డయబెటిక్ ఫుట్ అల్సర్స్

మీరు మధుమేహ వ్యాధి గ్ర‌స్ధులైతే మీ వైద్యులు మీ కాళ్ళు, పాదాల గురించి ముఖ్యమైన జాగ్రతలు ఏ విధంగా తీసుకొవాలొ తెలియజేసే ఉంటారు. ఎందుకో మీరు ఊహించారా?


ఎందుకంటే, ముఖ్యంగా ఇతరులతో పొల్చుకుంటే, మధుమేహవ్యాధి కలవారికి తొందరగా మానని, కాలి పుండ్లు (డ‌యాబెటిక్ ఫుట్ అల్సర్స్) ఏర్పడే అవకాశాలు చాలా ఎక్కువ. తొందరగా మానని కాలి పుండ్లు దీర్ఘకాలిక సమస్యగా మారి, ప్రాణాంతకం కాగలవు.


డయబెటిక్ ఫుట్ అల్సర్స్ అంటే ఏంటి అవి ఎలా ఏర్పడుతాయి ?


మధుమేహ వ్యాధి గలవారు, పాదాలకు చిన్న చిన్న దెబ్బలు తగిలినా, అవి మానకుండా వాటి చుట్టూ ఉన్న కణజాలానికి హాని కలిగించి ఎముకలను కూడా దెబ్బతీసే స్ధితికి తీసుకురాగలదు. చివరకి శస్త్రచికిత్స ద్వారా వ్రేలు గాని, పాదంలో కొంత భాగం కానీ, పూర్తిగా పాదం కాని, లేదా కాలు కూడా తీసివేయవలసిన పరిస్థితికి దారితీయగలదు.


అందుకే, చిన్న చిన్న గాయాలైనా, పుండ్లైనా ముందుగానే గమనించి, ముందు జాగ్రతలు తీసుకొవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇతరత్రా మధుమేహ కంటి సమస్యలు (డయబెటిక్ రెటినొపతీ), లెక మూత్రపిందాల సమస్యలు (డయబెటిక్ నెఫ్రొపతి) లాంటి వాటితొ బాధపడేవారిలొ ఈ అపాయం కాస్త ఎక్కువే.


ఇటువంటి ప్రాణాంతక స్థితి నుండి జాగ్రత్త పడాలంటే,తప్పనిసరిగా, తగు రీతిగా అవసరమైన వైద్య చికిత్స ఎంతైనా ముఖ్యం

Foot Ulcer Treatment In Hyderabad | Visakhapatnam | Vijayawada | Chennai

For Appointment Call: 9989527715,7847045678