మాన‌వ శ‌రీరంలో గుండెకు న‌డుం దిగువ భాగం నుంచి సిర‌లు ర‌క్తాన్ని పైకి పంపుతుంటాయి. ర‌క్తం వెన‌క్కి రాకుండా ర‌క్త‌నాళాల సాయంతో ఏక క‌వాటాలే ఆధారంగా సిర‌లు ప‌నిచేస్తాయి. ఒక వేళ ర‌క్తం తిరిగి వెన‌క్కి వ‌స్తే క‌వాటాలు బ‌ల‌హీన‌మైపోవ‌డ‌మేగాక‌, ర‌క్తం ఆ నాళాల్లో గ‌డ్డ‌క‌ట్టుకుపోతుంది. స‌రిగ్గా ఇటువంటి ప‌రిస్ధితినే న‌రాల‌వాపు వ్యాధి అనే అనారోగ్యంగా పేర్కొంటారు. గ‌డ్డ‌క‌ట్టుకుపోయిన లేదా వెన‌క్కివ‌చ్చిన ర‌క్తం వ‌ల్ల న‌రాలు ఉబ్బ‌టాన్నే వేరికోస్‌గా పేర్కొంటారు. దీనికి సంబంధించి కొన్ని ముఖ్య‌మైన విష‌యాలు తెలుసుకోవాల్సిఉంది.
కొన్నిసార్లు వేరికోస్ ప్రాణాంత‌క‌మే!
కాళ్ల‌లో సిర‌ల వాపు తీవ్ర‌మైన ప‌రిస్ధితుల‌కు దారితీయ‌వ‌చ్చు. అనారోగ్య సిర‌ల కార‌ణంగా ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ‌లో స‌మ‌స్య త‌లెత్తి శ‌రీరంలో కాలు లాంటి అవ‌య‌వాన్ని కోల్పోవ‌డం లేదా అరుదైన సంద‌ర్భాల‌లో మృత్య‌వాత ప‌డ‌డం సంభ‌వించ‌వ‌చ్చు. అసౌకర్యం క‌ల్పించే సిర‌ల ప‌రిస్ధితిని ఎన్న‌టికీ అశ్ర‌ద్ధ చేయ‌కూడ‌దు.
మీరు ఏం చేయ‌కూడ‌దంటే…
కాళ్లలో న‌రాల వాపు  ( వేరికోస్ వెయిన్స్‌) వ్యాధి ఉంటే అక్క‌డ గోక‌రాదు. అలాచేస్తే పుండ్లు ప‌డే అవ‌కాశం ఉంది. ఈ విష‌యంలో జాగ్ర‌త్త అవ‌స‌రం.
ఊబ‌కాయం:- జ‌న్యుప‌ర‌మైన స‌మ‌స్య‌వ‌ల్లే కాకుండా, కాళ్లలో న‌రాల వాపు  ( వేరికోస్ వెయిన్స్‌) వ్యాధికి ఊబ‌కాయం ఒక ప్ర‌ధాన కార‌ణంగా పేర్కోన‌వ‌చ్చు. అధిక బ‌రువు కార‌ణంగా కాళ్ల‌పై తీవ్ర‌వ‌త్తిడి ప‌డుతుంది. అందువ‌ల్ల ఒక వ్య‌క్తి త‌గు మోతాదులోనే, ఆరోగ్య‌క‌ర‌మైన బ‌రువును క‌లిగి ఉండాలి. లేక‌పోతే వేరికోస్ వెయిన్స్ ప్ర‌భావానికి గురికావ‌చ్చు.
ఓ అరుదైన వాస్త‌వం:- కాళ్లలో న‌రాల వాపు  ( వేరికోస్ వెయిన్స్‌) వ్యాధికి గురికాకుండా ఉండాలంటే సూర్యుని హానిక‌ర‌మైన కిర‌ణాల ప్ర‌భావం లేకుండా, అధిక వేడిమి త‌గుల‌కుండా జాగ్ర‌త్త‌ప‌డాలి. నిజానికి సూర్యుని ప్ర‌భావం కంటే అనారోగ్య సిర‌ల కార‌ణంగా వేడి ప్ర‌భావ‌వంత‌మ‌వుతుంది. ఫ‌లితంగా ర‌క్త‌నాళాలు వాచిపోవ‌డానికి, విస్త‌రించ‌డానికి కార‌ణమ‌వుతుంది. దీంతో కాల‌క్ర‌మంలో ర‌క్తం నిల్వ ఉండిపోయే అవ‌కాశాలు పెరుగుతాయి. కాళ్లలో న‌రాల వాపు  ( వేరికోస్ వెయిన్స్‌) వ్యాధి ల‌క్ష‌ణాలు క‌లిగిన వ్య‌క్తులు కాల‌క్రమంలో ఇవి మ‌రింత‌గా పెరిగిపోవ‌డాన్ని గ‌మ‌నించ‌వ‌చ్చు. అందువ‌ల్ల ఎవ‌రైన వేడిమి ప్ర‌భావానికి దూరంగా ఉండాలి.
న‌రాల వాపు ల‌క్ష‌ణాలు క‌లిగిన వారు వేడి నీటి స్నానానికి లేదా ఆవిరి స్నానానికి దూరంగా లేదా త‌క్కువ స‌మ‌యం మాత్ర‌మే కేటాయించాల‌న్న ఆలోచ‌న క‌లిగి ఉండాలి. అంతేగాక వేరికోస్ కార‌ణంగా వాచిన కాళ్లు బాధ‌పెడుతుంటే వేడి నీటికి బ‌దులు ఐస్ ముక్క‌లు వాడాల‌ని గుర్తుంచుకోవాలి.
భార‌త‌దేశంలో, ఇత‌ర దేశాల‌లో ర‌క్త‌నాళ సంర‌క్ష‌ణ కేంద్రాలు ఎక్కువ ఉన్నాయి. భార‌త‌దేశంలోని హైద‌రాబాద్‌లోని ప్ర‌ఖ్యాతి గాంచిన వాస్క్యుల‌ర్ సెంట‌ర్ ఉంది. అది ఎవిస్ వాస్క్యుల‌ర్ సెంట‌ర్‌. ఇక్క‌డ అన్నిర‌కాల వాస్క్య‌ల‌ర్ స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం ల‌భిస్తుంది. మీ స‌మ‌స్య‌ను నిపుణులైన వైద్యులు ప్ర‌త్యేక శ్ర‌ద్ధ‌తో ప‌రిష్క‌రిస్తారు. ఈ కేంద్రంలో హానిక‌రంలేని విధానాల‌ను అమ‌లు చేయ‌డంలో ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకోవ‌డం జ‌రుగుతుంది. అత్యంత నాణ్య‌తా ప్ర‌మాణాల‌తో సౌక‌ర్య‌వంతంగా, సుఖ‌మ‌యంగా వ్య‌వ‌హ‌రిస్తూ, రోగుల‌కు వివ‌రాల‌ను అందిస్తూ స‌రైన రీతిలో అనారోగ్యం నుంచి కోలుకునేలా చేస్తుంది.