నరాల చికిత్స ఎప్పుడు అనైతికంగా మారుతుంది?

Varicose Veins

రోగుల సంఖ్య పెరుగుతూ వుండటం వలన మరియు దాని ఫలితంగా చికిత్సా మార్గాలకి కూడా డిమాండు విపరీతంగా పెరుగుతూ వుండటం వలన నరాల వ్యాధులకి సంబంధించిన చికిత్స ఒక లాభసాటి మార్కెట్టుగా మారిపోయింది. దురదృష్టవశాత్తు, ఎన్నో ఆసుపత్రులు మరియు వైద్యవృత్తి నిపుణులు దీనిని ఒక మోసపూరిత వ్యాపారానికి ఒక అవకాశంగా భావిస్తున్నారు. రోగుల పరిస్థితిని అవకాశంగా మార్చుకొనే కొన్ని ఆసుపత్రులు వున్నాయి. కాబట్టి నరాల చికిత్స చేయించుకోబోయే ఒక రోగి మోసాల బారిన పడకుండా చూడటమే ఈ వ్యాసం యొక్క ముఖ్య లక్ష్యం.

కొన్ని ఆసుపత్రులు వారి యొక్క సేవల గురించి చురుకుగా ప్రకటనలు గుప్పిస్తున్నాయి. చవకైన ధరకే నరాలకి సంబంధించిన పెద్ద పెద్ద చికిత్సలను అందిస్తామని చెప్పడం ద్వారా రోగులకి ఎందరో ఎరవేస్తున్నారు. ఎన్నో నరాల చికిత్సా కేంద్రాలు, వైద్యులు మరియు చికిత్సా విధానాలు వుండటం వలన, మీరు మీయొక్క పరిస్థితికి సంబంధించి ఒక గొప్ప వైద్యున్ని ఎలా ఎంచుకుంటారు? ఈ ప్రక్రియలో మీరు పరిగణలోకి తీసుకోవాల్సిన కొన్ని విషయాలను మేము చర్చిస్తాము.

మీరు గనుక నరాల సమస్యలతో బాధపడుతూ వుంటే, మీరు సంప్రదించడానికి మూడు రకాల నరాల వైద్యులు మీకు అందుబాటులో వుంటారు.

వారి యొక్క నైపుణ్యాలలో మరియు శిక్షణా ప్రత్యేకతల్లో ఎటువంటి వ్యత్యాసాలని వారు కలిగివుంటారో తెలుసుకోవడానికి చదవండి.

వాస్కులర్ శస్త్రచికిత్సా నిపుణుడు

వాస్కులర్ శస్త్రచికిత్సా నిపుణులు ఈ శస్త్రచికిత్సకి సంబంధించి రెండు సంవత్సరాల కఠినమైన శిక్షణని తీసుకున్న వైద్యులు. బోర్డు పరీక్షలకి అర్హత పొందడానికి వారు వాస్కులర్ సర్జరీలో రెండు సంవత్సరాల ప్రత్యేకమైన ఫెలోషిప్ తీసుకోవలసి వుంటుంది. బోర్డు ద్వారా ధృవీకరించబడిన వెంటనే, వారు స్వంతంగా చికిత్స చేసేటంతటి ప్రావీణ్యం సంపాదించుకునే వరకూ కూడా అనుభవజ్ఞులైన శస్త్రచికిత్సా నిపుణుల నేతృత్వంలోనే పని చేయవలసి వుంటుంది.

ఈ ప్రక్రియలో తలెత్తే ఏ క్లిష్ట సమస్యలనైనా ఎదుర్కొని నిర్వహించగలిగేలా ఇటువంటి తీవ్రమైన శిక్షణ వారిని సంసిద్ధం చేస్తుంది. వారు సులభమైన మరియు క్లిష్టమైన నరాల సమస్యలను సమర్థవంతంగా నిర్వహించగలిగి, కోతతో కూడిన మరియు ఇతర తక్కువ కోతతో కూడిన శస్త్రచికిత్సలను కూడా నిర్వహించగలుగుతారు.

నరాల నిపుణుడు

అర్హత పొందిన నరాల నిపుణులు వస్కూలర్ శస్త్రచికిత్సలో, ఇంటర్వేన్షనల్ రేడియోలజీలో, లేదా కార్డియోలజీలో శిక్షణా నేపథ్యాన్ని కలిగివుంటారు. అయినప్పటికీ, వారు శస్త్రచికిత్సా నిపుణులు కారు. వారు నరాల చికిత్సలో వారియొక్క శస్త్రచికిత్సా నైపుణ్యాన్ని అదనపు శిక్షణ మరియు బోర్డు ధృవీకరణ ద్వారానే పొందుతారు.

తక్కువ కోతతో కూడిన చికిత్సలకి సంబంధించి అవసరయ్యే అత్యుత్తమ నైపుణ్యాలను వివిధ రకాల కఠినమైన శిక్షణా కార్యక్రమాల ద్వారా వారు సంపాదించి వుంటారు.

ఫ్లెబోలజిస్ట్

ఫ్లెబోలజిస్ట్ అనే నిపుణుడు స్పైడర్ వేయిన్స్, రక్తపు గడ్డలు, కాలి పుళ్ళు మరియు అదే రకమైన వాస్కులర్ సమస్యలకి వ్యాధి నిర్థారణ చేసి వాటికి చికిత్స చేయడంలో ప్రత్యేక నైపుణ్యాన్ని కలిగివున్న వైద్య అర్హత పొందిన ఒక వైద్యుడు.

వారు శిక్షణ పొందిన శస్త్రచికిత్సా నిపుణులు కారు. అంతేకాకుండా, వారు కోతతో కూడిన వాస్కులర్ శస్త్రచికిత్సలో లేదా వాస్కూలర్ చికిత్స తరువాత కొనసాగే నిర్వహణ చికిత్సలో శిక్షణ గాని లేదా లైసెన్సుని గాని పొందినవారు కాదు. వారు కలిగివున్న ధృవీకరణ పత్రం అనేది విస్తృత పరిధి కలిగిన ప్రత్యేక నైపుణ్యాల శిక్షణా కార్యక్రమాన్ని అనుసరించి వుండదు. వారు అల్ట్రాసౌండ్ గైడెడ్ స్క్లెరోథెరపీ, ఏండోవీనస్ లేజర్ అబ్లేషన్ మరియు రేడియో ఫ్రీక్వన్సీ అబ్లేషన్ మొదలైన వాటిల్లో శిక్షణ పొందుతారు. 

ఈ విధంగా అందించబడే చికిత్స ఎక్కువగా వేరికోస్ వేయిన్స్ యొక్క కాస్మెటిక్ (సౌందర్య) చికిత్సకి మాత్రమే పరిమితమై వుంటుంది. కోతతో కూడిన చికిత్స అవసరయ్యే ఎక్కువ క్లిష్టతలు వున్న పరిస్థితులలో మాత్రం వాటిని ఖచ్చితంగా ఒక వాస్కులర్ శస్త్రచికిత్సా నిపుణుడికి మాత్రమే చూపించవలసి వుంటుంది.

చవకైన చికిత్సలు ఎలా మరియు ఎందుకని ప్రకటించబడతాయో ఎపుడైనా ఆలోచించారా?

వేరికోస్ వేయిన్స్ కొరకు మేము “అత్యంత చవకైన చికిత్సని” అందిస్తున్నామని ఎన్నో ఆసుపత్రులు పేర్కొంటాయి. చికిత్సను పొందే ఒక లభ్దిదారునిగా, వేరికోస్ వేయిన్స్ వ్యాధి క్రమంగా పెరిగే వ్యాధి అని మరియు పూర్తిగా నయమవడం అనేది అరుదుగా జరుగుతుందనే విషయాన్ని మీరు తెలుసుకోవాలి. అన్నింటికంటే కూడా, చికిత్స యొక్క సగటు ఖర్చు మీరు తీసుకునే చికిత్సా రకం పైన ఆధారపడి వుంటుంది. మీయొక్క వైద్య పరిస్థితి మరియు వ్యాధి యొక్క తీవ్రతను బట్టి ఈ చికిత్సలో వివిధ రకాల ప్రక్రియలు ఇమిడి వుంటాయి.

చవకైన చికిత్సలను అందించే వైద్యులందరూ కూడా ప్రామాణికమైన నియమాలను అనుసరిస్తారా?

ఎక్కువ శాతం అనుసరించరు!

వారు సాధారణంగా ఒకే ప్రక్రియని నిర్వహిస్తారు- ఫోమ్ స్క్లేరోథెరపీ లేదా ఎండోవీనస్ అబ్లేషన్ థెరపీ, ఈ రెంటిలో ఎదో ఒకటి. ఫలితలనేవి కొంత కాలం వరకూ సంతృప్తిగా అనిపించవచ్చు, కాని సమస్యకి మూలకారణం మాత్రం అలానే ఉండిపోతుంది.

సాధారణంగా, పెద్ద నాళాలు సరిగ్గా స్పందిచవు కాబట్టి, వాటికి స్క్లేరోథెరపీ సిఫారసు చేయబడదు. విరుద్ధమైన చికిత్సా విధానాలని ఎంచుకోవడమనేది రక్తం గడ్డలు ఏర్పడటానికి దారితీసి చర్మం రంగుకోల్పోవడానికి కూడా కారణం కావొచ్చు. ఆపైన, క్లిష్టతలను తప్పించుకోవడానికి అదనపు ప్రక్రియలు కూడా అవసరమవుతాయి. దీనర్థం ఈ సమస్యలు మళ్ళీ మళ్ళీ తలెత్తే అవకాశం ఎక్కువగా వుంటుంది, మరియు తదుపరి ప్రక్రియలన్నీ మొత్తం చికిత్సా ఖర్చుల్లోకి వచ్చి చేరుతుంటాయి.

ఒక వాస్కులర్ రేడియోలాజిస్టుని తప్పించడం ద్వారా చవకగా, సులభంగా చికిత్స చేయడమా?     

ఖరీదైనవి కాబట్టి డ్యూప్లెక్స్ అల్ట్రాసౌండ్ స్కాన్ లాంటి వాటిని నిర్వహించడానికి ఎన్నో ఆసుపత్రులు ఇంటర్వేన్షనల్ రేడియోలాజిస్టుని ఎంచుకోకపోవచ్చు. ఆ విధంగా అటువంటి నిపుణుల సేవలను తొలగించడం వలన చికిత్స చవకగా మారవచ్చు.

ఏదేమైనప్పటికీ, ఇలా చేయడం వలన వ్యాధి నిర్థారణ దశలో మీరు ముఖ్యమైన సమాచారాన్ని కోల్పోతారు మరియు సమస్యకి చికిత్స జరగకుండా వుండి అది భవిష్యత్తులో అదే సమస్య తిరిగి ఎక్కువగా సంభవించే అవకాశానికి దారి తీస్తుంది.

ఒక ప్రత్యేకమైన నైపుణ్యం కలిగిన వాస్కులర్ సాంకేతిక నిపుణుడి ద్వారా నిర్వహించబడే వీనస్ అల్ట్రాసౌండ్ స్కాన్ అనేది ఫోమ్ స్క్లేరోథెరపీ చేయలేనంత పెద్దవిగా నరాలు ఉన్నాయా అనే విషయాన్ని స్పష్టంగా చూపిస్తుంది. అంతేకాకుండా, నిపుణుడి సూచనల ఆధారంగా తీసుకునే చికిత్సా నిర్ణయమనేది ఆ సమస్య మరల తలెత్తకుండా రక్షిస్తుంది.

అనుభవం లేని లేదా అర్హతలేని వైద్యుల ద్వారా నిర్వహించబడే అసంపూర్ణమైన ప్రారంభ పరీక్షలు ఈ క్రింది పరిస్థితులకు దారి తీస్తాయి:

  • తప్పుడు వ్యాధి నిర్థారణ తప్పుడు వైద్య విధానాలు అవలంభించే పరిస్థితికి దారితీస్తుంది.
  • విరుద్ధమైన ప్రక్రియ మీయొక్క కాళ్ళపైన గాయపు మచ్చలకి లేదా మరకలకి దారి తీస్తుంది.
  • మితిమీరిన చికిత్సలు మరియు వైద్య ప్రక్రియలు నిర్వహించబడతాయి.

చవకగా కొనండి, అంటే రెండుసార్లు కొనండి.

ఇలాంటి కేసులని నిర్వహించడంలో వైద్యునికి అవగాహనా, నైపుణ్యాలు, మరియు ప్రావీణ్యం లేని పరిస్థితి క్లిష్టతలకి దారి తీయవచ్చు, అవి సమస్యలు తిరిగి తలెత్తే సమయంలో మరియు క్లిష్టతలు పెరిగే సమయంలో మీయొక్క ఆరోగ్య పరిస్థితిని వివిధ మార్గాలలో ప్రభావితం చేయవచ్చు. ఇటువంటి క్లిష్ట సమస్యలు మొత్తం చికిత్సని తిరిగి మళ్ళీ మళ్ళీ ప్రారంభించే పరిస్థితికి దారి తీయవచ్చు.  

భద్రతా మరియు నాణ్యతలో రాజీపడకుండా చికిత్స యొక్క ఖర్చు తగ్గించడం కుదురుతుందా?

రక్తప్రసరణ వ్యవస్థలో నరాలలోని రక్తం తిరిగి గుండెకి మరియు ఊపిరితిత్తులకి రవాణా చేయబడుతుంది. కాబట్టి చవకైన లేదా నాణ్యత తక్కువైన ప్రోడక్టుని నరాల్లోకి స్క్లేరోసింగ్ ఏజెంట్లగా చొప్పించకపోవడం చాలా ముఖ్యం.

నిర్వహణ సంబంధిత వైద్య పరికరాలు మరియు సామగ్రి చాలా ఖరీదైనవి. ముఖ్యంగా, భద్రత నిర్థారణ కొరకు సామాగ్రి మొత్తం కూడా కఠినమైన పరీక్షలు మరియు నిర్వహణ ప్రక్రియలకి గురవుతుంది. దీని కారణంగా, సరైన వైద్య చికిత్స కొరకు కనీస ఖర్చు అనేది వుంటుంది.

చవకైన చికిత్సని అందిస్తున్న వారెవరైనా కూడా భద్రతా మరియు నాణ్యత విషయంలో రాజీపడే ఉంటారా? అలా అయితే, మీరు మీ ఆరోగ్యం మరియు భద్రత కంటే కూడా చికిత్స యొక్క ఖర్చుకే ప్రాధాన్యతనిస్తారా?

ఎవీస్ వాస్కులర్ సెంటర్ మిగతా వాటన్నింటి కంటే కూడా ఎలా భిన్నమైనది?

డా. రాజా వి కొప్పాలా గారి చేత స్థాపించబడిన ఈ వైద్య కేంద్రం యు.ఎస్.ఎఫ్.డి.ఎ ధృవీకరించిన విధానాలను మాత్రమే అనుసరిస్తుంది, మరియు ఈ బృందం 95% విజయ శాతంతో 13,000 కన్నా ఎక్కువ ప్రక్రియలను పూర్తి చేసింది.

25 సంవత్సరాల అనుభవంతో కూడి అంతర్జాతీయ అర్హతలు కలిగిన ఇంటర్వేన్షనల్ రేడియోలాజిస్ట్ మరియు వాస్కులర్ శస్త్రచికిత్సా నిపుణుడైన డా. రాజా గారు, చక్కని అనుభవం కలిగిన మరియు అర్హత కలిగిన నరాల వైద్య నిపుణులకి మరియు ఇనేర్వేన్షనల్ రేడియోలాజిస్టులకి ఎవీస్ వాస్కూలర్ సెంటర్లో నాయకత్వం వహిస్తున్నారు.

వాస్కూలర్ ఇంటర్వేన్షనల్ రేడియోలజీలో ఎం.డితో పాటు నిష్కళంకమైన విద్యా యోగ్యతలు కలిగివుండటం మరియు ఉత్తర అమెరికా రెడియోలాజికల్ సొసైటీలో ఒక గౌరవప్రదమైన సభ్యత్వం కలిగివుండటం, మరియు రాయల్ కాలేజ్ ఆఫ్ రేడియోలాజిస్ట్స్‌, యు.కే (ఎఫ్.ఆర్.సి.ఆర్), బ్రిటిష్ సొసైటీ ఆఫ్ ఇంటర్వేన్షనల్ రేడియోలజీ మరియు సింగపూర్ రెడియోలజికల్ సొసైటీలో ఒక విశిష్ట సభ్యుడు అయినందు వలన ఒక సురక్షితమైన చేతుల్లోనే మీరు వున్నారని నిశ్చింతగా ఉండొచ్చు.

ఈ సెంటర్ కలర్ డాప్లర్ స్కాన్ కొరకు అంతర్గతంగానే పూర్తి సదుపాయాలని అందిస్తుంది మరియు వేరికోస్ వేయిన్స్ కొరకు నొప్పిలేని, తక్కువ కోతతో కూడిన లేజర్ అబ్లేషన్ మరియు స్క్లేరోథెరపీ చికిత్సలో ప్రత్యేకతని కలిగివుంది. మరింత తెలుసుకోవడానికి లేదా వేరికోస్ వేయిన్స్ చికిత్స మార్గాలు మరియు నిర్వహణ గురించి ఎటువంటి ప్రశ్నలు మీకున్నా, 998-952-7715కి కాల్ చేయండి మరియు మా ఎవిస్‌లోని వాస్కులర్ నిపుణుల యొక్క అపాయింట్‌మెంట్‌ని బుక్ చేసుకోండి.

Varicose Veins Treatment In Hyderabad | Bengaluru |Mysore Visakhapatnam | Vijayawada Chennai |Coimbatore Tirupati | Rajahmundry Kolkata

For Appointment Call

Telangana: 9989527715

Andhra Pradesh: 9989527715

Tamilnadu: 7847045678

Karnataka: 8088837000

Kolkata: 9154089451