మాన‌వ శ‌రీరంలోని కాళ్ల‌పై చ‌ర్మం, సిర‌ల‌పై ఏర్ప‌డిన నిర్ధిష్ట ర‌కాల పుండ్లు కార‌ణంగా నాశ‌నమ‌వుతుంది. ప్రాధ‌మికంగా కాళ్ల‌పై ఓ గాయంలా తొలుత ఏర్ప‌డుతుంది. తిరిగి ఇది మాన‌డానికి చాలా కాలం ప‌డుతుంది. కేవ‌లం బ‌ల‌హీన‌మైన ర‌క్త ప్ర‌స‌ర‌ణ కార‌ణంగా ప్ర‌ధానంగా కాళ్ల‌పై అనారోగ్య సిర‌లు ఏర్ప‌డ‌తాయి.  న‌రాల‌లో బ‌ల‌హీన‌మైన క‌వాటాల వ‌ల్ల కాళ్ల‌నుంచి పైకి ప్ర‌వ‌హించే ర‌క్తం ఒక‌చోట నిలిచిపోయి అక్క‌డే కొల‌నులా విస్త‌రిస్తుంది. ఇలా ఒక‌చోట ర‌క్తం ఉండిపోవ‌డాన్ని కాళ్ల‌లో న‌రాల వాపు వ్యాధిగా గుర్తించ‌వ‌చ్చు!
కాళ్ల‌పై సిర‌ల పుండ్లు:- కాళ్లలో ఒక‌చోట గ‌డ్డ‌లా ఉండిపోయే ర‌క్తం కార‌ణంగా చ‌ర్మం చిట్లిపోతుంది. కాళ్ల‌లో న‌రాల వాపు వ్యాధి కార‌ణంగా చ‌ర్మం గ‌ట్టిప‌డిపోతుంది. ఫ‌లితంగా పుండు ఏర్ప‌డ‌డం లేదా చ‌ర్మం విడిపోవ‌డం లేదా గోకుడు వ‌ల్ల పాడ‌వ‌డం జ‌రుగుతుంది. ఇలాంటి ప్ర‌క్రియ వ‌ల్ల త‌ర్వాతికాలంలో ఇది న‌యం కావ‌డానికి చాలా స‌మ‌యం ప‌డుతుంది. సాధార‌ణంగా ఇలాంటివి చీల‌మండ ప్రాంతంలో ఏర్ప‌డ‌తాయి. కాళ్ల‌పై సిర‌ల పుండు వ‌ల్ల మంట‌, దుర‌ద ఇబ్బంది పెడ‌తాయి. అంతేగాక ఈ ప్రాంతాల్లో విస్తరించి ప్ర‌భావాన్ని చూపిస్తాయి. వీటితో దిగువ పేర్కొన్న సూచిక‌లు కూడా క‌నిపిస్తాయి.
*చ‌ర్మం గోధుమ రంగులా మారడం.
*ద‌ద్దుర్ల‌తో చ‌ర్మం పొడిబారడం.
*పుండు నుంచి దుర్వాస‌న‌తో కూడిన చీము కార‌డం.
*పుండు మ‌రింత దారుణంగా త‌యార‌వ‌డాన్ని కూడా గ‌మ‌నించ‌వ‌చ్చు.
*తీవ్ర‌మైన నొప్పి
*జ్వ‌రం
*చ‌ర్మం ఎర్ర‌రంగులోకి మార‌డం లేదా ఆ ప్రాంతం వాచిపోవ‌డం
*చీము కార‌డం
అత్యంత సాధార‌ణంగా  ఇలాంటివి సంభ‌వించ‌డానికి ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ స‌రైన విధంగా లేక‌పోవ‌డ‌మే ప్ర‌ధాన కార‌ణంగా గుర్తించాలి
కాళ్ల‌పై సిర‌ల పుండ్లు ఏర్పడ‌డానికి రెండు ప్ర‌త్యేక ద‌శ‌లు కార‌ణం..
తీవ్ర‌మైన‌/  దీర్ఘ‌కాలిక‌మైన ద‌శ‌:- తీవ్ర‌మైన పుండ్లు త‌గ్గ‌డానికి క‌నీసం నెల‌రోజులు ప‌డుతుంది. ఆ ప్రాంతంలో శ‌స్త్ర‌చికిత్స‌, అంటురోగ సంక్ర‌మ‌ణ‌ల వ‌ల్ల బాధాక‌ర‌మైన గాయాలు త‌ప్ప‌వు. దీంతో మ‌రోవైపు సాధార‌ణంగా దీర్ఘ‌కాలిక పుండ్లు సంవ‌త్స‌రాల త‌ర‌బ‌డి త‌గ్గే అవ‌కాశం ఉండ‌దు. కాళ్ల‌పై ఏర్ప‌డే పుండ్లకు బూట్లు,ముఖ్యంగా గాలిత‌గ‌ల‌ని విధంగా గ‌ట్టిగా బిగించి ఉండ‌డం వ‌ల్ల కాలిపై వ‌త్తిడిభారం అధిక‌మై గాయం మ‌రింత పెరుగుతుంది.
చికిత్స‌:- వ్యాధి తీవ్ర‌త‌, పుండ్లు విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా గ‌మ‌నించి అంచ‌నా వేసి చికిత్స‌ను అందించాలి. శ‌స్త్ర చికిత్స‌, ఎండోవాస్క్యుల‌ర్ లేజ‌ర్ కిర‌ణాల చికిత్స‌, అల్ట్రాసౌండ్ ద్వారా స్క్లేరో ధెర‌పీ వంటి చికిత్సల‌తో ఉప‌రిత‌ల సిర‌లు, ధ‌మ‌నుల‌కు ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. అందువ‌ల్ల సిర‌ల‌కు సంబంధించిన వ్యాధి విష‌యంలో స‌రైన ఇంట‌ర్వెన్ష‌న‌ల్ రేడియోల‌జిస్ట్ నుంచి స‌ల‌హాలు, మార్గ‌ద‌ర్శ‌క‌త్వాన్ని పొందాలి.
భార‌తదేశంలోని హైద‌రాబాద్‌లోగ‌ల * ఎవిస్ వాస్క్యుల‌ర్ సెంట‌ర్‌* ఓ ప్ర‌ఖ్యాత వైద్య కేంద్రంగా గుర్తింపు పొందింది. న‌రాల వాపు వ్యాధి చికిత్స విషయంలో ప్ర‌ఖ్యాత వైద్యులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారు. ఆసుప‌త్రిలో చేరే రోగుల‌కు, అవుట్ పేషెంట్ల‌కు ఉప‌యుక్త‌మైన చికిత్స అందించి వారి ఉత్త‌మ ఆరోగ్యానికి బాటలు వేస్తుంటారు. ఇక్క‌డ  డాక్ట‌ర్ రాజా.వి.కొప్పాల భార‌త‌దేశంలోనే వాస్క్యుల‌ర్ చికిత్సా విభాగంలో ఉత్త‌మ ఇంట‌ర్వెన్ష‌న‌ల్ రేడియోల‌జిస్ట్‌గా నాణ్య‌త‌తో కూడిన చికిత్స‌ను అందిస్తున్నారు.  ఎవ‌రైనా సంప్ర‌దించి చికిత్స పొంద‌వ‌చ్చు. ఆరోగ్య‌మ‌స్తు!