Book Appointment
X

Choose location for Appointment


కాలి నొప్పిని కలిగించే నరాల సమస్యలు

varicose veins

మీకు కాలు నొప్పి సమస్య తలెత్తినపుడు, అది రక్త నాళాలకి సంబంధించిన సమస్య అయివుంటుందని మీలో కొంత మంది మాత్రమే అనుకుంటారు. కాళ్ళలో మామూలుగా అరుగుదలలు, తరుగుదలలు, తిమ్మిరి, గాయం, లేదా అతిగా కాళ్ళని ఉపయోగించడం మరియు శ్రమ పెట్టడం లాంటివే ఈ సమస్యకి కారణమని మనం సాధారణంగా భావిస్తాము. కాని, ఉనికిలో వున్న వేరికోస్ వేయిన్స్ కారణంగా లేదా ఇంకా విపరీతమైన నరాల సమస్యల వలన ఈ సమస్య సంభవించే అవకాశం ఎక్కువగా వుంటుంది.

ఎవీస్ సెంటర్లోని మాయొక్క నిపుణులు ఎండోవీనస్‌ అబ్లేషన్, మరియు స్క్లెరోథెరపీ లాంటి అధునాతన ప్రక్రియల ద్వారా నరాల సంబంధిత నొప్పిని తగ్గించడంలో నైపుణ్యం గడించారు. ఈయొక్క చికిత్సా ప్రక్రియలు కొద్ది గంటలలోనే నొప్పి నుండి ఉపశమనాన్ని ఇస్తాయని చెబుతున్నారు.

నరాల సమస్యలు ఏ విధంగా కాలు నొప్పిని కలిస్తాయి?

దీర్ఘకాలిక నరాల అసమర్థత

కాలిలోని నరాలు రక్తాన్ని తిరిగి గుండె వైపుకి తోస్తాయి. పిక్కల కండరాలు, మరియు పాదాలు నరాలని పిండటం ద్వారా ఈయొక్క ప్రక్రియకి మరింత సాయం చేస్తాయి. ఈయొక్క నాళాలలోని కవాటాలలో లోపంతో గనుక వుంటే, రక్తం ఇక పైకి కదలలేదు. ఇలా సంభవించినపుడు, రక్తం వెనుకకి ప్రవహించడం ప్రారంభమయి అది దెబ్బతిన్న కవాటానికి మరియు నరంలోని తరువాతి ఆరోగ్యకరమైన కవాటానికి మధ్యలో పోగవుతుంది.

ఇలా పోగయిన రక్తం నరం యొక్క గోడని సాగదీసి ఆరోగ్యంగా వున్న కవాటాన్ని లాగుతుంది, తద్వారా అది దాని వైఫల్యానికి దారితీస్తుంది. ఈయొక్క రక్తం పోగవడం అనేది మంటతో కూడిన వాపుకి మరియు కాలినొప్పికి దారితీస్తుంది. దీర్ఘకాలిక నరాల సమస్యగా పిలవబడే ఈయొక్క పరిస్థితి తీవ్రమైన ఆరోగ్య సమస్య కానప్పటికీ ఇది మనలని బలహీనంగా మార్చేయవచ్చు. ఈయొక్క పరిస్థితి పెరిగినాకొద్దీ, మీయొక్క చీలమండల్లో లేదా కాళ్ళలో వాపు రావడాన్ని మీరు గమనిస్తారు. అంతేకాకుండా, నడిచే సమయంలో నొప్పిని మీరు గమనిస్తారు. కాని మీరు విశ్రాంతి తీసుకున్నపుడు మాత్రం కొంత ఉపశమనంగా అనిపిస్తుంది.

వేరికోస్ వేయిన్స్

వేరికోస్ వేయిన్స్ అనేది దీర్ఘకాలిక నరాల అసమర్థత యొక్క పరిణామం. రక్తం పోగవడం ప్రారంభమైనకొద్దీ, నరం లేదా నాళం అనేది మెలితిరిగి సాగిపోయి చివరికి వేరికోస్‌గా మారుతుంది. ఈ నరాలు ముదురు నీలిరంగులో మారడం మొదలయి, చర్మం ఉపరితలం మీద ఉబ్బుగా బయటకి వచ్చి కనిపిస్తూ, వికారంగా కనిపిస్తాయి. లక్షణాలు కలిగిన వేరికోస్ వేయిన్స్ అనేవి ఒక మోస్తరు స్థాయి నుండి తీవ్రమైన స్థాయి వరకూ కాలినొప్పిని కలిగిస్తాయి.

నరాల సంబంధిత కాలినొప్పి నుండి నేను ఎలా ఉపశమనం పొందాలి?

ఎండోవీనస్‌ అబ్లేషన్ పద్ధతి

సమస్య యొక్క మూలాన్ని నిర్మూలించడం ద్వారా నొప్పి నుండి ఉపశమనాన్ని అందించగలిగే పద్ధతినే అబ్లేషన్ పద్ధతి అంటారు. వేరికోస్ వేయిన్స్‌కి దారితీసే అసహజమైన నరాలని రేడియోఫ్రీక్వన్సీ లేదా లేజర్ శక్తిని ఉపయోగించి కాల్చివేసే ఒక తక్కువ కోతతో కూడిన చికిత్సా ప్రక్రియ ఇది.

స్క్లెరోథెరపీ

స్క్లెరోథెరపీ అనేది వేరికోస్ వేయిన్స్‌కి మరియు చర్మం ఉపరితలం క్రిందనే చిన్నగా సన్నగా వుండే నరాలైనటువంటి స్పైడర్ వేయిన్స్‌కి చేసే ఒక తక్కువ కోతతో కూడిన చికిత్స ఇది. స్క్లెరోసెంట్ అనే పదార్థాన్ని ప్రవేశపెట్టడం ద్వారా నరాల సమస్యలకి త్వరిత ఉపశమనం ఇవ్వడం జరుగుతుంది. ఈ పదార్థం దెబ్బతిన్న నరాల అంతర్గత హద్దుని నశింపజేసి వాటిని పూర్తిగా మూసేస్తుంది. ఈ విధంగా మూల సమస్యకి పరిష్కారం చూపడం కారణంగా కొత్తగా అభివృద్ధి చెందే నరాలనేవీ ఎటువంటి సమస్య లేకుండా వుంటాయి.

నరాల సమస్యలని ముందుగానే కనిపెట్టి చికిత్స చేయడం వలన కలిగే ప్రయోజనాలు.

దెబ్బతిన్న నరాలని సకాలంలోనే కనిపెట్టి వాటికి చికిత్స చేయడం చాలా ముఖ్యం. చికిత్స చేయని నరాలు రక్త ప్రవాహాన్ని నెమ్మది చేసి మీయొక్క నాళాలలో ఒత్తిడిని పెంచవచ్చు. ఈ పరిస్థితి గనుక ఎక్కువ కాలం వరకూ ఇలాగే కొనసాగితే, ద్రవాలన్నీ సూక్ష్మ నాళాల్లోంచి బయటకి వచ్చే పరిస్థితికి దారితీస్తుంది. చుట్టూ వున్న ప్రదేశాల్లోకి గనుక ఈయొక్క ద్రవాలు చొచ్చుకుపోతే, అది చర్మంపై మంటతో కూడిన వాపుకి దారితీసి, స్టేసిస్ డెర్మాటిటిస్‌ అనే పరిస్థితికి దారితీస్తుంది.

నరాల అల్సర్ అనేది మరొక తీవ్రమైన పరిస్థితి. సరైన విధంగా లేని రక్త ప్రవాహం మీయొక్క చర్మం పైన మితిమీరిన ఒత్తిడిని పెట్టి, అది కణజాలాలు విరిగిపోవడానికి దారితీసి, ఆ కణజాలాలు తరువాత పుళ్ళుగా మారినపుడు ఈయొక్క అల్సర్ అనే పరిస్థితి ఏర్పడుతుంది. నరాల అల్సర్లు సాధారణంగా మోకాలి క్రింద మరియు చీలమండ క్రింది భాగంలో కనిపిస్తాయి.

దెబ్బతిన్న నరాల వలన తీవ్రమైన క్లిష్టతలు తలెత్తకుండా వుండటానికి ఎప్పటికప్పుడు నరాలకి స్కానింగ్ పరీక్షలు నిర్వహించడం ప్రధానమైనది. నరాల చికిత్సల గురించి మరింత తెలుసుకోవడానికి మరియు మీరు ఈ చికిత్సలకి తగిన వ్యక్తి అవునో కాదో తెలుసుకోవడానికి, ఎవీస్ వాస్కులర్ సెంటర్లోని వైద్య నిపుణులతో మాట్లాడండి.

Varicose Veins Treatment In Hyderabad | Bengaluru |Mysore Visakhapatnam | Vijayawada Chennai |Coimbatore Tirupati | Rajahmundry Kolkata | Madurai | Pondicherry | Delhi|

For Appointment Call

Telangana: 9989527715

Andhra Pradesh: 9989527715

Tamilnadu: 7847045678

Karnataka: 8088837000

Kolkata: 9154089451

Delhi : 9701688544

Branches

Home
Services
Doctors
Branches
Blog