గర్భాశయ కణితుల ఎంబోలైజేషన్ – ఈ ప్రక్రియ సమయంలో మరియు తరువాత ఏం ఆశించవచ్చు?

Uterine fibroids

కొన్ని దశాబ్దాలుగా, గర్భాశయంలో కణితుల సమస్యతో బాధపడుతున్న స్త్రీలకి వారి యొక్క వ్యాధి లక్షణాలను నయం చేయడానికి రెండు మార్గాలు సూచించబడ్డాయి – గర్భాశయం తొలగింపు (Hysterectomy), శస్త్రచికిత్స ద్వారా  గర్భాశయాన్ని పూర్తిగా తొలగించడం, లేదా నొప్పిని అలానే తట్టుకొని ఆయొక్క లక్షణాలు వాటంతట అవే పెరిగే వరకూ ఎదురుచూడటం. ఆ విధంగా వారి  యొక్క పిల్లలు కనే మరియు హార్మోన్లని ఉత్తత్తి చేసే సామర్థ్యాన్ని కాపాడటం. ఆధునిక వైద్యం ఎన్నో రకాల చికిత్సా ప్రత్యామ్నాయాలను అందిస్తోంది. అందులో గర్భాశయ కణితుల ఎంబోలైజేషన్ విధానం కూడా ఒకటి.

ఒక స్త్రీ యొక్క గర్భాశయం పైన లేదా లోపల అసహజంగా పెరిగే ఈ కణితులు సాధారణంగా క్యాన్సర్ రకం కానివి లేదా అపాయం లేనివి అయినప్పటికీ, అవి పెద్దగా మారి విపరీతమైన అసౌకర్యాన్ని కలిగించవచ్చు. ఎటువంటి లక్షణాలు లేదా గురుతులు లేకుండా కూడా ఇవి ఉనికిలో ఉండగలవు.

అసాధారణంగా ఎక్కువగా గుండె లేదా దీర్ఘంగా వుండే నెలసరి, అప్పుడప్పుడు రక్తస్రావం, వెన్ను లేదా నడుము నొప్పి, సంభోగం చేసేటప్పుడు నొప్పి, క్రింది పొత్తికడుపులో ఒత్తిడి, పొత్తికడుపు పెద్దదవడం, మరియు మూత్రం ఎక్కువ సార్లు వెళ్ళవలసి రావడం మొదలైనవి ఇబ్బందిపెట్టే అతి ప్రధానమైన లక్షణాలుగా చెప్పవచ్చు. ఈ సమస్యలని ఎదుర్కొంటున్న స్త్రీలు వీటి నుండి ఉపశమనం కోసం తల్లడిల్లుతారు. ఈ గర్భాశయ కణితుల వలన, అతి తీవ్రమైన పరిస్థితుల్లో, సంతాన రాహిత్యం, ముందుగానే ప్రసవించడం మరియు గర్భస్రావం కూడా సంభవిస్తుంది.

గర్భాశయ కణితులకి చేసే చికిత్స సాధారణంగా మీయొక్క వయసు, పూర్తి ఆరోగ్యం, కణితి యొక్క పరిమాణం మరియు అది వున్న ప్రదేశాన్ని బట్టి రూపొందించబడుతుంది. దీనికి సంబంధించిన చికిత్సలు అందుబాటులో వున్నాయి. అవి మీయొక్క ఈస్ట్రోజన్ మరియు ప్రొజెస్టెరాన్‌ యొక్క స్థాయిలు పడిపోయేలా చేసి మీయొక్క హార్మోన్ స్థాయిలను నియంత్రిస్తాయి. ఆ విధంగా అవి నెలసరిని ఆపి కణితులు కుంచించుకు పోయేలా చేస్తాయి.

మయోమెక్టమీ (కణితుల తొలగింపు) అనేది ఒక రకమైన శస్త్రచికిత్స విధానం. ఇందులో గర్భాశయంలోకి ప్రవేశించి కణితులను తొలగించడానికి పొత్తికడుపు మీద ఒక పెద్ద కోత చేయవలసి వుంటుంది. లాపరోస్కోపిక్ విధానం ద్వారా, చిన్న చిన్న కోతలు చేసి వాటిల్లోకి శస్త్రచికిత్సా పరికరాలు మరియు కెమెరా కూడా చొప్పించడం జరుగుతుంది. అయినప్పటికీ శస్త్రచికిత్స తరువాత ఆ కణితులు మళ్ళీ పెరిగే అవకాశం ఉండొచ్చు.

హిస్టరెక్టమీ (గర్భాశయం తొలగింపు) అనేది చివరి మార్గం. ఈ విధానంలో శస్త్రచికిత్స ద్వారా గర్భాశయాన్ని తొలగించడం జరుగుతుంది. అంతేకాకుండా, దీని వలన భవిష్యత్తులో మీరు పిల్లల్ని కనే అవకాశాన్ని కోల్పోతారు.

గర్భాశయ కణితుల ఎంబోలైజేషన్ (Uterine Fibroid Embolization or UFE) అనే తక్కువ కోతతో కూడిన వైద్య విధానం ఇటివలే ప్రజాదరణ పొందింది. ఈ విధానంలో ప్రభావిత ప్రదేశానికి కొన్ని ధమనుల ద్వారా రక్తం సరఫరా కాకుండా నివారించి తద్వారా కణితులు పెరగడానికి అవసరమయ్యే రక్తాన్ని వాటికి అందకుండా చేయడం జరుగుతుంది. ఆ విధంగా రక్త ప్రసరణ నిలిచిపోయినపుడు, ఆ కణితుల గడ్డలు గాయపు మచ్చలాంటి కణజాలంగా మారుతూ చనిపోతాయి. అంతేకాకుండా ఆ కణితులు తరువాత చిన్నగా కుంచించుకొని పోతాయి. 

యు.ఎఫ్.ఇని ఎలా నిర్వహించడం జరుగుతుంది?

కేంద్రీకృత మత్తు మందుని రోగికి ఇవ్వడం జరుగుతుంది. ఆ తరువాత ఒక ఇంటర్వెన్షనల్‌ రేడియోలజిస్ట్ పొత్తికడుపుకి క్రింది భాగంలో ఒక చిన్న కోత చేస్తాడు. ఎక్స్-రే సహాయం తీసుకుంటూ మరియు వ్యత్యాసం తెలిపే పదార్థం కలిగివున్న ఇంజక్షన్లను సమయానికి అనుగుణంగా ఇస్తూ, క్యాథటర్ అని పిలవబడే ఒక ట్యూబుని లోనికి చొప్పించడం జరుగుతుంది. ఆ యొక్క క్యాథటర్‌ని కణితి యొక్క రక్త సరఫరా వైపు తీసుకెళ్ళి అక్కడ చిన్న చిన్న రేణువులని విడుదల చేయడం జరుగుతుంది. ఈ ఎంబాలిక్ ఏజెంట్లు క్రిందికి తేలుతూ కణితికి పోషకాలు అందకుండా చేసేలా చిన్న రక్త నాళాలను మూసివేస్తాయి. ఒకసారి రక్త ప్రసరణని అందించే ఈ ధమనులు మూసుకుపోతే కణితులు మెత్తబడటం, తక్కువ రక్తస్రావం కావడం, మరియు ముడుచుకోవడం మొదలవుతుంది.

ఈ ప్రక్రియ సమయంలో మీరు ఏమి అనుభూతి చెందుతారు?

ఐ.వి లైన్ కోసం సూదిని మీయొక్క నరంలోనికి గుచ్చినపుడు మరియు కేంద్రీకృత మత్తుమందుని ఇచ్చినపుడు, చిన్నగా గుచ్చినట్టుగా మీకు వుంటుంది. కేంద్రీకృత మత్తుమందుని ఇవ్వడం ద్వారా కోతకి గురయ్యే ప్రాంతం మొద్దుబారడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ, ఇంతకి మించి పెద్దగా ఎటువంటి అసౌకర్యం వుండదు.

మీకు మత్తుమందుని ఏ స్థాయిలో ఇచ్చారో అనేదాన్ని బట్టి, మీరు మెలకువగా ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు. క్యాథటర్‌ని మీయొక్క నరం లేదా ధమనిలోనికి చొప్పించినపుడు మీకు కొంచెం ఒత్తిడిగా అనిపిస్తుంది. వ్యత్యాసాన్ని తెలిపే పదార్థం మీయొక్క శరీరంలోనికి వెళ్ళినపుడు, మీకు వేడిగా అనిపిస్తుంది. కాని ఇది త్వరగానే ముగుస్తుంది. మీయొక్క కోలుకునే స్థాయిని బట్టి, మీరు ఎప్పుడు ఇంటికి తిరిగి వెళ్ళగలరో అనే విషయాన్ని మీయొక్క వైద్యులు మీకు తెలియజేస్తారు. సాధారణంగా ఈ ప్రక్రియ జరిగిన రోజునే లేదా ఆ తరువాతి రోజునే ఇంటికి పంపిస్తారు. యు.ఎఫ్.వి నిర్వహించిన ఒకటి లేదా రెండు వారాల తరువాత, మందుల సహాయంతో మీరు మీయొక్క మామూలు కార్యకలాపాలని తిరిగి చేయగలుగుతారు.

రెండు మూడు వారాలలో లక్షణాలకి సంబంధించిన ఉపశమనాన్ని గుర్తించడం జరుగుతుంది. అంతేకాకుండా, కొన్ని నెలల వ్యవధిలో కణితులు మూడుచుకుపోయి మెత్తబడిపోతాయి. ఆరు నెలల వరకు, ఈ మొత్తం ప్రక్రియ ముగుస్తుంది. అంతేకాకుండా ఈయొక్క లక్షణాలు తగ్గి పరిస్థితి స్థిరంగా మారుతుంది. దాదాపు 90 శాతం కంటే ఎక్కువ మంది స్త్రీలు గణనీయంగా కోలుకొని వారి యొక్క వ్యాధి లక్షణాల నుండి ఉపశమనం పొందుతారు.

యు.ఎఫ్.ఇ విధానం యొక్క మరిన్ని ప్రయోజనాలు తెలుసుకోవడానికి, ఈరోజే ఎవిస్ వాస్కూలర్ సెంటర్‌కి కాల్ చేసి మీ వైద్యుని యొక్క అపాయింట్‌మెంట్‌ని బుక్ చేసుకోండి.

Varicose Veins Treatment in Hyderabad |Visakhapatnam | Vijayawada Tirupati Rajahmundry

For Appointment Call : 9989527715