Book Appointment
X

Choose location for Appointment


మీ “నరాల” వైద్యున్ని ఎలా ఎంపిక చేసుకోవాలి?

మీ "నరాల" వైద్యున్ని ఎలా ఎంపిక చేసుకోవాలి?

మీ ఇంట్లో ఏ.సి పని చేయడం మానేసిందని అనుకుందాం కాసేపు. అప్పుడు మీరు దాన్ని బాగు చేయించుకోవడానికి ప్లంబర్‌ని పిలుస్తారా? లేదు కదా! మరి అదే విధంగా, మీరు నరాల సమస్యతో బాధపడుతున్నపుడు, మీ పరిస్థితిని సమర్థవంతంగా చక్కదిద్దడానికి ఆ రంగంలో నైపుణ్యాన్ని కలిగివున్న ఒక వైద్యున్ని ఎందుకని మీరు సంప్రదించకూడదు? మూలమైన సమస్యలకి చికిత్స చేసి వాటిని నయం చేసేందుకు తగిన అనుభవం, శిక్షణ మరియు బోర్డు ధృవీకరణ వున్న ఒక వైద్యున్ని సంపాదించుకోవడమనేది చాలా ముఖ్యం.

నరాల వ్యాధులకి ఎవరు చికిత్స చేస్తారు?

ఇటువంటి వైద్య సమస్యలకి చికిత్స చేయడానికి ఎక్కువ మంది నరాల నిపుణులు కఠినమైన శిక్షణ మరియు తగిన అర్హతలని కలిగివుంటారు. కాని వైద్యులందరూ ఇంతటి పెద్ద శిక్షణని తీసుకొని వుండరు, మరియు మీయొక్క రక్తప్రసరణ వ్యవస్థలో ముఖ్య పాత్ర పోషించే నరాలతో వ్యవహరించడంలో తగినంత అనుభవాన్ని కూడా కొందరు కలిగివుండరు.

అయితే నా నరాల్లో తలెత్తే సమస్యలకి చికిత్స చేయగలిగే ఒక గొప్ప వైద్యున్ని ఎలా నేను కనుగొనాలి? 

మీరు మీ దగ్గరిలో ఎవరైనా గొప్ప వైద్యుడు ఉన్నాడేమోనని వెతికే సమయంలో, చర్మ రోగ నిపుణులు, ఇంటర్వేన్షనల్ రేడియోలాజిస్టులు, వాస్కులర్ శస్త్రచికిత్సా నిపుణులు మరియు ఇతర ప్రత్యేక నిపుణులు కూడా నరాల వ్యాధులకి చికిత్సలని అందిస్తున్నారనే విషయాన్ని మీరు తెలుసుకుంటారు. మరి ఇంతకీ వీరిలో ఎవరిని సంప్రదించాలో మీరెలా నిర్ణయించుకుంటారు? మీ శోధనలో మీరు  పరిగణలోకి తీసుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు ఇవే.

 I. ఆ వైద్యుని యొక్క అర్హతలు అమరియు అనుభవం.

నరాల సమస్యల వైద్యానికి సంబంధించి వైద్యుని యొక్క అర్హతలని మరియు అతని యొక్క అనుభవపు స్థాయిని గురించిన సమాచారాన్ని తెలుసుకోవడానికి మీయొక్క సమయాన్ని వెచ్చించండి. గడచిన ఎన్ని సంవత్సరాలుగా వారు నరాలకి చికిత్స చేస్తున్నారో మరియు వారి వృత్తిలో నరాలకి సంబంధించిన ఎన్ని చికిత్సా ప్రక్రియలని వారు పూర్తి చేసి వున్నారో తెలుసుకోండి.

 II. “బోర్డు ధృవీకరించిన” వైద్యుల సర్వీసు.

బోర్డు ధృవీకరించిన వాస్కులర్ శస్త్రచికిత్సా నిపుణుడు అంటే ఎవరు?

వాస్కులర్ శస్త్రచికిత్సా నిపుణులు కనీసం ఐదు సంవత్సరాల అనుభవాన్ని మరియు కేవలం రక్తప్రసరణ వ్యవస్థకి మాత్రమే సంబంధించిన శస్త్రచికిత్సలని నిర్వహించడంలో కొన్ని సంవత్సరాల శిక్షణని తీసుకొని వుంటారు.

ఈయొక్క వైద్య నిపుణులు వాస్కులర్ సేవలకి సంబంధించిన అన్ని అంశాలలో శిక్షణ పొందుతారు. అంతేకాదు, తక్కువ కోతతో కూడిన ప్రక్రియలు మరియు కఠినమైన శస్త్రచికిత్సలతో సహా రక్త ప్రసరణ వ్యవస్థకి సంబంధించిన అన్ని రకాల వైద్య ప్రక్రియలని నిర్వహించగలుగుతారు.

ధృవీకరణ పొందిన వాస్కులర్ శస్త్రచికిత్సా నిపుణుడి వద్ద మీరు చికిత్స చేయించుకోవడమంటే మీకు ఆ నరాల చికిత్సకి సంబంధించిన వివిధ మార్గాలు అందుబాటులో వున్నాయని అర్థం. మీయొక్క నిర్థిష్టమైన పరిస్థితిని అనుసరించి ఆ వైద్యుడు ఒక చక్కని చికిత్సా ప్రణాళికని రూపొందిచగలుగుతాడు.

ఈ విభాగంలో మొత్తం కఠినతరమైన శిక్షణని, కావలసినంత మొత్తం జ్ఞానాన్ని, అనుభవాన్ని మరియు నైపుణ్యాలని సంపాదించుకున్న తరువాత మాత్రమే బహుకరించబడే ఒక ప్రతిష్టాత్మక హోదాయే ఈ బోర్డు ధృవీకరణ పత్రం.

III. క్లినిక్ వద్ద అందుబాటులో వున్న సౌకర్యాలు.

మీయొక్క చికిత్సకి సంబంధించి ఖచ్చితమైన వ్యాధి నిర్థారణ అనేది చాలా ముఖ్యం.

* మీయొక్క వైద్య పరిస్థితిని నిర్థారించడానికి మీయొక్క వైద్యుడు ఒక ప్రామాణికమైన ల్యాబ్ సౌకర్యంతో కలిసి పనిచేస్తున్నాడా?

* వివిధ రకాల చికిత్సా విధానాలను మరియు వివిధ రకాల నరాల సమస్యలని నిర్వహించేందుకు వీలుగా ఆ ల్యాబ్ అనేది ప్రత్యామ్నాయ సాంకేతికత వ్యవస్థలని కలిగివుందా?

* నరాల సంబంధిత అల్ట్రాసౌండ్ మరియు నరాల వ్యాధుల చికిత్సలో ప్రత్యేకతలని కలిగివున్న ఒక అర్హత పొందిన అల్ట్రాసోనోగ్రాఫర్‌ని ఆ క్లినిక్ కలిగివుందా?  

* ఆయొక్క క్లినిక్ గుర్తింపుని కలిగివుందా మరియు నరాల వ్యాధుల నిర్థారణలో మరియు వాటి చికిత్సలో గొప్ప విధానాలని అవలంభిస్తోందని మీకు హామీ ఇస్తుందా?

IV. ఇంతకు ముందు చికిత్స పొందిన వాళ్ళ యొక్క సిఫారసులు, సలహాలు.

మీకంటే ముందుగా ఈ చికిత్స తీసుకున్న మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, లేదా ఇంకెవరైనా కూడా సరైన సమాచారాన్ని అందించే వారుగా మీకు ఉపయోగపడతారు మరియు వారు ఆ వైద్యుడు మరియు క్లినిక్ మీద పెంచుకున్న విశ్వాసం ఆధారంగా కూడా మీరు ఒక నిర్ణయాన్ని తీసుకోగలుతారు.

మీరు మీకు కావాల్సిన వైద్యున్ని వివేకంతో ఎంచుకున్నప్పుడే మీరు గొప్ప ఫలితాలని ఆశించగలుగుతారు. అంతేకాకుండా, అదృష్టవశాత్తు వైద్య రంగంలో ఇటివలే జరిగిన అభివృద్ధి కారణంగా తక్కువ కోతతో కూడిన వైద్య ప్రక్రియలు చాలా వరకూ అందుబాటులోకి వచ్చాయి. అందువలన, చికిత్స జరిగిన వెంటనే మీరు ఇంటికి వెళ్ళి సాధ్యమైనంత వరకూ తిరిగి మీయొక్క రోజువారి కార్యక్రమాలను ప్రారంభించుకోవచ్చు.

నరాల వ్యాధుల యొక్క చికిత్సలకి సంబంధించిన వివరాల కొరకు, ఎవీస్ వాస్కులర్ సెంటర్లోని మాయొక్క నిపుణులని సంప్రదించండి.

Varicose Veins Treatment In Hyderabad | Bengaluru |Mysore Visakhapatnam | Vijayawada Chennai |Coimbatore Tirupati | Rajahmundry Kolkata | Madurai

For Appointment Call

Telangana: 9989527715

Andhra Pradesh: 9989527715

Tamilnadu: 7847045678

Karnataka: 8088837000

Kolkata: 9154089451

Branches

https://www.avisvascularcentre.com/wp-content/pg-soft-slot/
Home
Services
Doctors
Branches
Blog
https://recyclestore.bigcartel.com/
https://hprojekty.sk/slot-gacor/