https://annesha-style.com/cara-cepat-menang-game-slot-gacor-2022/

https://www.clearskypromotions.com/situs-judi-slot-online-terpercaya-2022/

https://1new88.com/nama-nama-situs-judi-slot-online-terlengkap/

https://langdaninhvan.com/situs-judi-slot-resmi-terlengkap-2022/

https://maturazam.com/judi-slot-online-bet-murah-terbaik-2022/

https://matarz.com/profit-daftar-di-situs-judi-slot-online/

https://jungleeats.com/link-slot-online-gampang-menang-bonus/

https://dekorstyling.com/situs-judi-online24jam-terpercaya/

https://www.vanphongphamhcm.vn/situs-judi-slot-online-gampang-menang-2022-terbaik/

https://argoodsbd.com/2022/04/17/situs-judi-slot-sering-kasih-menang-resmi/

https://blogartma.com/daftar-situs-judi-slot-online-terbaru/

https://www.kingsmedicalcenter.ae/situs-judi-slot-gacor-bonus-terbesar/

https://eric411.com/daftar-10-situs-judi-slot-terbaik-dan-terpercaya-no-1-di-indonesia/

https://www.romaedintorninotizie.it/notizie-dalla-rete/slot-gacor-hari-ini-terpercaya/

https://crytunes.co/2022/04/17/slot-online-gacor-gampang-menang-2022/

https://www.expocook.org/2022/04/17/situs-judi-slot-online-terbaru-dan-terbaik/

https://fantasypipeline.com/community/profile/obfowuyj/

https://benzocure.org/community/profile/obfowuyj/

https://secretsmassage.ca/community/profile/obfowuyj/

https://www.cybersam.info/community/profile/obfowuyj/

కాళ్ళలో రక్తపు గడ్డలకి సంబంధించిన లక్షణాలు | Avis Hospitals Book Appointment
X

Choose location for Appointment


మీ కాళ్ళలో రక్తపు గడ్డలకి సంబంధించిన లక్షణాలు డీప్ వెయిన్ థ్రోంబోసిస్‌ (డి.వి.టి) గురించి తెలుసుకోండి

deep vein thrombosis

జీవితాంతం మన యొక్క రక్తం మన శరీరం గుండా నిరంతరం ప్రవహించవలసి వుంటుంది. మీకు ఏదైనా దెబ్బ తగిలినపుడు లేదా కోత సంభవించినపుడు రక్తం గడ్డకట్టి రక్తస్రావం జరగకుండా వుంటుంది. రక్తం గడ్డలు అనేవి రక్తస్రావాన్ని ఆపడానికి ప్రధానమైనవి మరియు అలాంటి సందర్భాలలో ఆరోగ్యవంతమైనవి, అంతేకాకుండా ప్రాణాలని కాపాడగలిగేవి కూడా. కానీ, అప్పుడప్పుడు అవసరం లేని సందర్భాల్లో కూడా ఈ రక్తపు గడ్డలు ఏర్పడతాయి. ఆ సంబంధిత కారణం పూర్తైన తరువాత కూడా అవి పలుచబడకపోవచ్చు. అలాంటివి గుండెపోటు మరియు మెదడు పోటు లాంటి తీవ్రమైన సమస్యలకి దారితీయవచ్చు.

కాళ్ళలో ఏర్పడే రక్తపు గడ్డలు చర్మం ఉపరితలం క్రింద లోతైన నరాలలో ఏర్పడతాయి. అలాంటి రక్తపు గడ్డలు సాధారణంగా కాలి క్రింది భాగంలో, పొత్తి కడుపులో, లేదా తొడలో ఏర్పడతాయి. కానీ అవి చెయ్యిలో కూడా తలెత్తే అవకాశం వుంది. ఈ పరిస్థితినే డీప్ వెయిన్ థ్రోంబోసిస్‌ (DVT) అంటారు.

వేరికోస్ వేయిన్స్ ఎప్పుడు రక్తపు గడ్డలకి దారితీస్తాయి?

వేరికోస్ వేయిన్స్ అనేవి సాధారణంగా కాళ్ళమీద చర్మం యొక్క ఉపరితలం దగ్గర కనిపిస్తాయి. కాళ్ళ మీద మెలితిరిగి, ఉబ్బిపోయి మరియు బొడిపెలుగా వుండే నరాలు రక్త ప్రవాహాన్ని నెమ్మదిగా మరియు మందకోడిగా చేస్తాయి. ఈ పరిస్థితి ఉపరితల రక్తపు గడ్డలకి దారితీయవచ్చు. వేరికోస్ వేయిన్స్‌తో కలిసి పనిచేస్తూ, అలాంటి రక్తపు గడ్డలు ప్రభావిత ప్రాంతంలో లేదా చనిపోయిన రక్తనాళం చుట్టూ వాపుని, నొప్పిని, సలపడాన్ని లేదా మంటతో కూడిన వాపుని కలిస్తాయి.

వేరికోస్ వేయిన్స్‌తో సంబంధాన్ని కలిగివున్న ఉపరితల రక్తపు గడ్డలు అంత సాధారణంగా విరిగిపోవు మరియు ఊపిరితిత్తులకి ప్రయాణించి పల్మనరీ ఎంబాలిజంని (PE) కలిగిస్తాయి. ఆ తరువాత సాధారణంగా డి.వి.టి అనేది వేరికోస్ వేయిన్స్‌తో సంబంధాన్ని కలిగివుండదు.

ఏదేమైనప్పటికీ, వేరికోస్ వేయిన్స్ అనేవి చాలా పెద్దగా వుండి తీవ్రంగా వుంటే గనుక, డి.వి.టి యొక్క అవకాశాలు ఎక్కువగా వుంటాయి. డి.వి.టి సంభవించే అపాయాన్ని అంచనా వేయడానికి మీరు మీయొక్క వైద్య సహాయకుడితో మాట్లాడటం ప్రధానమైన విషయం.

వేరికోస్ వేయిన్స్ అనేది సౌందర్యపరమైన సమస్య కాదనే విషయం మనం తెలుసుకోవాలి. దీనిని గనుక అలక్ష్యం చేస్తే, డి.వి.టి, పల్మనరీ ఎంబాలిజం, అల్సర్లు లాంటి పెద్ద సమస్యలకి మరియు ఇతర కొన్ని సమస్యలకి ఇది దారితీయవచ్చు.

నరాల సమస్యలు పెరుగుతున్నాయా అని అంచనా వేయడానికి ఈ బ్లాగు మీకు సహకరిస్తుంది మరియు మీయొక్క కాళ్ళలో రక్తం గడ్డకట్టడం మొదలైన వెంటనే మీరు దానిని గుర్తించేలా మీకు తోడ్పడుతుంది.

రక్తం గడ్డల యొక్క లక్షణాలు

కదలని జీవన విధానాన్ని మీరు గనుక పాటిస్తూ వుంటే, డి.వి.టి సంభవించే అవకాశాలు ఎక్కువ – మరీ ముఖ్యంగా ఒక శస్త్రచికిత్స తరువాత లేదా కొన్ని అనారోగ్య సమస్యల వలన మీరు మంచానికే పరిమితమైనపుడు. ఈ క్రింద తెలిపిన ఏవైనా లక్షణాలని మీరు గనుక కలిగివున్నట్లయితే, మీరు త్వరిత వైద్య సహాయాన్ని పొందాలి:

వాపు: సరిగ్గా రక్తం గడ్డకట్టిన ప్రదేశంలోనే వాపు తలెత్తుతుంది. కొన్నిసార్లు మీ మొత్తం చేయి లేదా కాలు వాపు రావచ్చు.

రంగు మార్పు: ప్రభావిత ప్రాంతంలో ఎరుపు లేదా నీలి రంగు ఛాయ మొదలవడం జరుగుతుంది లేదా కొన్నిసార్లు ఆ చర్మం ఎటువంటి రంగులేని పాలిపోయిన రంగులో వుంటుంది. సహజమైన చర్మ ఛాయ కంటే మీ చర్మపు రంగులో ఏదైనా మార్పు వస్తే, దానిపై శ్రద్ధ తీసుకోవలసి వుంటుంది. మీ చర్మం దురదగా కూడా మారవచ్చు.

వెచ్చని చర్మం: మిగతా ప్రదేశాలతో పోలిస్తే ఒక రక్తపు గడ్డ అనేది అది వున్న ప్రదేశంలో మీయొక్క చర్మాన్ని వెచ్చగా ఉండేలా చేస్తుంది.

నొప్పి: కాలి తిమ్మిర్లు మరియు నొప్పి వుంటాయి. ముఖ్యంగా కాలుని వంచినపుడు అవి సంభవించడం అనేది రక్తం గడ్డలతో సంబంధాన్ని కలిగివుంటుంది. మీరు అనుభవించే నొప్పిని రక్తం గడ్డ యొక్క పరిమాణం మరియు తీవ్రత అనేవి నిర్ణయిస్తాయి.

శ్వాస సమస్యలు: మీరు ఎప్పుడూ కూడా అలక్ష్యం చేయకూడని ఒక పెద్ద ఎరుపు సంకేతం ఏంటంటే మీరు శ్వాసపరమైన కష్టాన్ని అనుభవించడమే. శ్వాసపరమైన ఇబ్బందులు దగ్గుతో పాటుగా వస్తే, రక్తం గడ్డ ఊపిరితిత్తులలోనికి చేరి ఉండవచ్చు. మరింత దారుణంగా, కొందరు రక్తాన్ని వాంతు చేసుకుంటారు. ఆక్సిజన్ అందకపోవడం వలన తలతిప్పినట్లుగా కూడా అనిపిస్తుంది.

పరిస్థితిని ముందుగానే గుర్తించి చికిత్స చేయడమే డి.వి.టి మరియు పి.ఇని నివారించే ఉత్తమ మార్గం. మీయొక్క సమస్యకి గొప్ప వ్యాధి నిర్థారణ మరియు చికిత్స కొరకు ఈరోజే ఎవీస్ వాస్కులర్ సెంటరుకి విచ్చేయండి.

Deep Vein Thrombosis Treatment In Hyderabad

For Appointment Call: 9989527715

Branches

Home
Services
Doctors
Branches
Blog