వేరికోస్ వేయిన్స్ మరియు నరాల సమస్యలపైన ఊబకాయం యొక్క ప్రభావం.

వేరికోస్ వేయిన్స్ మరియు నరాల సమస్యలపైన ఊబకాయం యొక్క ప్రభావం

ఊబకాయం అంటే ఏమిటి?

శరీరంలో మితిమీరిన క్రొవ్వు పేరుకుపోవడం అనే లక్షణం కలిగిన వైద్య పరిస్థితినే ఊబకాయమని అంటారు. ఒక వ్యక్తి శరీరం యొక్క బరువు ఉండవలసిన దానికంటే 20%, లేదా అంతకంటే ఎక్కువ స్థాయిలో ఉన్నట్లయితే అతనిని ఊబకాయుడని అంటారు.

సంబంధిత వ్యక్తి యొక్క ఎత్తు మరియు బరువు ఆధారంగా లెక్కిస్తూ BMI (Body Mass Index: శరీర ద్రవ్యరాశి సూచిక) అనే కొలత వ్యవస్థ ఆధారంగా ఊబకాయాన్ని కొలవడం జరుగుతుంది. బి.ఎం.ఐ 19 మరియు 25కి మధ్యలో ఉండటమనేది మంచి పరిణామం. బి.ఎం.ఐ 25 కంటే ఎక్కువ వుండి, 30 కంటే తక్కువ వున్న వ్యక్తులు అధిక బరువుతో వున్నట్లు గుర్తించబడతారు. అంతేకాకుండా, 30 కంటే ఎక్కువ బి.ఎం.ఐతో వుండే రోగులు ఊబకాయంతో బాధపడుతున్నట్లు గుర్తించవచ్చు.

ఎక్కువగా ఆహారం తీసుకుంటూ తక్కువ శరీర వ్యాయామం చేస్తూ, కదలకుండా వుండే జీవన శైలి కారణంగా ఊబకాయం తలెత్తుతుంది. నెమ్మదిగా వుండే జీవక్రియ కలిగిన కొందరు రోగులు తక్కువ ఆహారం తీసుకున్నప్పటికీ కూడా బరువు పెరిగే అవకాశం వుంటుంది. కొన్ని మందులు, వ్యాధులు, మరియు జన్యు సంబంధ కారకాలు కూడా శరీర బరువుని పెంచే కారణాలుగా చెప్పవచ్చు.

ఊబకాయం అనేది భారత దేశంలో రోజు రోజుకీ పెరిపోతున్న ఒక వ్యాధిగా చెప్పవచ్చు. శరీరంలో అసాధారణంగా కొవ్వు ఉండటమనేది రోగి యొక్క మొత్తం ఆరోగ్యం మీద మరియు అతని క్షేమం మీద ప్రతికూల ప్రభావాన్ని చూపెట్టడానికి అవకాశాలు చాలా ఎక్కువ. టైప్-2 మధుమేహం, రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, మరియు కాన్సర్ లాంటి వ్యాధులు సైతం తలెత్తడానికి ఊబకాయం కారణమవుతుంది.

వేరికోస్ వేయిన్స్‌కి  మరియు ఊబకాయానికి ఏమిటి సంబంధం?

పెరిగే వయసు, నరాల గాయాలు, ఇంతకు ముందు రక్తం గడ్డకట్టిన చరిత్ర కలిగివుండటం, కుటుంబంలో కొందరికి వేరికోస్ వేయిన్స్ వున్న చరిత్ర వుండటం మరియు కదలకుండా ఒకే స్థితిలో కూర్చోవడం గాని లేదా నిల్చోవడం గాని అవసరమయ్యే ఉద్యోగాలు చేయడం మొదలైనవి వేరికోస్ వేయిన్స్ పరిస్థితికి దారి తీసే కారణాలుగా చెప్పవచ్చు.

ఇవే కాకుండా, ఊబకాయం కూడా వేరికోస్ వేయిన్స్ తలెత్తడానికి ఒక పెద్ద కారణంగా చెప్పవచ్చు. కాని అధిక బరువు అనేది నరాల ఆరోగ్యాన్ని ఏ విధంగా దెబ్బతీస్తుందో చాలా మంది రోగులకి తెలియదు. అధిక శరీర క్రొవ్వు మరియు నరాల వ్యాధుల మధ్య సంబంధాన్ని అర్థం చేసుకోవడం వలన ఈ రెండు వైద్య సమస్యలని సరిగ్గా వ్యవహరించవచ్చు. అధిక బరువు అనేది కాళ్ళలోని నరాల పైన అధిక ఒత్తిడి పెట్టి తద్వారా ఆ నరాలు భూమి గురుత్వాకర్షణ ప్రభావానికి వ్యతిరేఖంగా తిరిగి గుండెకి ఆక్సీకరణం చెందని రక్తాన్ని పంపు చేయడాన్ని కష్టతరం చేస్తుంది. కాలం గడిచినా కొద్దీ, ఈ పరిస్థితి నరాల యొక్క కవాటాలు దెబ్బతినేలా చేసి, చివరికి రక్తం అధికంగా గడ్డకట్టేలా చేస్తుంది.

సాగిన మరియు ఉబ్బిన నరాల రూపంలో కనిపిస్తూ, వేరికోస్ వేయిన్స్ అనేవి చర్మం పైభాగంలో బయటకి ఉబ్బిన విధంగా కొన్నిసార్లు కనిపిస్తూ వుంటాయి. ఇవి ప్రభావిత ప్రాంతంలో దురద మరియు బరువుని కలిగిస్తాయి. తీవ్రమైన కేసులలో, రోగి కదలడానికి లేదా ఎటువంటి సహాయం లేకుండా నడవడానికి కూడా కష్టపడతాడు.

అధిక బరువు వేరికోస్ వేయిన్స్‌ని ఏ విధంగా కప్పివేస్తుంది?

ఊబకాయం అనేది వేరికోస్ వేయిన్స్‌కి కారణంగా మారడమే కాదు వాటిని అది కప్పేస్తుంది (దాచేస్తుంది) కూడా. ఊబకాయ రోగుల విషయంలో కొన్నిసార్లు, ముఖ్యంగా వాళ్ళ కాళ్ళ పైన వేరికోస్ వేయిన్స్ అనేవి అనేక క్రొవ్వు పొరల క్రింద కప్పబడి వుంటాయి. ఈ కారణం చేతనే అవి ఎంతో కాలం వరకూ కనబడకుండా వుండి చికిత్సకి కూడా నోచుకోకుండా వుంటాయి.

ఆరోగ్యవంతమైన బరువుతో వున్న వాళ్ళతో పోల్చినపుడు, ఊబకాయ రోగులలో వేరికోస్ వేయిన్స్ అనేవి చర్మం ఉపరితలానికి అంత దగ్గరగా వుండవు. ఊబకాయ రోగులలో, వేరికోస్ వేయిన్స్ అనేవి కంటికి కనిపించే విధంగా వుండవు. ఆ విధంగా వాటిని శారీరక పరీక్ష ద్వారా గుర్తించడం కూడా కష్టతరమవుతుంది.

వేరికోస్ వేయిన్స్‌కి చికిత్స తీసుకోకపోవడం లేదా ఆలస్యం చేయడమనేది పరిస్థితిని తీవ్రతరం చేసి దీర్ఘకాలిక నరాల అసమర్థత, లోపలి నరాలలో రక్తం గడ్డకట్టడం, నరాల పుళ్ళు, మరియు ఊపిరితిత్తుల కవాటాలు మూసుకుపోవడం (Pulmonary Embolism) లాంటి ప్రాణంతక వ్యాధులకి సైతం దారి తీయవచ్చు.

బరువు తగ్గడమనేది వేరికోస్ వేయిన్స్ పైన ఏ విధమైన ప్రభావాన్ని కలిగివుంటుంది?

వేరికోస్ వేయిన్స్ మరియు ఊబకాయం మధ్యలో ఒక బలమైన సంబంధం వుందనే విషయాన్ని ఎన్నో అధ్యయనాలు ధృవపరిచాయి. ఆరోగ్యవంతమైన బి.ఎం.ఐని కలిగివుండటమనేది సాగిన నరాలు, వాపు, దురద, కాళ్ళలో బరువుగా వున్నట్లు అనిపించడం మరియు ప్రభావిత ప్రాంతంలో చర్మం రంగు మారడం వంటి అన్ని లక్షణాలని తగ్గించడంలో సహాయం చేస్తుంది.

అధిక బరువుని తగ్గించుకోవడమనేది మీయొక్క వేరికోస్ వేయిన్స్ సమస్య డీప్ వెయిన్ థ్రోంబోసిస్‌ (DVT), నరాల పుళ్ళు మొదలైన నరాల వ్యాధులు మరియు ఇతర ప్రాణాంతక వైద్య సమస్యలుగా మారకుండా ఉండేలా మీకు సహకరిస్తుందనేది ఖచ్చితమైన వాస్తవం.

అయినప్పటికీ గమనించ వలసిన విషయం ఏంటంటే, బరువు తగ్గించుకోవడమనేది కొత్తగా ఏర్పడే వేరికోస్ వేయిన్స్‌ని నివారించినప్పటికీ, ఇదివరకే పాడైన నరాల విషయంలో ఇది ఎటువంటి మెరుగుదల సాధించే అవకాశం లేదు. పేరుకు పోయిన కొవ్వు తగ్గడమనేది రక్తర ప్రసరణలో మెరుగుదలకి దారి తీసి తద్వారా కొత్తగా వేరికోస్ వేయిన్స్ సంభవించే అవకాశాలని తగ్గించేస్తుంది. అయినప్పటికీ, మీయొక్క ప్రస్తుత వేరికోస్ వేయిన్స్‌కి చికిత్స మాత్రం ఖచ్చితంగా అవసరం.

గతంలో ఊబకయులుగా వుండి తరువాతి కాలంలో బరువు తగ్గించుకున్న వారిలో కొందరు తాము అధిక బరువు తగ్గించుకున్న తరువాత మాత్రమే తమకి వేరికోస్ వేయిన్స్ సంభవిస్తున్నాయని నమ్ముతారు. కాని అసలు విషయమేంటంటే, వారు ఊబకాయులుగా వున్నపుడే వారికి వేరికోస్ వేయిన్స్ తలెత్తాయి, కాని అవి శరీరం యొక్క క్రొవ్వు పొరల క్రింద దాక్కొని ఉండిపోయాయి. శరీరం యొక్క క్రొవ్వు శాతం తగ్గినపుడు మాత్రమే అవి గుర్తించబడే విధంగా బయటకి వచ్చాయి.

మీరు గనుక మీయొక్క కాళ్ళ మీద మరియు పాదాల మీద వేరికోస్ వేయిన్స్ యొక్క  తొలుత లక్షణాలని గమనించినట్లయితే, వాటిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఒక నరాల వైద్య నిపుణున్ని అత్యవసరంగా సంప్రదించండి. వాస్కూలర్ నిపుణుడు మీయొక్క వేరికోస్ వేయిన్స్ యొక్క సరైన ప్రదేశాన్ని మరియు వాటి యొక్క తీవ్రతను తెలుసుకోవడానికి ఒక శారీరక పరీక్షని మరియు ఒక డూప్లెక్స్ అల్ట్రాసౌండ్ స్కాన్‌ని నిర్వహించడంతో చికిత్సని ప్రారంభిస్తారు.   

వేరికోస్ వేయిన్స్ కొరకు నొప్పిలేని చికిత్స కొరకై లాపరోస్కోపిక్ విధానాలు భారత దేశ వ్యాప్తంగా ప్రజాదారణ పొందాయి. అవీస్ వాస్కూలర్ సెంటర్లో బాధ్యతలు నిర్వహిస్తున్న  డా. రాజా వి కొప్పాలా గారు అంతర్జాతీయ అర్హతలు మరియు దశాబ్దాల వైద్యానుభావం కలిగిన ఒక ప్రముఖ నరాల నిపుణులు. ఆయన గారు తక్కువ కోతతో, తక్కువ సమయంలో వేరికోస్ వేయిన్స్‌ని తొలగించే లేజర్ చికిత్స విధానంలో ఒక అత్యుత్తమ నిపుణుడు.

తాత్కాలిక మత్తు మందు ఇవ్వడం ద్వారా ఇంటికి త్వరగానే వెళ్ళగలిగే విధానంలోనే లేజర్ అబ్లేషన్ చికిత్స నిర్వహించబడుతుంది కాబట్టి ఆసుపత్రిలో చేరడానికి మీకు ఎటువంటి చింత అవసరం లేదు. మీరు అదే రోజు ఇంటికి వెళ్ళి తరువాత మీయొక్క రోజువారి పనులు కూడా చేసుకోవచ్చు. ఒకే ఒక సిట్టింగులో మీయొక్క వేరికోస్ వేయిన్స్ అన్నీ కూడా తొలగించబడతాయి. అంతేకాదు, మళ్ళీ వేరికోస్ వేయిన్స్ సంభవించడానికి చాలా తక్కువ అవకాశాలు వుండే ఒకే ఒక సురక్షితమైన విధానం ఇది.

వేరికోస్ వేయిన్స్‌కి నొప్పిలేని చికిత్సా విధానంలో హైదరాబాద్‌లోని అవీస్ వాస్కూలర్ కేంద్రం ఒక పేరుగాంచిన వైద్య సంస్థగా చెప్పవచ్చు. అతి వేగవంతమైన చికిత్సతో రోగులందరూ త్వరగా కోలుకోవడానికి వీలుగా ఈ కేంద్రం అన్ని అధునాతన వైద్య పరికారాలు మరియు తాజా సదుపాయాలని కలిగివుంది. వైద్య అనుమతుల కోసం మేము 24 గంటల పాటు సహాయాన్ని అందిస్తాము మరియు చికిత్స మొత్తంలో ఇబ్బంది లేని వైద్యం రోగులకి అందించబడేలా జాగ్రత్తలు తీసుకుంటాము.

హైదరాబాద్‌లోనే ఉత్తమ వాస్కులర్ నిపుణుడి దగ్గర చికిత్స తీసుకోండి. డా. రాజా వి కొప్పాల గారి యొక్క అపాయింట్‌మెంట్‌ని ఈరోజే బుక్ చేసుకోండి!