ఆక్సీజన్ తొలగించబడిన రక్తాన్ని మీయొక్క అవయవాల నుండి మరియు కణజాలాల నుండి తిరిగి మీ గుండెకి చేరవేసే నరాలు దెబ్బతిన్నపుడు ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేఖంగా మీ రక్తాన్ని పైకి, గుండె వైపుకి పంపించేలా సహకరించడానికి మీ నరాల్లో ఒకే వైపు కవాటాలు వుంటాయి. ఈ కవాటాలు దెబ్బతింటే రక్తం చురుకుతనం కోల్పోయి పాదాల వైపుకి ప్రయాణించి క్రింది కాళ్ళలోని కవాటం దగ్గర పోగవుతుంది. ఎక్కువగా కాళ్ళలో తలెత్తే ఈ పరిస్థితినే ధీర్ఘకాలిక నరాల అసమర్థత (CVI) అని అంటారు.
ఈ పరిస్థితిలో నరాలు ఉబ్బడం మొదలవుతుంది. ఫలితంగా నొప్పి, బరువుగా అనిపించడం, కాలి తిమ్మిర్లు, కాలు అలసినట్లుగా వుండటం, మరియు చీలమండ వాపు లాంటి సమస్యలు తలెత్తుతాయి.
రక్తనాళాలలో రక్తం పోగయ్యినపుడు పాడైన నరాలు కాళ్ళపైన చర్మపు రంగుని పోయేలా చేస్తాయి. రక్తనాళాలలో ఒత్తిడి పెరిగినపుడు, ద్రవం అనేది చుట్టూ వున్న కణజాలాల్లోకి వెళ్ళిపోయి కాళ్ళు మరియు చీలమండల యొక్క రంగు మార్పుకి కారణమవుతుంది. చికిత్స చేయబడని CVI సమస్య, వీనస్ స్టేసిస్ డెర్మాటైటిస్ అనే పరిస్థితికి దారితీస్తుంది.
చర్మపు రంగులో నాటకీయమైన మార్పులు రావడమనేది పెరుగుతున్న CVI సమస్యకి ఒక ప్రధాన లక్షణం. మీయొక్క రక్తంలోని ప్రోటీన్లు (హిమోగ్లోబిన్) విచ్ఛిన్నం చెందడం ద్వారా ఏర్పడే హెమోసిడేరిన్ యొక్క నిల్వల కారణంగా తరువాతి దశలలో అత్యధికంగా రంగు మారే పరిస్థితి కూడా తలెత్తుతుంది. చర్మం మెల్లిమెల్లిగా గోధుమ, ఎరుపు రంగులోకి మారుతుంది లేదా కంచు రంగులోనికి మారుతుంది.
మీ చీలమండలపై, పాదాలపై, లేదా కాళ్ళపై, లేదా మీయొక్క చర్మం మీద కొన్ని చోట్ల గనుక రంగుమారిన మచ్చలు ఏర్పడి గణనీయంగా నల్లగా మారుతూ వుంటే, వీలయినంత త్వరగా మీరు వైద్య సహాయం కొరకు సంప్రదించడం మంచిది. సరైన సమయంలో CVI మరియు వీనస్ స్టేసిస్ డెర్మాటైటిస్కి గనుక చికిత్స చేయకపోతే, మీకు డీప్ వెయిన్ థ్రోంబోసిస్, పల్మనరీ ఎంబాలిజం, వీనస్ లెగ్ అల్సర్స్, మరియు ఇంకెన్నో సమస్యలు తలెత్తే అవకాశాలు వుంటాయి.
అందువలన మీయొక్క చర్మపు రంగులో గానీ, ఉపరితలంలో గానీ లేదా మీ క్రింది కాళ్ళు లేదా మీ చీలమండల చుట్టూ రంగులో గానీ మార్పుని మీరు గమనిస్తే, అంతర్లీనంగా ఒక వాస్కులర్ సమస్య ఉందనే అనుమానాన్ని కొట్టిపారేయేలేం. ఎటువంటి ఆలస్యం లేకుండా తొందరగా వైద్య చికిత్స ప్రారంభించాలి. మీరు గనుక తీవ్రమైన నొప్పిని మరియు అసౌకర్యాన్ని గనుక అనుభవిస్తుంటే, మీరు ఒక నరాల నిపుణుడికి సిఫారసు చేయబడతారు.
చికిత్సకి ముందు రక్త ప్రవాహంలోని అసహజమైన లోపాలను నిర్థారించడానికి మీయొక్క వైద్యుడు ఒక అల్ట్రాసౌండ్ స్కాన్‌ని నిర్వహించే అవకాశం వుంటుంది.
అందుబాటులో వున్న చికిత్స:
ఒక వాస్కులర్ సమస్య కారణంగానే మీయొక్క చర్మం రంగు మారుతోందని మీ వైద్యుడు గనుక నిర్ధారించుకుంటే, తరువాత మీయొక్క లక్షణాలు, వైద్య చరిత్ర, మరియు పరిస్థితి యొక్క తీవ్రతను బట్టి మీయొక్క చికిత్సా విధానం నిర్థారించబడుతుంది.
సాధారణంగా అందించబడే చికిత్సలలో కొన్ని:
స్క్లెరోథెరపీ:
స్క్లెరోథెరపీ అనేది నరాల వ్యాధులకి సంబంధించి తక్కువ కోతతో కూడిన ఒక చికిత్సా విధానం. ఇందులో పాడైన నరాలలోకి నేరుగా ఒక ద్రావణాన్ని చొప్పించడం జరుగుతుంది. ఆ విధానంగా ఆ నరాలు ముడుచుకుపోయేలా చేసి వాటిని మాయం చేయడం జరుగుతుంది.
లేజర్/రేడియోఫ్రీక్వన్సీ అబ్లేషన్: నరాల సమస్యలకి చికిత్స చేయడానికి క్యాథటర్లు (గొట్టాలు), లేజర్లు/రేడియోఫ్రీక్వన్సీ శక్తిని, మరియు అల్ట్రాసౌండ్‌ని ఉపయోగించే విధానాన్నే అబ్లేషన్ అని అంటారు. ఈ ప్రక్రియలో అసహజంగా పనిచేసే నరాలని వేడిచేసి వాటిని నాశనం చేయడం జరుగుతుంది. ఇది నరాల గోడలని నాశనం చేస్తుంది. ఆ తరువాత కాలక్రమేణా చనిపోయిన ఆ కణజాలాన్ని శరీరం తిరిగి గ్రహించుకుంటుంది మరియు చనిపోయిన నరాలు మాయమైపోతాయి.
కాలు రంగుని కోల్పోవడాన్ని అలక్ష్యం చేయడం వలన కలిగే ప్రమాదాలు.
ఎక్కువ కాలం వరకూ చర్మం రంగు మారడం లేదా రంగుని కోల్పోవడం వలన మీ చర్మానికి మాత్రమే హాని జరుగదు. మీ చర్మం చుట్టూ వున్న మెత్తని కణజాలాలు మందంగా మరియు విపరీతంగా పొడిగా మారి తీవ్రమైన నొప్పి మరియు అసౌకర్యానికి దారితీయవచ్చు.
మీయొక్క చర్మ సమస్యలపై మరింత సమాచారాన్ని తెలుసుకోవాలని మీరు అనుకుంటుంటే, ఎవీస్ వాస్కులర్ సెంటర్లోని మాయొక్క నిపుణులైన వైద్యులని సంప్రదించండి. వెంటనే మీయొక్క అపాయింట్‌మెంట్‌ని బుక్ చేసుకోండి.
Varicose Veins Treatment In Hyderabad | Bengaluru |Mysore | Visakhapatnam | Vijayawada | Chennai |Coimbatore | Tirupati | Rajahmundry | Kolkata | Madurai
For Appointment Call
Telangana: 9989527715
Andhra Pradesh: 9989527715
Tamilnadu: 7847045678
Karnataka: 8088837000
Kolkata: 9154089451