అల్సర్లు (పుళ్ళు) అంటే ఏమిటి?
ఎక్కువగా మీయొక్క పాదాలు మరియు కాలివ్రేళ్ళ పైన వుండే చర్మంపైన సంభవించే దెబ్బలు, పుళ్ళు లేదా గాయాలే ఈ అల్సర్లు. సాధారణంగా అవి వాటంతట అవే నయంకాకుండా వుండి ఇన్ఫెక్షన్కి గురికాగలవు. చికిత్స తరువాత కూడా, ఆ గాయాలు మానడానికి కొన్ని నెలల సమయం పట్టవచ్చు.
పాదాల అల్సర్లలోని రకాలు
ప్రభావిత ప్రాంతం మరియు దాని చుట్టూ వున్న చర్మం మరియు హద్దుల యొక్క ప్రత్యక్షత ఆధారంగా అల్సర్లని మూడు వర్గాలుగా విభజించవచ్చు:
ఆర్టీరియల్ అల్సర్లు: రక్తప్రసరణ సమస్యలని కలిగివున్న రోగులలోని పాదాలలో ఇవి కనిపిస్తాయి. సరిగ్గాలేని రక్తప్రసరణ చిన్న గాయాలకి లేదా నయంకాని కోతలకి దారితీస్తుంది, మరియు అవి కొంతకాలంలో అల్సర్లుగా మారతాయి.
వీనస్ అల్సర్లు: రక్తనాళాల సంబంధిత సమస్యలని కలిగివున్న ప్రజలలో ఇవి గమనించబడతాయి. మీ కాళ్ళలోని నరాలు సమర్థవంతంగా రక్తాన్ని తిరిగి మీయొక్క గుండె వైపుకి గనుక నెట్టకపోతే, అలాంటి సందర్భంలో బయటకి కనబడే పుళ్ళు సంభవిస్తాయి. అవి ఎక్కువ శాతం మీ కాలిలోని చీలమండలం యొక్క పైభాగాన్ని ప్రభావితం చేస్తాయి.
మధుమేహ కారక పాదాల పుళ్ళు: పాదాలలోని కణజాలాలనేవీ విరిగిపోయి, అవి వాటి క్రింది యొక్క పొరలని బయటకి కనబడేలా చేసినపుడు మధుమేహ సంబంధిత పాదాల పుళ్ళు సంభవిస్తాయి. మధుమేహాన్ని గనుక భోజనంతో, వ్యాయామంతో మరియు చికిత్సలతో సరిగ్గా నిర్వహించుకోకపోతే కొన్ని క్లిష్ట సమస్యలు సంభవించవచ్చు. సాధారణంగా పాదం అడుగున సంభవించే పుండు అనేది ఇందులో ఒక పెద్ద సమస్య. వీటన్నింటిలో కూడా, మధుమేహం వలన తలెత్తే అల్సరు మధుమేహ వ్యాధిలోనే అత్యంత విధ్వంసకరమైన మరియు ప్రాముఖ్యత కలిగిన సమస్యలలో ఒకటి.
మధుమేహం వున్న వాళ్ళలో పదిహేను శాతం మంది జనంలో వారి పాదం లేదా వ్రేళ్ళలో అల్సర్లు తలెత్తుతాయని అంచనా వేయడమైనది. ఇందులో ఒక ముఖ్యమైన నిష్పత్తిలోని (14 నుండి 24%) జనం విషయంలో వారికి ఒక అల్సరు సంభవించిన తరువాత వారియొక్క అవయాన్ని తొలగించాల్సి వస్తుంది.
మధుమేహ కారక పాదాల పుళ్ళు ఎవరికి సంభవిస్తాయి?
ఏ వయసులోనైనా సరే మధుమేహ కారక పాదాల పుళ్ళు సంభవిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. కానీ డయాబెటీస్ మలీటస్ కలిగివున్న 45 సంవత్సరాల మరియు అంతకన్నా ఎక్కువ వయసున్న వారిలో ఇది ఎక్కువగా సంభవిస్తుంది.
మధుమేహ సంబంధిత మూత్రపిండాల వ్యాధులు, కంటి వ్యాధులు మరియు గుండె వ్యాధులని కలిగివుండి ఇన్సులిన్ వాడే రోగులలో పాదాల పుళ్ళు తలెత్తే అవకాశం ఎక్కువగా వుంటుంది.
ఊబకాయం, పొగాకు మరియు మద్యపానం లాంటి జీవన విధానాలు, మరియు గుండె లేదా మూత్రపిండాల వ్యాధులు కూడా అల్సరు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతాయి.
నరాల వ్యాధి వలన ఒక కాయలాంటిది సంభవించడమనేది మొదటి దశ. పాదం వికృతంగా మారడం మరియు స్పర్శని కోల్పోవడం వలన తీవ్రతరమవుతూ వుండే గాయం తలెత్తవచ్చు. చర్మం విపరీతంగా పొడిబారుతుంది. దాని ఫలితంగా చివరికి రక్తస్రావం జరగడం, అది నశించిపోయి ఒక అల్సరుగా మారడమనేది జరుగుతుంది.
ప్రయోగశాలల్లో పరీక్షలు మరియు నిర్థారణలు
ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, హిమోగ్లోబిన్ లెవెల్స్, కంప్లీట్ మెటాబోలిక్ ప్యానెల్, కంప్లీట్ బ్లడ్ కౌంట్, ఈ.ఎస్.ఆర్, మరియు సి-రియాక్టివ్ ప్రోటీన్ (సి.ఆర్.పి) అనేవి అల్సరుని అంచనా వేసే సమయంలో నిర్వహించే అత్యంత సాధారణమైన పరీక్షలు.
పాదాల అల్సర్లకి చికిత్స
వణుకులు, జ్వరం, మంటతో కూడిన వాపు, వెచ్చదనం, చర్మం కందిపోవడం లేదా అల్సరు గట్టిపడటం మొదలైన లక్షణాలని గమనించడం ద్వారా పెరుగుతున్న ఇన్ఫెక్షన్కి సంబంధించిన సాక్ష్యం గుర్తించబడుతుంది. ఇన్ఫెక్షన్కి సంబంధించిన ఏదైనా హెచ్చరిక వుంటే గనుక యాంటీబయోటిక్స్ని ఇవ్వడం జరుగుతుంది. ఇన్ఫెక్షన్ యొక్క తీవ్రత ఆధారంగా యాంటీబయోటిక్స్ మోతాదు, రకం, మరియు వ్యవధి అనేది నిర్ణయించబడుతుంది.
మరొక చికిత్సాపరమైన చర్య ఏంటంటే దీనికి మూలాధారమైన వాస్కూలర్ వ్యాధికి చికిత్స చేయడం. ఆక్సిజన్ సరఫరాని పరిమితం చేసే రక్త సరఫరా కొరతని మరియు అల్సరుకి యాంటీబయోటిక్స్ యొక్క చేరవేతని రీవాస్కులరైజేషన్ ద్వారా మెరుగుపరచవచ్చు. ఇందులో అల్సరుని నయం చేసే మెరుగైన అవకాశం వుంటుంది. ఆ తరువాత పుండుని శుభ్రపరచడం లేదా ఆ కాయలాంటి వాటిని తొలగించడం జరుగుతుంది.
ఉత్తమ ఫలితాల కొరకు, అల్సరుకి చికిత్స చేసే సమయంలో ఒక వైద్యుడు, పాదాల చికిత్సా నిపుణుడు, ఒక వాస్కులర్ శస్త్రచికిత్సా నిపుణుడు, మరియు గాయంపై శ్రద్ధ వహించే వైద్య సిబ్బంది మొదలైనవారు తప్పనిసరిగా ఉండవలసి వుంటుంది.
Venous Ulcer Treatment Hyderabad | Vijayawada | Visakhapatnam
For Appointments Call : 9989527715