వేరికోస్ వేయిన్స్పై చేసే మసాజ్ మూలమైన సమస్యని నివారించదు. అంతేకాకుండా, కొన్నిసార్లు ఇది మరింత సమస్యాత్మకంగా మారే అవకాశం వుంటుంది. ప్రధానంగా, వేరికోస్ వేయిన్స్పై చేసే మసాజ్ పరిస్థితిని మరింత దారుణంగా మారుస్తుంది. ఒకవేళ అతి సున్నితంగా వుండే స్పైడర్ వేయిన్స్పై గనుక మసాజ్ చేస్తే, అది వాటిపై విపరీతమైన ఒత్తిడిని కలిగించి అవి పగిలిపోయేలా చేస్తుంది. డి.వి.టితో బాధపడుతున్న రోగులకి గనుక మసాజ్ చేస్తే రక్తపు గడ్డ తొలగిపోయి రక్త ప్రవాహంలోకి జారుకునే అవకాశం వుంటుంది. అది చాలా ప్రమాదకరంగా మారవచ్చు.
కాదనలేని విధంగా, సరైన అవగాహన ఉన్న థెరపిస్టు చేసే మసాజ్‌లు ప్రభావిత ప్రాంతంలో వుండే వాపు, బరువు, మరియు అసౌకర్యం నుండి ఉపశమనాన్ని కలిగించవచ్చు. ఏదేమైనప్పటికీ, అలా పొందే ఉపశమనం కేవలం తాత్కాలికం మాత్రమే మరియు ఈ పరిస్థితిలో పూర్తి మెరుగుదల కొరకు సరైన వైద్య చికిత్స ప్రధానంగా అవసరం.
వివిధ రకాల ఇతర చికిత్సా మార్గాలు ఏమిటి?
వెయిన్ స్ట్రిప్పింగ్ మంచి విధానమేనా?
వెయిన్ స్ట్రిప్పింగ్ అనేది మాములుగా తాత్కాలిక రోగి పద్ధతిలో చేసే ఒక చికిత్సా ప్రక్రియ, కాని ప్రభావిత ప్రదేశాన్ని స్పర్శ లేకుండా చేయడానికి సాధారణ నొప్పినివారిణి లేదా వెన్నుముకకి నొప్పినివారిణిని ఇవ్వడం ద్వారా సాధారణంగా దీన్ని ఆపరేషన్ గదిలోనే నిర్వహించబడుతుంది. ఇది చాలా క్లిష్టమైన సమస్య మరియు ఇందులో వేరికోస్ వేయిన్స్ సమస్య తిరిగి సంభవించే అవకాశాలు ఎక్కువగా వుంటాయి.
నరాలకి చేసే లేజర్ అబ్లేషన్ చికిత్స ఎంత వరకు ప్రభావవంతమైనది?
ఐ.వి.ఎల్.టి (ఏండోవీనస్ లేజర్ అబ్లేషన్) అనేది వేరికోస్ వేయిన్స్‌కి చికిత్స చేయడానికి తక్కువ కోతతో కూడిన చికిత్సా విధానం. ఈ ప్రక్రియకి కేవలం గంట వరకు మాత్రమే సమయం పడుతుంది మరియు ఎక్కువ శాతం రోగులు వెంటనే వారి రోజువారి కార్యక్రమాలను కూడా తిరిగి చేసుకోవచ్చు.
అబ్లేషన్ అనేది శస్త్రచికిత్స కన్నా కూడా తక్కువ కోతతో కూడినది మరియు సురక్షితమైంది. ఈ ప్రక్రియలో ఎటువంటి గాయపు మచ్చలు కూడా సంభవించవు. తక్కువ క్లిష్టతలతో కూడి అత్యంత సమర్థవంతమైన ప్రక్రియగా ఇది నిరూపించబడింది. అంతేకాకుండా, శస్త్రచికిత్సతో పోలిస్తే తక్కువ నొప్పితో కోలుకోవడమనే ఇందులో అదనపు ప్రయోజనంగా వుంటుంది.
వేరికోస్ వేయిన్స్ కొరకు స్క్లెరోథెరపీ చికిత్సా ప్రక్రియ
తక్కువ పరిమాణంలో వుండే వేరికోస్ వేయిన్స్ మరియు స్పైడర్ వేయిన్స్‌కి తక్కువ కోతతో చేసే చికిత్సా ప్రక్రియనే స్క్లెరోథెరపీ అంటారు. ఈ ప్రక్రియలో పాడైన నరాలలోకి నేరుగా ఒక చిన్న సూది ద్వారా ఒక ద్రావణాన్ని పంపించడం జరుగుతుంది. ఆ విధంగా అవి ముడుచుకొని కనిపించకుండా పోయేలా చేయడం జరుగుతుంది.
ఒకే ఒక సెషన్లో దాదాపు 50% నుండి 80% వరకూ పాడైన నరాలు నిర్మూలించబడ్డాయని కొన్ని అధ్యాయనాల్లో వెల్లడవడం ద్వారా ఈ ప్రక్రియ సమర్థవంతమైనదని నిరూపితమైంది. సూపర్ఫిషల్ రిఫ్లక్స్ (రక్త నాళాల్లో రక్త ప్రవాహం బయటకి పోకుండా చేసే కవాటాలు దెబ్బ తినడం) అనే సమస్య మళ్ళీ సంభవించడాన్ని కూడా ఈ ప్రక్రియ నివారిస్తుంది.
స్పైడర్ వేయిన్స్ విషయంలో మూడు నుంచి ఆరు వారాల లోపల మరియు పెద్ద స్థాయి వేరికోస్ వేయిన్స్ విషయంలో నాలుగు నెలల లోపల మంచి ఫలితాలని ఈ ప్రక్రియలో చూడటం జరుగుతుంది.
మీరు వేరికోస్ వేయిన్స్ వలన ఎటువంటి బాధని గాని లేదా సౌకర్యాన్ని గాని మీరు భరించవలసిన అవసరం లేదు. మీయొక్క నొప్పిని మరియు అసౌకర్యాన్ని తగ్గించుకోవడానికి శాశ్వత పరిష్కారాన్ని అందించే వైద్యులను మీరు కనుగొనవలసి వుంటుంది.
మీయొక్క వైద్య చరిత్ర ఆధారంగా రూపొందించిన చికిత్సా ప్రణాళికల ద్వారా మీయొక్క నరాల సమస్యలకి శాశ్వత మరియు ఖచ్చితమైన పరిష్కారాలని మీరు కనుగొనే విధంగా డా. రాజా మరియు అనుభవజ్ఞులైన ఆయన గారి వైద్య బృందం మీకు సహాయపడతారు.
ఎవీస్ వాస్కులర్ సెంటర్లోని మా నిపుణుల యొక్క అపాయింట్‌మెంట్‌ని బుక్ చేసుకోండి. మాయొక్క వైద్యులతో మాట్లాడండి మరియు మీయొక్క పరిస్థితి యొక్క తీవ్రతని బట్టి సరైన చికిత్సని మొదలు పెట్టండి..
Varicose Veins Treatment In Hyderabad | Bengaluru |Mysore | Visakhapatnam | Vijayawada | Chennai |Coimbatore | Tirupati | Rajahmundry | Kolkata | Madurai
For Appointment Call
Telangana: 9989527715
Andhra Pradesh: 9989527715
Tamilnadu: 7847045678
Karnataka: 8088837000
Kolkata: 9154089451