మాన‌వ జీవితంలో 50 ఏళ్ల వ‌య‌సు దాటిన వారికి ముఖ్యంగా మ‌హిళ‌ల‌కు ఈ కాళ్ల‌లో న‌రాల వాపు వ్యాధి (వేరికోస్ వెయిన్స్‌) వ‌చ్చే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి. ఆందోళ‌న క‌లిగించే ఈ అంశంలో సిర‌లు మెలిప‌డ‌డం, వాచిపోవ‌డం జ‌రుగుతుంది. క‌వాటాలు స‌రిగా ప‌నిచేయ‌క ర‌క్త ప్ర‌స‌ర‌ణ‌కు అడ్డంకులు ఏర్ప‌డ‌డ‌మే దీనికి ప్ర‌ధాన కార‌ణం.
కాళ్లు, పాదాల వ‌ద్ద చ‌ర్మం కింద ఏర్ప‌డే సిర‌ల వాపు వ‌ల్ల ఆ ప్రాంతం నీలం లేదా ముదురు ఊదారంగు లోకి మారి స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. కొంత‌మందిలో ఎటువంటి సూచిక‌లు లేకుండానే ఈ న‌రాల వాపు వ‌చ్చే అవ‌కాశం ఉంది. కానీ ఇది తీవ్ర‌మైన నొప్పిని క‌లిగిస్తుంది. అంతేగాక చ‌ర్మాన్ని దెబ్బ‌తీయ‌డం, మ‌రికొంత‌మంది ర‌క్తం గ‌డ్డ‌క‌ట్ట‌డం ద్వారా ప్రాణానికే ముప్పు ఏర్ప‌డే ప‌రిస్ధితిని క‌ల్పిస్తుంది.

కొన్ని సంద‌ర్భాల‌లో జ‌న్యుప‌ర‌మైన కార‌ణాలు లేదా వ‌య‌స్సు మీద ప‌డ‌డం వ‌ల్ల సిర‌ల కవాటాలు తీవ్ర‌మైన వ‌త్తిడికి గుర‌వుతాయి. రుతుక్ర‌మం, లేదా గ‌ర్భం, అదేవిధంగా జీవ‌న‌శైలిలో లోపాల వ‌ల్ల ఈ కాళ్ల‌లో న‌రాల వాపు వ్యాధి వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయి. రోజువారీ జీవ‌న‌శైలిలో కొద్దిపాటు మార్పుల వ‌ల్ల ప్ర‌మాదాన్ని , ల‌క్ష‌ణాల‌ను త‌గ్గించ‌వ‌చ్చు.
అన్నిర‌కాల వ‌య‌స్సుల వారికి ఆరోగ్య‌క‌ర‌మైన సిర‌ల‌ను పొందేందుకు కొన్ని ర‌కాల సూచ‌న‌లు ఉన్నాయి.

1. బిగుతు దుస్తుల‌కు దూరం :- వ‌దులైన దుస్తులు ధ‌రించ‌డం వ‌ల్ల శ‌రీరానికి అనువుగా ఉండ‌డ‌మేగాక శ‌రీర క‌ద‌లిక‌, మీ న‌డుము, కాళ్లు, గ‌జ్జ‌ల చుట్టూ ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ బాగా జ‌రిగేలా చేస్తాయి. అంతేగాక శ‌రీరాన్ని ప‌ట్టిఉండే బిగుతైన జీన్స్‌, శ‌రీరాకృతి పెంచే దుస్తులు. బిగుతు బెల్టుల‌ను ధ‌రించ‌రాదు.

2. ఎత్తుమ‌డ‌మ‌ల జోళ్లు వ‌ద్ధు :- మీ పాదాల సౌక‌ర్యం కోసం త‌క్కువ మ‌డ‌మ ఎత్తుగ‌ల స‌మాంత‌రంగా ఉండే పాద‌ర‌క్ష‌ల‌ను ధ‌రించాలి. ఎత్తు మ‌డ‌మ‌ల జోళ్లు వ‌ల‌న భ‌విష్య‌త్తులో కాళ్లు,పాదాల‌కు ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ తగ్గి నొప్పి, ర‌క్తం గ‌డ్డ‌క‌ట్టే అవ‌కాశం క‌ల‌గ‌వ‌చ్చు.

3. స‌మ‌తుల ఆహారం, వ్యాయామం, ఊబ‌కాయం :- మంద‌కొడిత‌నం, అధిక బ‌రువు వ‌ల్ల సిర‌ల వాపున‌ల‌కు దారి చూపిన‌ట్లే! ఆహారంలో ఉప్పు, అధిక ల‌వ‌ణం గ‌ల ప‌దార్ధాల‌ను నియంత్రిస్తూ, ప్ర‌తిరోజు న‌డ‌క‌, జాగింగ్ వంటి వ్యాయామాల‌ను చేయ‌డం స‌ముచితం. దీనివ‌ల్ల మీ వంట్లో ర‌క్త ప్ర‌స‌ర‌ణ పెరుగుతుంది. అదేవిధంగా స్క్వాట్స్‌, సిట్ అప్స్‌. క్రంచ్‌ల వ‌ల్ల, ఊపిరితిత్తుల‌పై అద‌న‌పు వ‌త్తిడి వ‌ల్ల కాళ్ల‌లోని సిర‌ల‌పై ప్ర‌భావం ప‌డుతుంద‌న్న విష‌యాన్ని గ‌మ‌నించాలి.

4. కాళ్ల విష‌యంలో జాగ్ర‌త్త‌లు :- ఒకేసారి ఎక్కువ‌సేపు కూర్చోవ‌డం లేదా నిల‌బ‌డ‌డం చేయ‌రాదు. ఎప్ప‌టికప్పుడు మీరు కూర్చున్న విధానాన్ని మార్చ‌డం లేదా అర‌గంటకోసారి అలా తిర‌గ‌డం చేయాలి. అంతేగాక కాళ్ల‌ను అడ్డంగా మ‌డ‌త‌పెట్టి కూర్చోవ‌డం త‌గదు. మీరు కూర్చున్న లేదా కింద కూర్చున్నా, నిద్ర పోయినా మీ గుండె కంటే ఎక్కువ ఎత్తులో కాళ్లు ఉండేలా కాళ్ల కింద దిండును అమ‌ర్చుకోవాలి.

5. మేజోళ్లు మంచివే :- సాగే గుణం క‌లిగే ఎలాస్టిక్ సాక్స్ లేదా మేజోళ్లు ర‌క్తం గ‌డ్డ‌క‌ట్ట‌కుండా చేయ‌డ‌మేగాక ర‌క్త ప్ర‌స‌ర‌ణ స‌క్ర‌మంగా జ‌రిగేలా చేస్తూ నొప్పి , వాపుల‌ను త‌గ్గించేలా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఇవి రోజు వారీగా ఉప‌యోగించ‌డం మంచిదే. ముఖ్యంగా అధిక కాళ్ల నొప్పులు, ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ స‌రిగా లేన‌టువంటి రోగుల‌కు ఇవి మ‌రింత‌గా ఉప‌యుక్త‌మవుతాయి.

మీ జీవ‌న‌శైలిలో ఈ చిన్న చిన్న మార్పుల వ‌ల్ల మీ ఆరోగ్యంలో గ‌ణ‌నీయ‌మైన ప్ర‌గ‌తి క‌నిపిస్తుంది. అంతేగాక ప్ర‌మాదాల‌ను త‌గ్గిస్తుంది. అయిన‌ప్ప‌టికీ మీరు స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటే మీరు కాళ్ల‌లో న‌రాల వాపున‌కు త‌గు వైద్య‌సాయాన్ని పొందాల్సిందే!

ద‌క్షిణ భార‌త‌దేశంలో వాస్క్యుల‌ర్ స‌ర్జ‌న్‌గా ప్ర‌ఖ్యాతిగాంచిన డాక్ట‌ర్ రాజా.వి.కొప్పాల ప్ర‌స్తుతం హైద‌రాబాద్ జాబ్లీహిల్స్ లో గ‌ల ఎవిస్ హాస్పిట‌ల్స్‌లో వైద్య‌సేవ‌లు అందిస్తున్నారు. ఎంబిబిఎస్‌, ఎండీ – వాస్క్యుల‌ర్ ఇంట‌ర్వెన్ష‌న‌ల్ రేడియోల‌జీ, ఎండీ- రోగ‌నిర్ధార‌ణ‌, రేడియోల‌జీ వంటి విద్యార్హ‌త‌లు క‌లిగిన వైద్యులు. గ‌త 24 ఏళ్లుగా డాక్ట‌ర్ రాజా రేడియోల‌జిస్ట్‌గా విస్తృత వైద్య సేవ‌లు అందిస్తున్నారు. ఆయ‌న ఉత్త‌ర అమెరికా రేడియోల‌జికల్ సొసైటీ స‌భ్యులు. ఇవేగాక యూకే కి చెందిన రాయ‌ల్ కాలేజీ ఆఫ్ రేడియోల‌జిస్ట్స్‌,బ్రిటిస్ సొసైటీ ఆఫ్ ఇంట‌ర్వెన్ష‌న‌ల్ రేడియోల‌జీ
, సింగ‌పూర్ రేడియోల‌జిక‌ల్ సొసైటీలో స‌భ్యులు కూడా! మీ వైద్య సేవ‌ల‌పై చ‌ర్చ మ‌రియు విశ్లేష‌ణ కోసం డాక్ట‌ర్ రాజా గారి అప్పాయింట్‌మెంట్‌ను బుక్ చేసుకొండి. ఇది అతి త్వ‌ర‌లోనే మీ వ్యాధి త‌గ్గుముఖం ప‌ట్ట‌డానికి ఉప‌క‌రిస్తుంది.