ఎండోవీనస్ లేజర్ వేయిన్ శస్త్రచికిత్స అంటే ఏమిటి?

ఎండోవీనస్ లేజర్ వేరికోస్ వేయిన్ శస్త్రచికిత్స అనేది వేరికోస్ వేయిన్స్‌కి చికిత్స చేయడానికి అవలంభించే ఒక వైద్య పరమైన పద్ధతి. సాధారణ శస్త్రచికిత్సా విధానాలతో పోల్చినపుడు, త్వరగానే కోలుకునే వెసులుబాటును అందిస్తూ నొప్పిలేని మరియు తక్కువ కోతతో కూడిన చికిత్సా విధానం ఇది.

ఈ పద్ధతిలో వేరికోస్ వెయిన్స్‌ని మూసివేయడానికి లేజర్ ఉష్ణాన్ని ఉపయోగించడం జరుగుతుంది. శరీరం తనంతట తానే ప్రక్కనే వున్న ఇంకొక నరాలకి రక్తాన్ని మళ్ళిస్తుంది, తద్వారా వేరికోస్ వేయిన్స్ ప్రభావిత ప్రాంతంలోని వాపు మరియు నొప్పి నుండి రోగులు త్వరిత ఉపశమనం పొందుతారు.

నాకు ఎందుకని ఎండోవీనస్ లేజర్ వేయిన్ శస్త్రచికిత్స యొక్క అవసరం రావచ్చు?

వేరికోస్ వేయిన్స్ తీవ్రతరమైన వైద్య పరిస్థితి కానప్పటికీ, అవి నరాలను వ్యాకోచింపజేసి చేసి చర్మం లోపలి నుండి ఉబ్బెత్తుగా కనబడేలా చేస్తాయి. కొన్ని కేసులలో రోగులకి ఎటువంటి నొప్పి లేదా అసౌకర్యం అనిపించదు. అంతేకాకుండా త్వరిత వైద్య సహాయం కూడా వారికి అవసరం వుండదు.

వేరికోస్ వేయిన్స్ గనుక ప్రభావిత ప్రాంతంలో నొప్పి మరియు వాపుతో కూడిన దురద మరియు పుండుని కలుగజేస్తే, అప్పుడు రక్తం గడ్డకట్టడం మరియు డీప్ వేయిన్ థ్రోంబోసిస్‌ (DVT) లాంటి అతి తీవ్రమైన ఉపద్రవాలని నివారించడానికి ఆ రోగులకి త్వరిత చికిత్స ఖచ్చితంగా అవసరం.

ఆ విధంగా శరీర ప్రసరణ వ్యవస్థ నుండి వేరికోస్ వేయిన్స్‌ని తొలగించి రక్తం గడ్డకట్టడాన్ని నివారించడానికి ఎండోవీనస్ లేజర్ వేయిన్ శస్త్రచికిత్సని సిఫారసు చేయడం జరుగుతుంది. ఈ శస్త్రచికిత్స ప్రభావిత ప్రాంతంలోని వాపుని అధిగమించడానికి సహయం చేస్తుంది. క్రియాశీల నరాల అల్సర్లు, దీర్ఘకాలిక నరాల అసమర్థత మొదలైనటువంటి సంభవించే అవకాశం వున్న ప్రమాదాలను సైతం నివారించడానికి ఇది సహాయ పడుతుంది.

ఎండోవీనస్ లేజర్ వేయిన్ శస్త్రచికిత్సతో పాటు వుండే కొన్ని అపాయాలు ఏమిటి?

అన్ని రకాల వైద్య పద్ధతులలో కూడా ఎన్నో కొన్ని అపాయాలు వుంటాయి. వేరికోస్ వేయిన్స్‌కి చికిత్స చేసే క్రమంలో ఈ క్రింది వాటిలో కొన్ని చిక్కులు తలెత్తవచ్చు.

1. ఇన్‌ఫెక్షన్‌.

2. రక్తం కారడం.

3. కాలడం.

4. చికిత్స చేసిన ప్రాంతంలో నొప్పి.

5. నరం చెడిపోవడం.

6. రక్తం గడ్డకట్టడం.

7. చికిత్స ప్రాంతంలోని చర్మం రంగు మారడం.

శస్త్రచికిత్సా పద్ధతులతో పోల్చినపుడు ఎండోవీనస్ లేజర్ చికిత్సా విధానంలో సంభవించే ప్రమాదాల అవకాశం మరియు తీవ్రత చాలా తక్కువగా వుంటుంది.

ఎండోవీనస్ లేజర్ వేరికోస్ వేయిన్ శస్త్రచికిత్స కొరకు నేను ఏ విధంగా సిద్ధం కావాలి?

1. మీ వైద్య నిపుణుడు మీయొక్క గత వైద్య చరిత్ర గురించి ఆరా తీస్తాడు. మీ నుండి కొన్ని రక్త పరీక్షలు మరియు రోగి నిర్ధారణ పరీక్షలని కూడా కోరడం జరగవచ్చు. ఇవన్నీ కూడా మీరు లేజర్ చికిత్స చేయించుకోవడానికి కావలసినంత ఆరోగ్యంగా వున్నారని నిర్ధారణ చేయడానికి ఉపయోగపడతాయి.

2. చికిత్సకి ముందు, గతంలో రక్తం గడ్డకట్టడం గాని లేదా రక్తం కారడం లాంటి రుగ్మతలేవైనా మీకు తలెత్తిన సందర్భాల గురించి వైద్యునికి తెలియజేయాలి.

3. విటమిన్ మాత్రలు, మూలికలు మొదలైన వాటితో సహా మీరు అప్పటి వరకూ వాడుతున్న అన్ని మందుల గురించి మీరు మీ వైద్యునితో చర్చించాలి. ఒకవేళ మీకు అంతకు ముందు బ్లడ్ థిన్నర్స్‌ (రక్తం గడ్డకట్టడాన్ని నివారించే మందులు) ఇవ్వబడి వుంటే గనుక, వాటి గురించి ప్రస్తావించడం మాత్రం మరచిపోకండి. చికిత్స తరువాత రక్తం గడ్డకట్టడాన్ని ప్రభావితం చేసే ఇతర మందుల గురించి మీ యొక్క వైద్యునితో చర్చిచండి.

4. లేటెక్స్, టేపు, కాంట్రాస్ట్ డైస్, నొప్పి నివారిణి మత్తు మందులు మొదలైన వాటి వలన మీకు ఏవైనా అలర్జీలు వుంటే గనుక, వాటిని మీ వైద్యునికి ఖచ్చితంగా తెలియజేయండి.

5. మీ వైద్యుడు మీకు చికిత్సా విధానాన్ని వివరించిన తరువాత, మిమ్మల్ని బాధిస్తున్న ప్రశ్నలని కూడా వారిని అడగడం మరచిపోకండి.

6. మీ వైద్యుడు మిమ్మల్ని ఒక అనుమతి పత్రం పైన సంతకం చేయమని కోరతాడు. సంతకం చేసే ముందు ఆ పత్రాన్ని పూర్తిగా చదివారని నిర్ధారణ చేసుకోండి.

ఎండోవీనస్ లేజర్ శస్త్రచికిత్స చేసే సమయంలో ఏం జరుగుతుంది?

ఒక ఇంటర్‌వెన్షనల్‌ రేడియోలాజిస్ట్ ద్వారా లేజర్ వేయిన్ చికిత్స నిర్వహించడం జరుగుతుంది.

1. ఆసుపత్రి దుస్తులలో శస్త్రచికిత్స చేసే టేబుల్ మీద పడుకోమ్మని మిమ్మల్ని కోరతారు. లేజర్ కిరణాల నుండి మీ కళ్ళని రక్షించుకొనే విధంగా మీకు ఒక కాళ్ళజోడుని కూడా ఇవ్వడం జరగొచ్చు.

2. వైద్యుడు కేంద్రీకృత నొప్పి నివారిణి సహాయంతో చికిత్స చేసే భాగాన్ని మొద్దుబారేలా చేస్తాడు. శస్త్రచికిత్సా పద్ధతులకి భిన్నంగా ఈ పద్ధతిలో సాధారణ నొప్పి నివారిణి యొక్క అవసరం వుండదు.

3. చికిత్స చేస్తున్న నరాలని పరీక్షించేందుకు వీలుగా చికిత్స చేసే ముందు మరియు చేస్తున్న సమయంలో వైద్యుడు ఒక డాప్లర్ అల్ట్రాసౌండ్ స్కాన్‌ని ఉపయోగిస్తాడు. డాప్లర్ అల్ట్రాసౌండ్ అనేది ధ్వని తరంగాలని ఉపయోగించి స్క్రీను మీద నరం యొక్క చిత్రాన్ని సృష్టిస్తుంది.

4. చికిత్స చేసే నరం వైపునకి ఒక నాళికను పంపించడానికి వీలుగా వైద్యుడు మీ చర్మం మీద ఒక చిన్న కోత పెడతాడు. ఆ నాళికలోంచి సన్నని లేజర్ తంతువుని పంపించి చెడిపోయిన నరాన్ని మూసివేయడం జరుగుతుంది. వేరికోస్ వేయిన్ మూడుచుకొని పోయి తిరిగి శరీరంలోనికి పీల్చుకోబడుతుంది.

వైద్యుని దగ్గరే తాత్కాలిక రోగికి అందించే చికిత్సా పద్ధతిలోనే ఈ ఎండోవీనస్ లేజర్ శస్త్రచికిత్సని నిర్వహించడం జరుగుతుంది కాబట్టి రోగి ఆసుపత్రిలోనే ఉండాల్సిన అవసరం లేదు. ఈ చికిత్సకి ఒక గంట కంటే తక్కువ సమయం పడుతుంది. అంతేకాకుండా, రోగి అదే రోజు ఇంటికి కూడా తిరిగి వెళ్ళిపోవచ్చు.

కోత చాలా చిన్నదిగా వుంటుంది కాబట్టి, దానికి కుట్లు కూడా వేయాల్సిన అవసరం వుండదు. ఆ విధంగా ఎండోవీనస్ లేజర్ శస్త్రచికిత్స ఆ ప్రాంతంలో ఎటువంటి మచ్చలని కూడా మిగల్చదు. మీ కాళ్ళ మీద చిన్న గాయపు మచ్చలను మీరు గమనించే అవకాశం ఉన్నప్పటికీ, అవి కేవలం ఒక రెండు వారాల్లోనే మాయమవుతాయి.

చికిత్స పూర్తైన తరువాత వదులుగా వుండే దుస్తులు వేసుకొమ్మని మీకు సూచించడం జరుగుతుంది.      

ఎండోవీనస్ లేజర్ శస్త్రచికిత్స తరువాత ఏం జరుగుతుంది?

ఎండోవీనస్ లేజర్ శస్త్రచికిత్స చేయించుకున్న తరువాత తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఈ క్రింద పేర్కొనబడ్డాయి:

1. వాపుని తగ్గించడానికి, చికిత్స చేసిన భాగం మీద ఒక ఐస్ ప్యాక్‌ని 15 నిమిశాల కంటే ఎక్కువ సేపు కాకుండా పెట్టి వుంచండి.

2. చికిత్స చేసిన ప్రాంతాన్ని ప్రతీ రోజూ పరీక్షించండి. సాధారణంగా పట్టీ మీద లేత గులాభీ రంగు స్రావం కనబడుతుంది. కాని మీకేదైనా అసాధారణంగా అనిపిస్తే మాత్రం వెంటనే మీ వైద్యునితో చర్చించండి.

3. కోత పెట్టిన భాగానికి 48 గంటల వరకూ నీటిని తాకించకండి.

4. వైద్యుని సలహా మేరకు పీడనంతో కూడిన సాక్సులని ధరించండి. అలా చేయడం వాపుని మరియు రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తుంది.

5. కదలకుండా ఎక్కువ సేపు కూర్చోవడం గాని లేదా నిల్చోవడం గాని చేయకండి. కూర్చునే సమయంలో మీ కాలిని లేపి ఉంచేలా చూసుకోండి.

6. చురుకుగానే వుండండి కాని ఎగరడం గాని, లేదా బరువైన వస్తువులు ఎత్తడం గాని చేయకండి. ఏకధాటిగా 10 నుండి 20 నిమిశాలకి మించకుండా ప్రతీరోజు 3 సార్లు నడవండి.

7. 1 నుండి 2 వారాల వరకు వేడి నీటి స్నానం చేయకండి.     

ముందులాగే మీరు బ్లడ్ థిన్నర్లను మరియు ఇతర మందులు వాడవచ్చేమో మీ వైద్యున్ని అడిగి తెలుసుకోండి. చికిత్స తరువాతి పరీక్షల్లో, లేజర్ చికిత్స పనిచేసిందో లేదో తెలుసుకోవడానికి వైద్యుడు మీకొక అల్ట్రాసౌండ్ స్కాన్‌ని సిఫారసు చేయవచ్చు.

ఈ క్రింది పరిస్థితుల్లో మీరు వైద్యునిని వెంటనే సంప్రదించాలి:

1. చికిత్స చేసిన భాగంలో ఇన్‌ఫెక్షన్‌, వెచ్చదనం లేదా స్రవించడం లాంటి త్వరిత లక్షణాలు కనబడినపుడు.

2. చికిత్స చేసిన భాగంలో ఎంతకీ తగ్గని వాపు వున్నపుడు.

3. మీ రోజువారి పనులకి ఆటంకం కలిగించే విధంగా నొప్పి వున్నపుడు.

ముగింపు

ఎండోవీనస్ లేజర్ వెయిన్ శస్త్రచికిత్స అనేది వేరికోస్ వేయిన్స్ కొరకు ఒక ఉత్తమమైన చికిత్సా విధానం. ఇది నొప్పిలేని మరియు తక్కువ కోతతో కూడిన విధానం మాత్రమే కాదు, వేరికోస్ వేయిన్స్ మళ్ళీ సంభవించడానికి తక్కువ అవకాశాలను కలిగియుండి, ఒక త్వరిత స్వస్థతను అందించే విధానం అని కూడా దీనిని పేర్కొనవచ్చు.

అందవికారంగా మరియు నొప్పిని కలిగిస్తున్న వేరికోస్ వేయిన్స్‌ని తొలగించుకోవడానికి మీకు సాయం చేయగలిగే ఒక విశ్వసించదగిన వైద్యుని కొరకు మీరు అన్వేషిస్తూ వుంటే గనుక, అవీస్ వాస్కూలర్ సెంటర్లోని  డా. రాజా వి కొప్పాల గారి నుండి మీరు పూర్తి భరోసాని ఆశించవచ్చు.

డా. రాజా వి కొప్పాల గారు అంతర్జాతీయ అర్హతలని కలిగివున్న మరియు అత్యధిక శిక్షణ పొందిన ఒక వాస్కూలర్ శస్త్రచికిత్సా నిపుణుడు. ఒక ఇంటర్‌వెన్షన్‌ రేడియోలాజిస్ట్ వృత్తిలో ఆయనకి రెండు దశాబ్దాల కంటే ఎక్కువ అనుభవమే వుంది. అంతేకాకుండా, వాస్కూలర్ వ్యాధుల చికిత్సలో ఆయనకి గొప్ప నైపుణ్యం కూడా వుంది.

అవీస్ వాస్కూలర్ సెంటర్ అధునాతనమైన పరికరాలని మరియు గొప్ప వృత్తి నైపుణ్యంతో కూడిన సిబ్బందిని కలిగివుంది. హైదరబాదులోనే ఒక గొప్ప వైద్య కేంద్రంగా ఖ్యాతి గడించిన అవీస్ వాస్కూలర్ సెంటర్‌ని  నిస్సందేహంగా వేరికోస్ వేయిన్స్ చికిత్సకి ఉత్తమ ఎంపికగా పేర్కొనవచ్చు. ఈరోజే మీ యొక్క అపాయింట్‌మెంట్‌ని బుక్ చేసుకోండి!