Testimonials

మాది ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా చందోలు గ్రామం. గత ఐదేళ్లుగా నేను కాళ్లలో నరాల వాపు అనే వేరికోస్ వెయిన్స్ వ్యాధితో బాధపడి విజయవాడ తదితర పట్టణాలలో చూపించుకున్నాను. ఫలితం లేకపోయింది. టీవీలో డాక్టర్ రాజా .వి.కొప్పాల గారి కార్యక్రమం చూసి గుంటూరు వచ్చిన డాక్టర్గారికి సమస్య వివరించాను. డాక్టర్ రాజా సూచనల మేరకు సర్జరీ చేయించుకోగా ఇప్పుడు చాలా బాగుంది. సమస్య తొలగింది. వ్యాధి వస్తే వెంటనే సర్జరీ చేయించుకుంటే పుండ్లు వంటి సమస్యలు రావని నేను మా బంధువులు, మిత్రులకు తెలియజేస్తున్నాను. షేక్ మౌలాలి (38 సం.) రెండేళ్ల సమస్య రెండురోజుల్లో మాయం

నా పేరు పసుపులేటి సురేష్‌బాబు. గుంటూరు జిల్లాలోని కోరిటేపాడు గ్రామంలో 42 ఏళ్ల వయస్సుగల నేను దీప్తి బుక్స్ & స్టేషనరీ షాపు నడుపుతున్నాను. గత రెండేళ్లుగా వేరికోస్ వెయిన్స్ సమస్యతో బాధపడుతూ అది చర్మ సమస్యగా భావించి వైద్యం చేయించుకుంటున్నప్పటికీ సమస్య సమసిపోలేదు. ఒకరోజు ఎవిస్ హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ రాజా.వి.కొప్పాలగారి టీవీ ప్రోగ్రాం అనుకోకుండా చూసి హైదరాబాద్ వెళ్లి సర్జరీ చేయించుకున్నాను. రెండేళ్లుగా పడుతున్న బాధ, సమస్య రెండురోజుల్లో తీరిపోయింది. ఆసుపత్రిలో సేవలు నాకు బాగా నచ్చాయి. పసుపులేటి సురేష్‌బాబు

మా నాన్నగారు ఎంతో హేపీ! మాది గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడి గ్రామం. మా తండ్రిగారి పేరు తూమాటి కృష్ణారావు. (55). వ్యవసాయం వృత్తి. మా నాన్నగారి రెండు కాళ్లు తరచూ వాచిపోయేవి. పుండ్లు కూడా పడేవి. పలు మార్లు విజయవాడ ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్లి వైద్య ం చేయించినా తాత్కాలికంగా వాపు తగ్గి మళ్లీ తిరగబెట్టేవి. ఈ పరిస్గితులలో డాక్టర్ రాజా గారి గురించి తెలిసింది. వెళ్లి కలిసి డాక్టర్గారి సలహామేరకు సర్జరీ చేయించాము. నాన్నగారు ఒక్కరోజులో ఆపరేషన్ పూర్తయి ఇంటికి ఆనందంగా చేరారు. 4 రోజుల తర్వాత బ్యాండేజి వేశారు. ఇప్పడు మా నాన్నగారికి పుండ్లుగాని, కాళ్లవాపుగాని లేవు.ఆయన ఎంతో హేపీగా ఉన్నారు. డాక్టర్ రాజా.వి.కొప్పాల, ఎవిస్ ఆసుపత్రి సిబ్బ ందికి ప్రత్యేక ధన్యవాదాలు తూమాటి రవీంద్ర

నా జీవితానికి ధీమా దొరికింది! -బీమా ఏజెంట్ శ్రీనివాసరెడ్డి ప్రకాశం జిల్లా కనిగిరి గ్రామానికి చెందిన చిలకల శ్రీనివాసరెడ్డి అనే నేను జీవిత బీమా ఏజెంట్‌గా పని చేస్తున్నాను. గత 15 ఏళ్లుగా కాళ్లలో నరాల వాపుగా తీవ్రంగా బాధపడుతున్నాను. గతంలో నేను విజయవాడలో వైద్యులకు చూపించినా ఫలితం కనిపించలేదు. సాక్స్‌లు వాడమని చెప్పేవారు. వాటివల్ల సమస్య తగ్గలేదు. ఈ లోగా టీవీలో డాక్టర్ రాజా గారి కార్యక్రమం చూసి గుంటూరు వెళ్లి కలవగా ఆపరేషన్ అవసరమని చెప్పారు. ఆ మేరకు సర్జరీ చేయించుకోగా సమస్య తొలగి నా జీవితానికి స్పష్టమైన ధీమా కనిపించింది. ఆసుపత్రి సిబ్బ ందికి నా ధన్యవాదాలు. - చిలకల శ్రీనివాసరెడ్డి (41) కనిగిరి

మాది తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది గ్రామం. నేను దుబాయ్‌లో పనిచేసి సుమారు రూ. 20 లక్షల వరకు సంపాదించాను. మా తమ్ముడు పేరు పి. హనుమంతు. వాడికి కాళ్లలో నరాల వాపు వ్యాధి ఉంది. చాలా మంది డాక్టర్లకు చూపించాను. సుమారు రూ. 15 లక్షలు ఖర్చు చేశాను. ఫలితం లేకపోయింది. ఇటీవల ఎవిస్ హాస్పిటల్ గురించి తెలిసి ఇక్కడకు వచ్చి వాడికి సర్జరీ చేయించాను . చాలా బాగుంది. వ్యాధి పూర్తిగా తగ్గింది. చాలా సంతోషంగా ఉంది. పి. వెంకటేష్, అంతర్వేది. తూ.గో.జిల్లా

కాళ్లలో నరాల వాపు వ్యాధికి లేజర్ సర్జరీ చేసి వ్యాధిని పూర్తిగా తగ్గించడంలో ఎవిస్ హాస్పిటల్‌ను మించిన హాస్పిటల్ బహుశా మరొకటి ఉండదేమో ! 11-3-2017న నేను ఈ హాస్పిటల్‌కు వచ్చి చూపించుకుని, డాక్టర్ రాజా సార్ తో సర్జరీ చేయించుకున్నాను. మొత్తం వ్యాధి తగ్గింది. మా ప్రాంతానికి చెందిన మరో ఇద్దరిని తీసుకువచ్చి ఆపరేషన్ చేయించాను కూడా !. హాస్పిటల్లో స్టాఫ్ సేవలు మరచిపోలేనివి కె.మకట్‌లాల్ (42) దేవరకొండ..నల్లగొండ జిల్లా