కాళ్ళలో తీవ్రమైన బరువుతో కూడిన నొప్పి ఒక నరాల వ్యాధిని సూచించే లక్షణం అయి ఉండొచ్చు. ఈ దీర్ఘ కాలిక నొప్పి మీయొక్క రోజువారి పనులు చేసుకోకుండా మిమ్మల్ని బాధించడం మాత్రమే కాదు, ఇది ఎక్కువ శాతం రోగులని చికాకు, ఒత్తిడి మరియు కుంగుబాటుకి గురి చేస్తుంది. నరాల అసౌకర్యమనేది ఒక తీవ్రమైన వైద్య సమస్యను సూచించే ఒక లక్షణం, కాబట్టి దానికి తక్షణ వైద్య పరమైన శ్రద్ధ అత్యవసరం.

కాలు నొప్పికి గల కారణాలు.

కొన్ని కేసుల్లో కాలి నొప్పి నరాల పరిస్థితి మూలాన సంభవించదు కాని ఏదైనా గాయం లేదా ప్రమాదం ఒక బెణుకుకి దారి  తీయడం, లేదా వెన్నుముక నొప్పి కాలు మరియు పదాల్లోకి చేరడం వలన సంభవిస్తుంది. ఒక వేళ ఎటువంటి గాయం లేకుండానే మీరు నొప్పిని అనుభవిస్తుంటే మరియు కాలి నొప్పి కొన్ని రోజుల తరువాత కూడా తగ్గకుండా అలాగే వుంటే గనుక, మీరు ఖచ్చితంగా ఒక నాడీ నిపుణున్ని పర్యవేక్షించి చికిత్సకి ముందు ఖచ్చితమైన వ్యాధి నిర్థారణ కొరకు సరైన పరీక్షని చేయించుకోవాలి. 

శారీరక పరీక్ష మరియు సిఫారసు చేయబడిన కొన్ని అల్ట్రాసౌండ్ స్కాన్ల తరువాత మాత్రమే ఒక నాడీ సంబంధ నిపుణుడు మీయొక్క నరాల ఆరోగ్యం గురించి ప్రస్థావించి తగిన చికిత్సను సూచించడం జరుగుతుంది.

నరాల నొప్పిని ప్రేరేపించే సాధారణ కారకాలన్నింటిలో ఎక్కువ శాతం వేరికోస్ వేయిన్స్‌ మాత్రమే ప్రధాన కారకమని చెప్పవచ్చు. కాళ్ళు మరియు పాదాలలోని కొన్ని నాళాల యొక్క కవాటాలు అక్సీజనీకరణ చెందని రక్తాన్ని (చెడు రక్తం) తిరిగి గుండెకి చేర్చడంలో విఫలం కావడం వలన వేరికోస్ వేయిన్స్ సంభవిస్తాయి.

ఎక్కువ శాతం వేరికోస్ వేయిన్స్ అనేవి ప్రభావిత ప్రాంతంలో ఆకారాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేసినప్పటికీ, కొన్ని కేసుల్లో మాత్రం చర్మం యొక్క ఉపరితలం పైన ఎటువంటి స్పష్టమైన లక్షణాలు కనిపించవు. పెద్దవాళ్ళు మాత్రమే కాదు చిన్న వయస్కులు కూడా వేరికోస్ వెయిన్స్‌తో బాధపడుతున్నారని తెలుస్తోంది.

కాలం గడిచిన కొద్దీ, సరైన చికిత్సని తీసుకోకపోవడం లేదా చికిత్సని ఆలస్యం చేయడం వలన వేరికోస్ వేయిన్స్ ఇతర వ్యాధులకు దారి తీయవచ్చు మరియు అవి మరింత నొప్పి మరియు అసౌకర్యానికి కూడా దారి తీయవచ్చు. కాళ్ళలో వాపుని సూచించే లింఫడీమ మరియు కాళ్ళ ఉపరితలంలో రక్తపు గడ్డలు ఏర్పడటం వలన సంభవించే థ్రోంబోఫ్లబైటిస్‌ లాంటివి వేరికోస్ వేయిన్స్‌కి సరైన చికిత్స అందించకపోవడం వలన కలిగే అతి సామాన్యమైన దుష్ప్రభావాలు! వేరికోస్ వేయిన్స్ అనేవి అతి అత్యవసర పరిస్థితి లాంటి డి.వి.టికి (డీప్ వేయిన్ థ్రోంబోసిస్) కూడా దారి తీయవచ్చు.

వేరికోస్ వేయిన్స్ యొక్క లక్షణాలు

కాలు మరియు పాదాలలోని ప్రభావిత ప్రాంతాల్లో నొప్పి గమనించడమనేది వేరికోస్ వేయిన్స్‌ని గుర్తించడానికి ఒక సులభతరమైన మార్గం. కొందరు రోగులైతే ప్రభావిత ప్రాంతంలో బరువు మరియు అసౌకర్యంతో కూడిన దురదలాంటి పరిస్థితిని కూడా అనుభవిస్తారు.

కొందరు రోగులకి ఎటువంటి స్పష్టమైన లక్షణాలు కనిపించకపోవచ్చు. కాని ఈ క్రింది లక్షణాలు మీరు వేరికోస్ వేయిన్స్‌ వ్యాధిని నిర్ధారించడానికి ఉపయోగపడతాయి:

  • చర్మపు రంగు మారడం.
  • కాళ్ళలో జివ్వుమంటున్నట్టుగా లేదా మండుతున్నట్టుగా అనిపించడం.
  • ప్రభావిత ప్రాంతంలో బరువుగా అనిపించడం.
  • ప్రభావిత ప్రాంతంలో చికాకుగా మరియు దురదగా అనిపించడం.
  • కాళ్ళలో మరియు పాదాల్లో తీవ్రమైన నొప్పి వుండటం.
  • ఎక్కువ శాతం వేడి రోజుల్లో, అది కూడా సాయంత్రం మరియు రాత్రి సమయాల్లో వాపు రావడం.
  • కండరం పట్టేసినట్లుగా దీర్ఘకాలిక నొప్పి వుండటం.

వేరికోస్ వేయిన్స్‌కి చికిత్సా విధానం

మీరు వికృతంగా కనిపిస్తున్న వేరికోస్ వేయిన్స్‌ని తొలగించుకోవడానికి చికిత్సా మార్గాలని వెతుకుతున్నా లేదా కాళ్ళ మరియు పదాల నొప్పుల నుండి త్వరిత ఉపశమనం కొరకు ప్రయత్నిస్తున్నా, మీయొక్క వైద్య

పరిస్థితిని అనుసరించి వివిధ రకాల చికిత్సా పద్ధతులలో ఒక దానిని వైద్యులు ఎంచుకుంటారు:

పీడనంతో కూడిన సాక్సులు: సహయక లేదా పీడనంతో కూడిన సాక్సులని వాడటమనేది ప్రధానమైన చికిత్సా మార్గంగా చెప్పవచ్చు. ఇవి చీలమండ దగ్గర బిగుతుగా వుంది తొడల చుట్టూ మాత్రం వదులుగా వుంటాయి. వివిధ రకాల సైజుల్లో ఇవి లభిస్తాయి కాబట్టి మీరు కొనుగోలు చేసేముందు మీకు సరిపోయే సైజుని ఎంచుకోవడానికి వైద్యున్ని సంప్రదించాలి. ఇది శాశ్వత పరిష్కారం కానప్పటికీ కూడా నొప్పి మరియు దురద నుండి త్వరిత ఉపశమనాన్ని ఇవి కలిగిస్తాయి.

స్క్లేరోథెరపి: ప్రభావానికి గురైన నాళాల్లోకి ఒక ప్రకోపం కలిగించే మందుని పంపించడం ద్వారా చిన్న చిన్న వేరికోస్ వేయిన్స్‌కి చికిత్స అందించవచ్చు. ఈ పద్ధతి మంటను కలిగించి వేరికోస్ వేయిన్స్ కుచించుకు పోయేలా చేసి తద్వారా వాటిని రక్త ప్రసారణ వ్యవస్థ నుండి విడదీస్తుంది.

తొలగించడం: ఎండోవీనస్‌ లేజర్‌ చికిత్స అనేది కోత రహిత, మచ్చ రహిత మరియు కుట్టు రహిత పద్ధతి. ఇందులో లేజర్ తంతువుని ఉపయోగించడం ద్వారా వేరికోస్ వేయిన్స్‌ని పూర్తిగా మూసి వేస్తారు.

అవీస్ హాస్పిటల్స్‌లో ఈరోజే మీ అపాయింట్‌మెంట్‌ని బుక్ చేసుకోండి.

దీర్ఘకాలిక నొప్పి మిమ్మల్ని దేని మీదా ద్యాస నిలవనీయకుండా ఒక దిగులుకు గురి చేస్తుంది. అంతేకాకుండా, మీరు నిలుచోకుండా లేదా ఎక్కువ దూరాన్ని సునాయాసంగా నడవలేకుండా చేసేస్తుంది. త్వరిత ఉపశమనానికి, త్వరగా కోలుకోవడానికి అవీస్ హాస్పిటల్స్‌లోని ప్రముఖ వాస్కులర్ నిపుణుల యొక్క అపాయింట్‌మెంట్‌ని ఖరారు చేసుకోవడం మీకు అత్యంత అవసరం.

మీయొక్క వేరికోస్ వేయిన్స్ చికిత్సకి తక్కువ కోతతో కూడిన మార్గాన్ని మీరు అన్వేషిస్తూ వుంటే గనుక, హైదరబాద్‌లోనే ప్రసిద్ధ వైద్య సంస్థ అయినటువంటి అవీస్ హాస్పిటల్స్‌ని తప్ప మరేదాన్ని విశ్వశించకండి.

వేరికోస్ వేరికోస్ వేయిన్స్‌ని ఖచ్చితంగా గుర్తించి ప్రభావిత ప్రాంతానికి చికిత్స చేయడానికి అనుభవజ్ఞులైన వైద్యులు వెయిన్ మ్యాపింగ్ మరియు ప్రభావవంతమైన రోగ నిర్ధారణా పద్ధతులను అవలంభిస్తారు.

అవీస్ హాస్పిటల్స్‌లోని నాడీ నిపుణులు గొప్ప నిపుణులు మరియు వారు మీయొక్క శ్రేయస్సుపై పూర్తి శ్రద్ధ వహించే విధంగా వుంటారు. మూలాధారమైన నరాల సమస్యలను పరీక్షించి వాటికి ప్రభావవంతంగా చికిత్స చేయడం ద్వారా మీరు నరాల నొప్పిని అధిగమించేలా మీకు సహాయపడతారు. మీరు మీ జీవితంలో అనుకూల మార్పులు చవిచూస్తారు. అంతేకాకుండా కాళ్ళు, పాదాల్లో ఎటువంటి నొప్పి, వాపు లేకుండా నడవడం చూసుకొని మీరు ఆనందిస్తారు.

సందేహాలు మరియు చికిత్సల కొరకు, ఈరోజే అవీస్ హాస్పిటల్స్‌లో ఒక వైద్య పరీక్షని ఖరారు చేసుకోండి!