మన ఉద్యోగాలు మరియు రోజువారి పని వాతావరణం అనేది మన యొక్క జీవన విధానం మీద మరియు మన మొత్తం ఆరోగ్యం పైనా ఒక గొప్ప ప్రభావాన్ని కలిగివుంటాయి. రోజులో ఎక్కువ సమయం వరకూ ఒకే భంగిమలో నిల్చోవడం లేదా కూర్చోవడం లాంటివి చేసే ఉద్యోగుల విషయంలో వేరికోస్ వేయిన్స్ అనేది ఒక సాధారణ వైద్యపరమైన రుగ్మత అనే వాస్తవంలో ఎటువంటి అనుమానం అవసరం లేదు.

ఉదాహరణకి, ఉపాధ్యాయులు, ట్రాఫిక్ మగ పోలీసులు/ఆడ పోలీసులు, నర్సులు, దుకాణందారులు, అమ్మకందారులు, బస్ కండక్టర్లు, డ్రైవర్లు, మరియు అటువంటి ఉద్యోగాలు చేసే ఇతరుల విషయంలో, అటువంటి ఉద్యోగాలు తక్కువ శారీరక క్రియలకి దారి తీస్తాయి కాబట్టి వారికి తక్కువ వయసులోనే వేరికోస్ వేయిన్స్ తలెత్తే అవకాశాలు మరీ ఎక్కువగా వుంటాయి.

ట్రాఫిక్ పోలీసులు వేరికోస్ వేయిన్స్ అపాయం బారిన మరింత పడేలా చేసేది ఏమిటి?

ఖచ్చితమైన విధానం కలిగివుండే అన్ని ఉద్యోగాలు మరియు వృత్తులలో, ట్రాఫిక్ పోలీసు సిబ్బందిగా విధులు నిర్వర్తించేవారే ఎక్కువ అపాయంలో ఉన్నట్లుగా చెప్పవచ్చు. ఎందుకంటే వారు చేసే ఉద్యోగంలో 8-10 గంటల వరకూ ఎటువంటి విరామం లేకుండా కదలకుండా నిలబడాల్సి వుంటుంది. వాహనాల నుండి వచ్చే పొగ మరియు దుమ్ముతో కలుషితమయ్యే వాతావరణంలో వారి యొక్క పని గంటలని నిర్వహిస్తారు.

ట్రాఫిక్ పోలీసులుగా పనిచేసే పురుషులు మరియు స్త్రీలు కూడా పెద్ద ఎత్తున శబ్దాలు చేసే మరియు కలుషితం చేసే వాహనాల మధ్యన రోజంతా తీవ్రమైన శారీరక ఒత్తిడిని అనుభవిస్తారు. ముఖ్యంగా మెట్రో నగరాలలో వేగవంతమైన పట్టణీకరణ మరియు వాహనాల సంఖ్యల్లో గణనీయమైన పెరుగుదల కారణంగా, ట్రాఫిక్ సిబ్బంది యొక్క ఉద్యోగాలు ఈ మధ్య కాలంలో వీపరీతమైన అలసటతో కూడినవిగా వుండి వారి వెన్నువిరిచే స్థాయిలో ఉంటున్నాయి.

ట్రాఫిక్ పోలీసులు నిరాటంకమైన పని బారాన్ని మరియు అనూహ్యమైన ఎక్కువ సేపు పని గంటల్ని భరిస్తారు. అంతేకాకుండా, వారు అనుకోని సంఘటనలని కూడా ప్రతీ రోజు ఎదురుకుంటారు. వారి యొక్క కఠినమైన పని పరిస్థితులు వారి యొక్క ఆరోగ్యం మీద ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. అంతేకాకుండా, వారి యొక్క పని గంటలలో పెరుగుదల మూలంగా వారి ఆరోగ్యంలోని సమస్యలు కూడా ఇంకా తీవ్రతరమవుతాయి.

ఈ కారణాలన్నీ కూడా ట్రాఫీక్ పోలీసులు వేరికోస్ వేయిన్స్ బారిన పడే అవకాశాలని మరింతగా ఎక్కువ చేస్తాయి. నరాల యొక్క కవాటాలు మాములుగా పని చేయనపుడు, అవి వైఫల్యం చెందిన నరాల రూపంలో ఉబ్బెత్తుగా ఏర్పడతాయి. అంతేకాకుండా, రక్తప్రసరణకి సాయం చేయబడానికి బదులు, రక్తం తిరిగి గుండెకి చేరకుండా అవి అడ్డుకుంటాయి.

ప్రభావిత ప్రాంతంలో వేరికోస్ వేయిన్స్ విపరీతమైన వాపుని మరియు నొప్పిని కలిగిస్తాయి, ముఖ్యంగా కాళ్ళు మరియు పాదాల క్రింది భాగంలో. అవి అసౌకర్యాన్ని కలిగించి, నరాల పుళ్ళు, దీర్ఘకాలిక నరాల అసమర్థత, అంతర్గత నరాల్లో రక్తం గడ్డకట్టడం (Deep vein thrombosis) మరియు ఊపిరితిత్తుల నరాల్లో రక్తం గడ్డకట్టడానికి (Pulmonary embolism) దారి తీస్తాయి.

ట్రాఫిక్ పోలీసులు వేరికోస్ వేయిన్స్ బారిన పడకుండా ఎలా ఉండగలరు?

ట్రాఫిక్ పోలీసు అధికారులు వేరికోస్ వేయిన్స్ బారిన పడే అవకాశాన్ని అంచనా వేయడానికి ఇటివలే జరిపిన పరిశోధన ప్రకారం తెలిసిందేంటంటే, ముందుగానైనా కావచ్చు లేదా తరువాతి కాలంలోనైనా కావచ్చు, మొత్తం ట్రాఫిక్ పోలీసు సిబ్బందిలో దాదాపు 12% వరకూ వేరికోస్ వేయిన్స్ బారిన పడే అవకాశం వుంటుంది.

వేరికోస్ వేయిన్స్ అనేది జన్యువులకి సంబంధించిన సమస్యగా కూడా పెర్కొనబడినప్పటికీ, అంతేకాకుండా మీ కుటుంబీకులలో ఎవరికైనా ఈ నరాల సమస్య వున్నపుడు మీకు కూడా వేరికోస్ వేయిన్స్ తలెత్తే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నప్పటికీ, మీరు దీని యొక్క కారణాలు మరియు లక్షణాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం.

తమ తీవ్రమైన రోజువారి ఉద్యోగ పనితీరు వలన మరియు తీవ్రమైన పని వాతావరణం వలన ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయని ట్రాఫిక్ సిబ్బందిగా పనిచేసే మగ పోలీసులు మరియు ఆడ పోలీసులు తెలుసుకోవాలి. అంతేకాకుండా, తీవ్రమైన వ్యాధులను నివారించడానికి అవసరమైన అన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.

మీయొక్క పని గంటలలో మధ్య మధ్యలో విరామాలు తీసుకుంటూ అప్పుడప్పుడు కూర్చునేలా జాగ్రత్తలు తీసుకోండి. నిల్చొని వున్న సమయంలో కూడా రక్త ప్రసరణని నియత్రించి కాళ్ళలో మరియు పాదాలలో రక్తం గడ్డకట్టకుండా నివారించేందుకు మీయొక్క చీలమండలను కదల్చడం, పాదాలతో చిన్న చిన్న వ్యాయామాలు చేయడం లాంటివి చేయండి.

సకాలంలో అందించే వైద్య సహాయం ఎటువంటి వైద్య సమస్యనైనా తీవ్రతరం కాకుండా నివారించగలుగుతుంది కాబట్టి, ట్రాఫిక్ పోలీసులందరూ ఏవైనా నరాల సమస్యలను గుర్తించేందుకు వీలుగా ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిది. ట్రాఫిక్ పోలీసు సిబ్బంది నియమిత విరామాల్లో పోషకాహారం కలిగిన భోజనం తీసుకోవడం, చిన్న చిన్న వ్యాయామాలలో పాల్గొనడం, మరియు శాశ్వతంగా ఆల్కాహాల్ మరియు పొగాకుని మానివేయడం మంచిది.

ముగింపు

మీ ఆరోగ్యాన్ని ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చేయకూడదు. అంతేకాకుండా, ప్రారంభంలో ఏవైనా లక్షణాలు కనబడినపుడు లేదా అసౌకర్యానికి గురైనపుడు ఒక వస్కూలర్ నిపుణున్ని సంప్రదించండి. డా. రాజా వి కొప్పాలా గారు 20 సంవత్సరాల అనుభవం కలిగిన ఒక వాస్కులర్ వైద్య నిపుణుడు. ఆయన అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలలో తన చదువు మరియు శిక్షణను పూర్తి చేసుకుని, అంత్యంత ప్రశంసలు అందుకున్న ఒక వాస్కులర్ శస్త్ర వైద్యుడు మరియు ఒక ఆధునిక లాపరోస్కోపిక్ శస్త్ర వైద్యుడు.

డా. రాజా గారు వేరికోస్ వేయిన్స్ వ్యాధికి సంబంధించి తక్కువ కోతతో కూడిన మరియు నొప్పిలేని చికిత్సా విధానంలో నైపుణ్యం గడించారు. ఈ విధానం ద్వారా ఒకే ఒక సిట్టింగులో మొత్తం అడ్డంకి తొలగించబడుతుంది, తద్వారా ప్రభావిత అవయవాలలో మీకు వాపు మరియు నొప్పి నుండి త్వరిత ఉపశమనం లభిస్తుంది.

తాత్కాలిక రోగి విధానంలో తాత్కాలిక మత్తుమందు ఇవ్వడం ద్వారా ఈ చికిత్సా విధానం నిర్వహించబడుతుంది. అంతేకాకుండా, విశ్రాంతి సమయం కూడా అవసరం లేదు. రోగులు అదే రోజు ఇంటికి తిరిగి వెళ్ళి, తరువాతి రోజు నుండే తమ కార్యాలయాలకు వెళ్ళవచ్చు. అవీస్ వాస్కులర్ కేంద్రం అత్యాధునిక వైద్య సదుపాయాలని కలిగివుంది మరియు అందరికీ త్వరిత వైద్య భీమా సహాయాన్ని అందించడానికి వీలుగా అన్ని జాతీయ భీమా సంస్థలతో అనుబంధాన్ని కలిగివుంది. దూరం నుండి వచ్చే రోగుల కొరకు కూడా మేము ప్రత్యేక సదుపాయాలని కలిగివున్నాము. వారి యొక్క ప్రయాణం మరియు వసతికి సంబంధించిన పూర్తి శ్రద్ధ మేము వహిస్తాము.

నివారణ కంటే కూడా ముందు జాగ్రత్త తీసుకోవడమే మంచిదనే విషయాన్ని గుర్తుంచుకోండి. త్వరగా కోలుకోవడానికి సకాలంలో అందించే చికిత్స చాలా ముఖ్యమైనది. ఒక వాస్కులర్ నిపుణున్ని సంప్రదించడంలో ఎప్పుడూ కూడా సంకోచించకండి. అవీస్ వాస్కులర్ సెంటర్లోని వైద్య నిపుణులైన డా. రాజా వి కొప్పాలా గారి అపాయింట్‌మెంట్‌ని ఈరోజే బుక్ చేసుకోండి!

Varicose Veins Treatment in Hyderabad | Bengaluru | Visakhapatnam | Chennai | Vijayawada | Guntur | Hubli