Book Appointment
X

Choose location for Appointment


వేరికోసిల్ గురించి మీరు తెలుసుకోవలసిన పూర్తి సమాచారం

వేరికోసిల్ మరియు పురుషులలో సంతాన రాహిత్యం

బీజకోశంలోని నరాలలో తలెత్తిన లోపాల వలన ఏర్పడిన నరాల అసమర్థత ద్వారా వేరికోసిల్ సంభవిస్తుంది. బీజకోశం వృషణాల చుట్టూ వుండే ఒక చర్మపు సంచి. వృషణాలు మరియు బీజకోశం నుండి రక్తం తిరిగి గుండెకి ప్రవహించే విధంగా సహకరించడానికి అక్కడి నాళాలలో ఒక వైపు మార్గపు కవాటాలు వుంటాయి. నరాలలో సరిగ్గా పనిచేయని కవాటాలు గనుక వుంటే, అపుడు రక్త ప్రసరణ క్రమరహితంగా మారి రక్తం గడ్డకట్టే అవకాశం వుంటుంది. దాని ఫలితంగా, బీజకోశంలోని నరాలు సాగి వాపు రావచ్చు. ఈ పరిస్థితి నరాల గోడలని సాగదీస్తూ వాటిపైన మితిమీరిన ఒత్తిడిని కలిగించవచ్చు. వేరికోసిల్‌గా పిలవబడే ఉబ్బిన వృషణాల నరాలు వేరికోస్ వేయిన్స్, స్పైడర్ వేయిన్స్ లేదా ఆర్షమొలల లాగానే వుంటాయి.

వేరికోసిల్ యొక్క లక్షణాలు

వేరికోసిల్స్ సామాన్యంగా ఎడమ వైపుకి సంభవిస్తాయి. సాధారణంగా పొత్తికడుపులోని వృషణపు నరం పయనించే మార్గం కారణంగా ఇలా వుంటుంది.

నాళాలలో రక్తం పోగయినపుడు అది ఎన్నో దుష్ప్రభావాలకి కారణమవుతూ మితిమీరిన వేడికి, అతి సున్నితత్వానికి, ఆక్సిడెషన్‌కి, హైపర్ హైడ్రేషన్‌కి, శరీరంలో విషవ్యర్థాలు పోగవడానికి, మరియు తగ్గిన పోషకాల మార్పిడికి, మరియు హైపోక్సియాకి దారితీస్తుంది. నొప్పి, సంతాన సమస్యలు, వృషణాలు సాగిపోయినట్లుగా వుండటం, అసౌకర్యం, ఉబ్బిన నరాలు, లేదా వృషణాలు ముడుచుకుపోవడం లాంటివి దీనికి సంబంధించిన దుష్ప్రభావాలు. టెస్టోస్టిరాన్‌ స్థాయి తగ్గడానికి కూడా ఇది కారణమయ్యి పురుషులలో తక్కువ లైంగిక సామర్థ్యానికి, తగ్గిన మగతనానికి, పెరిగిన ఈస్ట్రోజెన్‌కి లేదా తగ్గిన కండరాల స్థాయికి కారణమవుతుంది.

వేరికోసిల్స్ కలిగివున్న చాలా మంది పురుషులు సాధారణంగా ఎటువంటి చికిత్స లేకుండానే జీవితాంతం సంతృప్తికరమైన టెస్టోస్టిరాన్‌ స్థాయిలని కలిగివుంటారు. ఏదేమైనప్పటికీ, ఈ పరిస్థితి కొన్నిసార్లు టెస్టోస్టిరాన్‌ స్థాయిలు అత్యధికంగా తగ్గడానికి కారణంగా వుంటుంది, ఆ విధంగా అది మధుమేహం మరియు బోలు ఎముకల వ్యాధికి దారితీస్తుంది.

వేరికోసిల్ కలిగివున్న పురుషులు అనుభవించే ఇతర కొన్ని లక్షణాలు కూడా వున్నాయి. అందులో కొన్ని తక్కువ లైంగిక సామర్థ్యం మరియు అంగస్తంభన లేకపోవడం. ఏదేమైనప్పటికీ, వేరికోసిల్స్ కలిగివున్న ఎక్కువ శాతం మంది మగవారు హార్మోన్ల సమస్యలని, నొప్పిని, లేదా అసౌకర్యాన్ని అనుభవించరు. అందువలన, ఆందోళన చెందాల్సిన తీవ్రమైన కారణాలు వుంటే తప్ప వారికి చికిత్స ఇవ్వబడదు.

వేరికోసిల్ వృషణాలని ప్రభావితం చేస్తుందా?

ఒక సిద్ధాంతం ప్రకారం, వేరికోసిల్ కారణంగా వేడి రక్తం పొత్తి కడుపు నుండి బీజకోశంలోని వృషణాల వైపు తీసుకెళ్ళబడుతుంది కాబట్టి, శరీర ఉష్ణోగ్రత కంటే 3 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రత వద్ద గొప్పగా పనిచేసే వృషణాలని అది ప్రభావితం చేయవచ్చు. వీర్యకణాలని మరియు టెస్టోస్టిరాన్‌ని ఉత్పత్తి చేసే వృషణాల యొక్క సామర్థ్యాన్ని ఈ వేడి రక్తం ప్రభావితం చేయగలుగుతుంది. మరొక సిద్ధాంతం చెప్పేదేంటంటే, వృషణపు నరం పైన వుండే అడ్రినల్ గ్రంథి నుండి వచ్చే వివిధ రకాల రసాయనాల బారిన వృషణాలు పడటం జరుగుతుంది.

వేరికోసిల్‌కి ఎప్పుడు చికిత్స చేయాలి?

వేరికోసిల్ యొక్క పరిమాణం, సంతాన ఉద్దేశాలపై అది ప్రభావం చూపడం, రక్త పరీక్షలనేవీ తక్కువ టెస్టోస్టిరాన్‌ స్థాయిలని చూపించడం, బీజకోశంలో అసౌకర్యంగా వుండటం, లేదా వీర్య పరిశీలన (వృషణాల పనితీరుని అంచనా వేయడానికి) అనేవి ఒక వ్యక్తికి వేరికోసిల్ చికిత్స యొక్క అవసరం ఉందేమో నిర్ణయించే కొన్ని పరిమితులు.

వృషణాలు వేరికోసిల్ ప్రభావానికి గురి కానట్లుగా అనిపిస్తే, ఆ పరిస్థితికి చికిత్స చేయాలా వద్దా అనడానికి వివిధ రకాల ఆలోచనలున్నాయి. కొంత నిరీక్షించి వేరికోసిల్స్ వున్న రోగులని కొంత కాలం పాటు గమనించి, వీర్య పరీక్షలు చేసి మరియు/లేదా నిరంతరం రక్త పరీక్షలు చేసి, వేరికోసిల్ వృషణాల పనీతీరుని ప్రభావితం చేస్తోందని నిరూపణ అయిన తరువాతనే చికిత్స ప్రారంభించాలని కొందరు వైద్యులు సూచిస్తారు.

ఏదేమైనప్పటికీ, వీర్య నాణ్యతని పెంచడం ద్వారా ఒక జంట యొక్క సంతాన అవకాశాలని పెంచడానికి  వేరికోసిల్స్‌కి సరైన చికిత్స చేయడం అవసరం. సమస్య తరువాతి స్థాయికి చేరి వృషణాల పనీతీరు పడిపోకుండా నివారించడానికి ఈ చర్య అవసరం.

వేరికోసిల్స్ యొక్క చికిత్స

వేరికోసిల్ ఎంబలైజేషన్ అనేది ఒక ఇంటర్వెన్షనల్ రెడియోలజిస్ట్ ద్వారా నిర్వహించబడే తక్కువ కోతతో కూడిన ఒక అధునాతనమైన ప్రక్రియ. తాత్కాలిక రోగి ప్రక్రియలోనే నిర్వహించబడే ఈయొక్క ప్రక్రియ వేగవంతమైన కోలుకొనే సమయాన్ని మరియు అధిక విజయ శాతాన్ని కలిగివుంది.  

మీరు కాల్ చేసి మాయొక్క ఆసుపత్రిలోని ఇంటర్వేన్షనల్ శాఖ గురించి అడగవచ్చు లేదా అందుబాటులో వున్న చికిత్సా మార్గాల గురించి మరింత తెలుసుకోవడానికి ఎవీస్‌లోని మాయొక్క వాస్కులర్ నిపుణులని సంప్రదించవచ్చు.

Varicocele Treatment In Hyderabad

For Appointments Call: 9989527715

Branches

Home
Services
Doctors
Branches
Blog