వేరికోస్ వేయిన్స్‌కి చికిత్స చేయకుండా అలాగే వదిలేస్తే ఏం జరుగుతుంది?

what happens if varicose veins are left untreated?

రక్తం వెనుకకి మరలకుండా కాపాడే నాళాలలోని ఒకవైపు-మార్గపు కవాటాలు గనుక బలహీనంగా మారి పాడైపోతే, రక్తం నరాలలోనే గడ్డకట్టడం మొదలవుతుంది. ఆ తరువాత, పెరుగుతున్న రక్త ప్రవాహం యొక్క ఒత్తిడిని భరించడం కష్టంగా మారి నరాలు సాగడం మరియు మెలితిరగడం జరుగుతుంది. అది అంతిమంగా వేరికోస్ వేయిన్స్‌ యొక్క సంభావ్యతకి దారి తీస్తుంది.
కొందరు ‘వేరికోస్ వేయిన్స్‌’ మరియు ‘స్పైడర్ వేయిన్స్’కి మధ్య అయోమయానికి గురవుతారు. ‘స్పైడర్ వేయిన్స్’ అనేవి చర్మం ఉపరితలం కింద చిన్న చిన్న కొమ్మల్లాగా లేదా సాలె గూడులాగా కనిపిస్తాయి. స్పైడర్ వేయిన్స్ అనేవి 1 మి.మీ కంటే తక్కువ వ్యాసార్థంలో వుండి సాధారణంగా నీలి లేదా ఎరుపు రంగు గీతల్లా కనిపిస్తాయి. అవి సాధారణంగా కాలిలో ఎటువంటి వాపుకి దారితీయవు. స్పైడర్ వేయిన్స్‌కి చికిత్స అనేది ఎక్కువ శాతం ఒక సౌందర్యపరమైన విషయంగా పరిగణించబడుతుంది. ఇలా కాకుండా, వేరికోస్ వేయిన్స్ విషయంలో మాత్రం, వాటికి చికిత్స జరగని పక్షంలో క్లిష్టమైన సమస్యలు తలెత్తే అవకాశం వుంది.


లక్షణాలు కనిపించకుండా వుంటే దానర్థం అవి మీకు భవిష్యత్తులో తలెత్తవని కాదు. నిజానికి, చికిత్స ఆలస్యం చేస్తున్నా కొద్దీ త్వరలోనే మీకు నొప్పి మొదలయ్యే అవకాశం పెరుగుతూ వుంటుంది. వేరికోస్ వేయిన్స్‌కి చికిత్స చేయకపోవడం వలన పొంచివుండే ప్రమాదాలను ఇక్కడ మనం తెలుసుకుందాం.

what happens if varicose veins is left untreated ?


1) దురద – వేరికోస్ వేయిన్స్‌కి చికిత్స చేయకపోవడం వలన తలెత్తే అతి సాధారణమైన మరియు తేలికపాటి సమస్యల్లో “దురద” అనేది ఒక స్పర్శానుభవం. దీనిని కొన్నిసార్లు ‘పొడి చర్మం’ సమస్యగా భావించి వైద్యుని సలహా కూడా అవసరం లేని ఆయింట్‌మెంట్లతో మరియు లోషన్లతో చికిత్స చేయడం జరుగుతుంది.
2) పెరిగిన నొప్పు మరియు వాపు – నరాల్లో ఒత్తిడి పెరిగిన కొద్దీ, రక్తంలోని ద్రవం కొన్నిసార్లు అంటిపెట్టుకొని వున్న కణజాలంలోకి కారిపోయి వాపుని కలిగిస్తుంది. చికిత్స చేయబడని వేరికోస్ వేయిన్స్ అనేవి నరాలకి మరింత నష్టం కలుగజేస్తాయి. ఆ విధంగా జరగడమనేది వాపుని మరియు నొప్పిని మరింత ఉధృతం చేస్తుంది.
3) బలహీనత – వీటికి చికిత్స చేయకుండా వదిలేస్తే, వేరికోస్ వేయిన్స్ అనేవి మీయొక్క చురుకైన జీవన విధానాన్ని ప్రభావితం చేసే అవకాశం ఎక్కువగా వుంటుంది. కాళ్ళల్లో బలహీనత అనేది మీరు అలసిపోయేలా చేస్తుంది. అంతేకాకుండా, మీయొక్క ఉద్యోగంలో గాని మీయొక్క జీవన విధానంలో గాని మీరు ఎక్కువ చురుకుగా మరియు రోజంతా నిలుచొని వుండటమనేది అవసరమై వుంటే గనుక మీరు తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వుంటుంది.
4) లిపోడెర్మాటోస్క్లెరోసిస్ – నరాల అసమర్థత యొక్క ఈ పరిస్థితి వేరికోస్ వేయిన్స్ చుట్టూ చర్మం గట్టిపడటానికి మరియు రంగు కోల్పోవడానికి దారితీస్తుంది. ఇది నరాల చుట్టూ నొప్పి మరియు వాపుని కలుగజేస్తుంది, మరీ ముఖ్యంగా చీలమండల చుట్టూ.
5) అల్సర్లు – నరాలలోని కవాటాలు పాడవడం వలన కలిగే బలహీన రక్త ప్రసరణ అనేది నరాల లోపల నిరంతర ఒత్తిడికి కారణమవుతుంది. రక్త వాహికలు మరింత సున్నితంగా మారి ఒక చిన్న గాటు కూడా మీయొక్క కాళ్ళ పైన చర్మం సులభంగా పగిలేలా చేసి, అవి అల్సర్లుగా మారేలా చేస్తుంది. త్వరితంగా రక్తం కారడం సంభవించి, ఆ గాయాలు కూడా మానడానికి ఎక్కువ కాలం పడుతుంది.
6) థ్రోంబోఫ్లబిటిస్ – వేరికోస్ వెయిన్ అనేది ‘సూపర్ఫీషల్ థ్రోంబోఫ్లబిటిస్’ అనే సమస్యకి ఒక సాధారణ కారకం. ఇది రక్తపు గడ్డలకి దారితీసే నొప్పి మరియు వాపుతో ఒక కూడిన ప్రక్రియ. ఆ రక్తపు గడ్డలు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ నరాలని మూసివేస్తాయి, ప్రత్యేకంగా కాళ్ళలో.
7) డీప్ వెయిన్ థ్రోంబోసిస్‌ – అప్పుడప్పుడు, వేరికోస్ వేయిన్స్‌లో రక్తం గడ్డకట్టిన పరిస్థితిని ఎదుర్కొనే రోగులలో, వారికి లోతైన నరాల్లో కూడా రక్తం గడ్డలు ఏర్పడతాయి. అలా మూసుకు పోయిన నరాలు అత్యంత ప్రాణంతకమైన డీప్ వెయిన్ థ్రోంబోసిస్‌ (DVT) లాంటి పరిస్థితులకి దారితీస్తాయి. రక్తపు గడ్డ విరిగిపోయి ఊపిరితిత్తులలోనికి వెళ్ళినపుడు ప్రాణంతకమైన పల్మనరీ ఎంబాలిజం అనే పరిస్థితికి దారితీస్తూ ఈ డి.వి.టి అనే సమస్య మరింత ప్రమాదకరంగా మారుతుంది.


ప్రయాణాలు చేస్తున్నపుడు లేదా ఎక్కువ సమయం వరకూ కూర్చొని ఉండాల్సిన సమయాల్లో పీడనంతో కూడిన సాక్సుల ద్వారా వేరికోస్ వేయిన్స్‌ని అదుపులో పెట్టవచ్చనే విషయాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. కాని ఒకవేళ ఆ నరాలు పెద్దగా వుండి, నొప్పిని, రంగు మార్పుని మరియు వాపుని గనుక కలిగిస్తూ వుంటే, మీరు అత్యవసరంగా వైద్యున్ని సంప్రదించడం మంచిది. ఇది పెరుగుతూ పోయే వ్యాధి, కాబట్టి దీనికి చికిత్స చేయకుండా వుంటే గనుక పరిస్థితి మరింత క్షీణించే అవకాశం వుంటుంది.

Varicose Veins Treatment in Hyderabad | Tirupati | Vijayawada | visakhapatnam

Shares
Follow us