Book Appointment
X

Choose location for Appointment


వేరికోసిల్ మరియు పురుషులలో సంతాన రాహిత్యం

వేరికోసిల్ మరియు పురుషులలో సంతాన రాహిత్యం

మీరు ఇప్పటి వరకూ అనుభవించని ఈ రకమైన నొప్పి గురించి దిగులు చెందుతున్నారా? మీయొక్క వృషణాల్లో నొప్పి గురించి కనీసం మీయొక్క వైద్యునితో కూడా చర్చించడానికి మీకు ఇబ్బందిగా మరియు అసౌకర్యంగా అనిపిస్తుందా? ఇది బహుశా వేరికోసిల్ అని పిలువబడే ఒక పరిస్థితికి సంబంధించిన లక్షణం కావచ్చు. – అవును, అదృష్టవశాత్తు దీని గురించి మీరు చేయగలిగింది ఒకటి వుంది.

ప్రధానంగా వేరికోసిల్ అనేది వృషణాల చుట్టూ ఒక సంచిలా వుండే బీజకోశంలోని వేరికోస్ వేయిన్స్ యొక్క అసాధారణమైన వాపు. ఈ పరిస్థితి వీర్య కణాల సంఖ్యను, వాటి యొక్క చలనాన్ని మరియు ఆకృతిని తగ్గించగలదు. ఇది వీర్య కణాల యొక్క డి.ఎన్.ఏకి తీవ్రమైన నష్టం కలుగజేస్తే గనుక, అప్పుడు ఇది సంతానోత్పత్తి మరియు గర్భధారణ పైన ప్రతికూలమైన ప్రభావాలని కలిగించవచ్చు.

వేరికోసిల్‌కి ఏది కారణమవుతుంది?

రక్తం వృషణాల నుంచి బీజకోశంలోకి, అక్కడి నుంచి తిరిగి గుండెలోనికి ప్రవహించే విధంగా ఈయొక్క నాళాలు ఒకేవైపు కవాటాలని కలిగివుంటాయి. ఈ కవాటాలు చెడిపోయినపుడు రక్త ప్రవాహం మందగిస్తుంది. నాళాల నుంచి గుండె వైపుకి రక్త ప్రవాహాన్ని కొనసాగించడానికి ఎక్కువ ఒత్తిడి కావాల్సి వుంటుంది. ఒకవేళ రక్తం గనుక వెనక్కి ప్రవహిస్తే అది ఆ ప్రాంతంలో గడ్డకడుతుంది. ఈ పరిస్థితి కొంత కాలం తరువాత వేరికోసిల్ అనే సమస్యకి దారితీస్తుంది, అదే బీజకోశం యొక్క నరాల వాపు.     

     

లక్షణాలు & వ్యాధి నిర్థారణ

  • వేరికోసిల్ అనేది సాధారణంగా లక్షణాలని చూపెట్టదు, కాని కాలం గడిచినకొద్దీ ఇది ఎక్కువగా బయటపడుతుంది.
  • వేరికోసిల్స్ అనేవి ఎక్కువగా బీజకోశానికి ఎడమ వైపు ఏర్పడతాయి (దాదాపు 80% – 90% కేసుల్లో).
  • బీజకోశాన్ని పరీక్షించినపుడు, వేరికోసిల్ తరచుగా “ఒక పురుగుల సంచిలా” అనిపిస్తుంది.
  • వేరికోసిల్ వలన సంభవించే నొప్పి దాని యొక్క తీవ్రత ప్రకారం తక్కువ మరియు ఎక్కువ మధ్యలో వుండి, ఆ వ్యక్తి ఎక్కువ సమయం వరకు నిలుచొని ఉంటున్నపుడు లేదా కూర్చొని వుంటున్నపుడు పెరిగే అవకాశం వుంటుంది.
  • బీజకోశం బరువుగా వుందని రోగి చెప్పవచ్చు.
  • వృషణాలకి కలిగే హాని వాటి యొక్క కుంగుదల లేదా క్షీణతకి దారి తీస్తుంది.
  • సంతాన సమస్యలు వేరికోసిల్స్‌కి సంబంధించినవై  వుంటాయి. సంతానం లేని దంపతుల యొక్క సమస్య సరిగ్గాలేని వీర్యం ఉత్పత్తి మరియు క్షీణించిన వీర్యం నాణ్యతని సూచిస్తుంది.

వేరికోసిల్స్‌ యొక్క సంభావ్యత

  • 10 సంవత్సరాల వయసు కంటే తక్కువ వున్న అబ్బాయిలలో వేరికోసిల్ సమస్య చాలా అరుదు, కాని యుక్తవయసుకి వచ్చిన తరువాత ఇది సంభవించే అవకాశాలు పెరుగుతాయి.
  • వేరికోసిల్ సమస్య ఆరోగ్యవంతమైన పురుషులలో 15% వరకు గుర్తించబడుతుందని పరిశోధన తెలుపుతోంది.
  • వేరికోసిల్ సమస్య 35-50% వరకు పురుషులలో ప్రథమ సంతాన రాహిత్యానికి (మొదటి సారి గర్భం ధరించలేకపోవడం) మరియు 81% పురుషులలో ద్వితీయ సంతాన రాహిత్యానికి (రెండవ సారి గర్భం ధరించలేకపోవడం) కారణంగా చెప్పబడింది. ఇది కాలం గడిచినకొద్దీ వృషణాల పనితీరులో క్రమంగా సంభవిస్తున్న క్షీణతని సూచిస్తుంది.

అందువలన వీర్య కణాల నాణ్యతని మెరుగుపరచి దంపతుల యొక్క సంతాన సామర్థ్యాన్ని పెంచడానికి మరియు తరువాతి దశలో వృషణాల యొక్క పనితీరులో క్షీణతని నివారించడానికి వేరికోసిల్స్‌కి సరైన చికిత్స అవసరం.

వేరికోసిల్‌ని నివారించవచ్చా?

వేరికోసిల్‌కి చికిత్స చేయడంలో లేదా దానిని నివారించడంలో సామర్థ్యం కలిగివున్నట్లుగా ఏ మందులూ కూడా నిరూపితం కాలేదు. మీయొక్క నరాల ఆరోగ్యాన్ని మెరుగుపరచి, దాన్ని కాపాడి తద్వారా వేరికోసిల్స్‌ని నివారించేటట్లుగా ఈ క్రింద పేర్కొనబడిన చిట్కాలు సూచించబడతాయి.

తగినంత నియమిత వ్యాయామం చేయడం, పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడం, సమృద్ధిగా నీరు తాగడం మరియు ధూమపానాన్ని మానేయడం మొదలైనవి మీయొక్క నాళాల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విధానాలుగా నిరూపితమయ్యాయి.

వేరికోసిల్స్‌కి చికిత్స

యూరాలజిస్ట్ (మూత్ర వ్యవస్థ వైద్యుడు) నిర్వహించే బాహ్య లేదా లపరోస్కోపిక్ శస్త్రచికిత్స అనేది లక్షణాలు కలిగివున్న వేరికోసిల్స్‌కి అత్యంత సామాన్యంగా చేసే చికిత్సా విధానం. మీయొక్క రెండు వృషణాలని ప్రభావితం చేసే వేరికోసిల్‌ని మీరు కలిగివుంటే గనుక మీకు ఉత్తమ మార్గంగా శస్త్రచికిత్సని సిఫారసు చేయడం జరుగుతుంది. కాని ఈ ప్రక్రియలో నాళం దెబ్బతినడం, ఇన్ఫెక్షన్, మరియు వేరికోసిల్‌ తిరిగి సంభవించడం మొదలైన క్లిష్టతలు తలెత్తే అవకాశం వుంది.

వేరికోసిల్‌ ఎంబలైజేషన్ అనేది ఒక ఇంటర్వెన్షనల్ రేడియోలాజిస్ట్ ద్వారా నిర్వహించబడే తక్కువ కోతతో కూడిన చికిత్సా విధానం. ఇది సాధారణంగా తాత్కాలిక రోగి విధానంలో నిర్వహించబడుతుంది. ఈ విధానం తర్వాత రోగి తిరిగి పూర్తిగా కోలుకోవడానికి కేవలం కొన్ని రోజులు పడుతుంది. కాని ఒక శస్త్రచికిత్స విధానంలో మాత్రం రోగి కోలుకోవడానికి సగటున కొన్ని వారాల వరకూ సమయం పడుతుంది.

Varicocele Treatment In Hyderabad

For Appointment Call: 9989527715

Branches

https://www.avisvascularcentre.com/wp-content/pg-soft-slot/
Home
Services
Doctors
Branches
Blog
https://recyclestore.bigcartel.com/
https://hprojekty.sk/slot-gacor/