, సలపడం, మరియు అల్సర్లు (పుండ్లు) అనేవి ఈ పరిస్థితిలో సంభవించే అతి సామాన్యమైన లక్షణాలు.
ఈనాడు వేరికోస్ వేయిన్స్ కొరకు కొన్ని చికిత్సా మార్గాలు అందుబాటులో వున్నాయి. అవి వేరికోస్ వేయిన్స్ యొక్క లక్షణాలను తగ్గించి ఆకారాన్ని మెరుగుపరుస్తాయి. ఏదేమైనప్పటికీ, అన్ని వేరికోస్ వేయిన్స్ కూడా ఒకేలా వుండవు. శరీరంలోని వివిధ రకాల నరాలు అవి వేరికోస్ రూపం దాల్చినపుడు వేరు వేరుగా మారుతుంటాయి. వేరికోస్ వేయిన్స్లో వుండే అతి సామాన్యమైన రకాలను ఈ బ్లాగు మీకు వివరిస్తుంది.
సఫినస్ వేరికోస్ వేయిన్స్
చర్మపు ఉపరితలానికి చాలా దగ్గరిగా వుండి రక్తాన్ని చర్మం నుండి మరియు చర్మం క్రింది కణజాలాల నుండి తీసుకునే నరాలను సూపర్ఫిషల్ కాలి నరాలు అని అంటారు. చీలమండ లోపలి నుండి మొదలయ్యి మొల భాగం వరకూ విస్తరించి వున్న ఉపరితల నరాన్ని సఫినస్ వేయిన్ అని అంటారు. ఈ నరం సమస్యాత్మకమైంది మరియు ఇది వేరికోస్ వేయిన్స్కి సంబంధించి వుంటుంది. ఈ నరాలు తాడులాగా కనిపిస్తూ పెద్దగా వుంటాయి. సఫినస్ వేరికోస్ వేయిన్స్కి రంగు ఉండకపోవచ్చు, కానీ అవి బయటకి వచ్చినట్టు కనిపించినపుడు చాలా ప్రముఖంగా కనిపిస్తాయి.
స్పైడర్ వేయిన్స్
స్పైడర్ వేయిన్స్ అనేవి పరిమాణంలో చిన్నగా వుండి శరీరంలో సాధారణంగా ఎక్కడైనా సరే కనిపిస్తాయి. ఇవి అంతగా పెద్ద ఆరోగ్య సమస్యలని సృష్టించనప్పటికీ, మీరు వెచ్చని మరియు ఎండ తీవ్రత గల వాతావరణంలో బయటకి వెళ్ళినపుడు మీ ఆత్మ విశ్వాసాన్ని ఇవి దెబ్బతీయవచ్చు. ఎరుపులో లేదా నీలి రంగులో వుండే ఈ నరాలు సన్నగా దాదాపు 1 నుండి 1.5 మి.మీ వరకూ పరిమాణంలో వుండి మిగతా వేరికోస్ వేయిన్స్ కంటే కూడా చిన్నగా వుంటాయి. ఈ నరాలు బయటికి విస్తరిస్తూ, ఎర్రని గీతల గుత్తిలా కనిపిస్తూ కొన్నిసార్లు సాలీడు గూళ్ళలాగ కనిపిస్తాయి.
మీయొక్క జీవన విధానంలో సులభమైన మార్పులు లేదా పీడనంతో కూడిన సాక్సులు ధరించడమే ఈ సమస్యకి సమర్థవంతమైన చికిత్సని నిరూపితమైంది. ఏదేమైనప్పటికీ, వీటికి చికిత్స చేయకుండా వదిలిపెడితే, ఇవి వివిధ రకాల క్లిష్ట సమస్యలకి కూడా దారితీయవచ్చు.
రెటిక్యులర్ (వలలాగా వుండే) వేరికోస్ వేయిన్స్.
రెటిక్యులర్ నరాలు సాధారణంగా దాదాపు 3 మి.మీ పరిమాణంలో వుంటాయి, అవి సాధారణంగా నీలి-ఆకుపచ్చని రంగులో లేదా ముదురు నీలిరంగులో వుంటాయి. ఈ నరాలు కాలికి మరియు మీయొక్క మోకాళ్ళు లేదా చీలమండల వెనుక భాగాన తలెత్తుతాయి. రెటిక్యులర్ వేయిన్స్ అనేవి చర్మం ఉపరితలం పైకి ఉబ్బెత్తుగా పోడుచుకొని రావు కాబట్టి మీరు వేళ్ళతో చర్మం ఉపరితలం మీద తడిమినపుడు వాటి ఉనికి కూడా మీకు తెలియదు. కాని వేరికోస్ వేయిన్స్ మాత్రం చర్మం ఉపరితలం పైకి ఉబ్బెత్తుగా వస్తాయి. అవి ప్రముఖంగా కనిపిస్తూ స్పర్శకి కూడా దొరుకుతాయి.
వేరికోస్ వేయిన్స్ సాధారణంగా స్పైడర్ వేయిన్స్ తయారవడానికి దారితీయవు. ఏదేమైనప్పటికీ, రెటిక్యులర్ వేయిన్స్ అనేవి స్పైడర్ వేయిన్స్ని మరింత అధ్వానంగా మారుస్తాయని మనం గమనించవచ్చు.
ఈ విధంగా వేరు వేరు రకాల నరాలు వేరు వేరు రకాల రూపాన్ని, లక్షణాలని మరియు పురోగతి క్రమాన్ని కలిగివుంటాయి. వివిధ రకాల వేరికోస్ వేయిన్స్ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం, ఎందుకంటే ఈ పరిస్థితికి దారి తీసిన కారణాలను అర్థం చేసుకోవడానికి సాయం చేస్తుంది కాబట్టి. సరైన చికిత్సతోనే మరిన్ని నరాలు భవిష్యత్తులో వేరికోస్ వేయిన్స్గా మారవని మనం హామీ ఇవ్వొచ్చు.
ఒక అర్హత కలిగిన నరాల వైద్యుడు వివిధ రకాల నరాల సమస్యలను అర్థం చేసుకొని, ఆ రోగి యొక్క వ్యక్తిగత అవసరాలని మరియు ఆ సమస్య యొక్క తీవ్రతను బట్టి అందుబాటులోవున్న అధునాతనమైన సాంకేతికతలను మరియు చికిత్సలను అతనికి సిఫారసు చేస్తాడు.
వివిధ రకాల చికిత్సల గురించి మరింత తెలుసుకోవడానికి మరియు మీ నరాలకి సంబంధించిన సమస్యల గురించి చర్చించడానికి, ఎవీస్ వాస్కులర్ సెంటర్లోని మాయొక్క నిపుణులైన వైద్య బృందంతో మాట్లాడండి.
Varicose Veins Treatment In Hyderabad | Bengaluru |Mysore | Visakhapatnam | Vijayawada | Chennai |Coimbatore | Tirupati | Rajahmundry | Kolkata | Madurai
For Appointment Call
Telangana: 9989527715
Andhra Pradesh: 9989527715
Tamilnadu: 7847045678
Karnataka: 8088837000
Kolkata: 9154089451