ఎవిస్ ఆసుప‌త్రిలో ఎన్నో విశేషాలు !
 
హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని ఎవిస్ హాస్పిట‌ల్స్ ఇంటర్వెన్ష‌న‌ల్ చికిత్సా విధానంలో కాళ్ళ‌లో న‌రాల వాపు (వేరికోస్ వెయిన్స్‌) డీప్ వెయిన్ త్రాంబోస్ ( డివీటీ), గ‌ర్భాశ‌య క‌ణితులు త‌దిత‌రాలకు స‌మ‌గ్ర వైద్య‌సేవ‌ల‌ను అందించే విధంగా ఏర్పాటు చేయ‌బ‌డింది.
అత్యాధునిక వైద్య ప‌రిక‌రాల‌ను క‌లిగిన ఈ 50 ప‌డ‌క‌ల ఎవిస్ హాస్పిట‌ల్స్  అత్యంత ఔష‌ధ సాంకేతిక ప‌రిజ్ఞానం క‌లిగిఉంది.
 
ఎవిస్ హాస్పిట‌ల్స్  వేరికోస్ వెయిన్స్‌కు సంబంధించిన కాలిలో పుండ్లు, దీర్ఘ‌కాలిక అనారోగ్య సిర‌ల వైద్యంలో , నిర్ధార‌ణ‌, చికిత్సలో అసాధార‌ణ నైపుణ్యాన్నిసొంతం చేసుకుంది.
అంత‌ర్జాతీయంగా అర్హ‌త‌, అత్యంత అనుభ‌వం క‌లిగిన డాక్ట‌ర్ల కార‌ణంగా ఎవిస్ హాస్పిట‌ల్స్ గ‌త ఏడాది సుమారు 4000 మందికి పైగా పేషెంట్ల‌కు విజ‌య‌వంతంగా సేవ‌లందించి గుర్తింపు పొందింది.
 
ఎవిస్ హాస్పిట‌ల్స్ నిరంతరంగా అసాధార‌ణ వైద్య సాయం, అత్యున్న‌త ప్ర‌మాణాలు పాటిస్తూ పేషెంట్ల విష‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకుంటుంది. వారి వ్యాధి న‌య‌మయ్యేలా చేయ‌డ‌మేగాక‌, నిజంగా వాస్క్యుల‌ర్ పేషెంట్ భ‌రించ‌గ‌లిగే  ఖ‌ర్చుతో  ఉన్న‌త ఆరోగ్య సేవ‌ల‌ను అందిస్తోంది.
ఎవిస్ హాస్పిట‌ల్స్ కు అన్ని ప్ర‌ముఖ బీమా సంస్ధ‌ల‌తో అనుబంధం, వారి స‌మ్మ‌తిని క‌లిగిఉంది.  అంతేగాక రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు ఆరోగ్య ఖ‌ర్చును తిరిగి చెల్లించే అన్ని  ఆరోగ్య ప‌ధ‌కాల జాబితాలో ఈ ఆసుప‌త్రి చేర్చ‌బ‌డింది.
 
ఇత‌ర ప్రాంతాల నుంచి వ‌చ్చే పేషెంట్ల‌కు ఆరోగ్య స‌దుపాయాల‌ను క‌ల్పిస్తూ, వారికి వ‌స‌తి, ప్ర‌యాణ సౌక‌ర్యాల విష‌యంలో నిబ‌ద్ధ‌త‌తో ప‌నిచేసే ప్ర‌త్యేక బృందం ఇక్క‌డ ఉంది.
ఎవిస్ హాస్పిట‌ల్స్ ఇప్ప‌టికే ప్ర‌పంచంలో ప‌లు ప్రాంతాల వారికి వైద్య‌సేవ‌లు అందిస్తోంది.ముఖ్యంగా మ‌ధ్య‌ప్రాచ్య‌, ఆఫ్రికా ప్రాంతాల పేషెంట్ల‌కు వైద్య‌సేవ‌లు అందుతున్నాయి.
 
ఎవిస్ హాస్పిట‌ల్స్  లేజ‌ర్ చికిత్సా విధానంలో ప్ర‌త్యేక‌త క‌లిగి నొప్పిలేని, హానికరం కాని వివిధ ర‌కాల ఆరోగ్య‌సేవ‌ల‌ను ప‌రిష్క‌రిస్తుంది. కుట్లు, కోత‌లు లేని అధునాత‌న ప్ర‌క్రియ వ‌ల్ల పెద్ద‌పెద్ద కోత‌ల అవ‌స‌ర‌మే క‌ల‌గ‌దు. పేషెంట్ల చ‌ర్మంపై ఎటువంటి కుట్లు అవ‌స‌రం లేనందున స‌ర్జ‌రీ జ‌రిగిన‌ట్లు చ‌ర్మంపై ఎక్క‌డా క‌నిపించ‌దు. ఇది అత్యంత వేగ‌వంత‌మైన‌, సుర‌క్షిత‌మైన విధాన‌మైనందున ఎటువంటి దుష్ప్ర‌భావాలు ఉండ‌వు. స‌ర్జ‌రీ జ‌రిగిన రోజునే పేషెంట్ ఇంటికి ఆరోగ్యంగా వెళ్లిపోవ‌డ‌మేగాక య‌ధావిధిగా దైనందిన కార్య‌క్ర‌మాలు చేసుకోవ‌చ్చు.
 
ఎవిస్ హాస్పిట‌ల్స్  లో లేజ‌ర్ చికిత్స‌కు సంబంధించి ఒక నియంత్రిత మ‌రియు వైద్య వృత్తిప‌ర‌మైన వాతావ‌ర‌ణాన్ని అమ‌లుచేస్తుంది. పేషెంట్ల‌కు  ఈ చికిత్సా విధానం గురించి సంపూర్ణంగా వివ‌రించ‌డ‌మేగాక అత‌నికి అనారోగ్యం నుంచి కోలుకోవ‌డం గురించి న‌మ్మ‌కం క‌లిగించేలా సుఖ‌వంతంగా ఉండేలా చ‌ర్య‌లు చేప‌ట్ట‌బ‌డ‌తాయి.
 
డాక్ట‌ర్ రాజా.వి. కొప్పాల గారు ఎవిస్ హాస్పిట‌ల్స్  వాస్క్యుల‌ర్ విభాగానికి అధిప‌తి. వాస్క్యుల‌ర్ రుగ్మ‌త నివార‌ణ‌లో సుమారు రెండు ద‌శాబ్ధాల అనుభ‌శీలి. వాస్క్యుల‌ర్ ఇంట‌ర్వెన్ష‌న‌ల్ రేడియోల‌జీలో ఎమ్‌డి ప‌ట్టాక‌లిగిన  ఆయ‌న ప్ర‌త్యేక శిక్ష‌ణ పొందిన స‌ర్జ‌న్ కూడా! డాక్ట‌ర్ రాజా.వి.కొప్పాల‌ ఎమ్‌డి శిక్ష‌ణ‌ను పూర్తి చేయ‌డ‌మేగాక ప్ర‌తిష్టాత్మ‌క‌మైన అమెరిక‌న్ ఇంట‌ర్వెన్ష‌న‌ల్ రేడియోల‌జీ ఫెలోషిప్‌నకు ముందే యూకేలో ఎఫ్.ఆర్‌. సి.ఆర్ మ‌రియు సి.సి.ఎస్‌.టిల‌లో పాల్గోన్నారు. అట్లాంటాలోని ఎమోరీ యూనివ‌ర్సిటీ హాస్పిట‌ల్ నుంచి యునైటెడ్ బోర్డ్ స‌ర్టిఫికేష‌న్‌ను కూడా సాధించారు.
 
త‌ర్వాత డాక్ట‌ర్ రాజా.వి.కొప్పాల భార‌త‌దేశంలో ఇంట‌ర్వెన్ష‌న‌ల్ రేడియోల‌జీ హాస్పిట‌ల్‌ను ఏర్పాటు చేయాల‌ని భావించి, స్వదేశానికి చేరుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అత‌నికి  మెడిక‌ల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ( ఎంసిఐ) , బెర్ముడా మెడిక‌ల్ కౌన్సిల్‌, సింగ‌పూర్ మెడిక‌ల్ కౌన్సిల్‌, నెబ్రాస్కా తాత్కాలిక ఫ్యాక‌ల్టీ అనుమ‌తి ఉంది.  ఉత్త‌ర అమెరికా రేడియోలాజిక‌ల్‌, రాయ‌ల్ కాలేజీ ఆఫ్ రేడియోల‌జిస్ట్స్ -యుకే, ది బ్రిటిష్ సొసైటీ ఆఫ్ ఇంట‌ర్వెన్ష‌న‌ల్  రేడియోల‌జీ, సింగ‌పూర్ రేడియోలాజిక‌ల్ సొసైటీల‌లో డాక్ట‌ర్ రాజా గౌర‌వ స‌భ్యులు కూడా!
 
వివిధ వేదిక‌ల‌పై ప‌లుర‌కాల అవార్డులు అందుకున్న డాక్ట‌ర్ రాజా.వి.కొప్పాల 2003లో సింగ‌పూర్‌లో ప్ర‌బ‌లిన అంటువ్యాధుల మ‌హ‌మ్మారిని లెక్క‌చేయ‌కుండా ధైర్యంగా అక్క‌డ వైద్య‌సేవ‌లందించి ఆదేశ అధ్యక్షుని  ప‌త‌కాన్ని పొంద‌డం గ‌మ‌నార్హం. 
 
మీరు వేరికోస్ వెయిన్స్‌, కాలేయ క్యాన్స‌ర్‌, గ‌ర్భాశ‌య క‌ణితులు లోతైన ర‌క్త‌పు గ‌డ్డ‌లు ( డీవీటీ) లేదా సిర‌ల పుండ్లు త‌దిత‌రాల‌తో బాధ‌ప‌డుతుంటే  నిజ‌మైన చికిత్స‌, స‌త్వ‌ర‌మే కోలుకోవ‌డానికి గాను వెంట‌నే డాక్ట‌ర్ రాజా.వి.కొప్పాల గారి అపాయింటుమెంట్ తీసుకోగ‌ల‌రు.
ఆరోగ్య‌మ‌స్తు!