వేరికోస్ వేయిన్స్ అనేవి మీ కాళ్ళ పైన అందవిహీనంగా కనిపించే నరాలు. అవి కేవలం నొప్పిని మరియు అసౌకర్యాన్ని కలిగించడం మాత్రమే కాదు, అవి తరచుగా చర్మం పైన బయటకి ఉబ్బెత్తుగా కూడా కనిపిస్తాయి. గుండెకి తిరుగు రక్త ప్రసరణని అడ్డుకొనే చెడిన కవాటాల కారణంగా ఈ ఉబ్బిన నరాలు ముదురు నీలి రంగులో వుంటాయి. ఇక చివరికి ఆ పరిస్థితి కాస్త ప్రభావిత ప్రాంతంలో దురదకి దారి తీస్తుంది.

రక్తం గడ్డకట్టడం, దీర్ఘకాలిక నరాల అసామర్థ్యము (chronic venous insufficiency), క్రియాశీలకంగా నరాల పుండ్లు, నరాల్లో తీవ్రంగా రక్తం గడ్డకట్టడం (DVT) మరియు జీవితాన్నే ప్రమాదంలో పడేసి అకాల మరణానికి దారి తీయగల శ్వాసకోశ ధమని అవరోధం (Pulmonary Embolism) మొదలైన ఇతర తీవ్రమైన ఆరోగ్య పరిస్థితులను తప్పించుకోవడానికి ఈ వేరికోస్ వేయిన్స్‌కి సరైన సమయంలో చికిత్స అందించాలి.      

అయితే ఇక దీని గురించి చింతించకండి! ఎందుకంటే బాధని కలిగించే వేరికోస్ వేయిన్స్‌ని తొలగించుకోవడానికి మీరిక క్లిష్టమైన శస్త్రచికిత్సలు చేయించుకోవాల్సిన అవసరం లేదు. వైద్య శాస్త్రంలో ఇటీవలి పురోగతి ఫలితంగా, తక్కువ కోతతో కూడిన మరియు నొప్పిలేని లేజర్ చికిత్సా మార్గాలు కనిపెట్టబడ్డాయి. ఈ మార్గాలు అన్ని  రకాల నరాల వ్యాధులకీ కూడా ఒక త్వరితమైన మరియు నిజమైన చికిత్సా విధానమని చెప్పవచ్చు.

రోగిని త్వరగా ఇంటికి పంపించే విధానాన్ని అనుసరించి, ఇండోవీనస్ లేజర్ చికిత్సా పద్ధతిలో ప్రభావితమైన నరాలని మూసివేయడానికి ఒక సన్నని లేజర్ ఫైబరుని ఒక గొట్టం ద్వారా పంపించడం జరుగుతుంది. ఒకేసారి జరిగే ఈ ప్రక్రియలో అన్ని వేరికోస్ వేయిన్స్‌కి చికిత్సనందించడం జరుగుతుంది. దీని ఫలితంగా శరీర వ్యవస్థ, దగ్గరలోని వేరొక ఆరోగ్యకరమైన నరాలకి రక్తాన్ని మళ్ళిస్తుంది, అది వాపుని తగ్గించి నొప్పి మరియు అసౌకర్యం నుండి త్వరిత ఉపశమనాన్ని కలిగిస్తుంది.

ఇదొక సురక్షితమైన మరియు ప్రభావవంతమైన చికిత్సా విధానం. అంతేకాకుండా, అవీస్ వాస్కులర్ సెంటర్‌కి ప్రతీ సంవత్సరం 4500 కి పైగా రోగులకి చికిత్సనందించే నైపుణ్యం వుంది. అత్యాధునిక వైద్య పరికరాలు మరియు ఉన్నత అర్హత కలిగిన ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్టుల బృందాన్ని కలిగివుండటం వలన, అవీస్ వాస్కూలర్ సెంటర్ నిస్సందేహంగా భారత దేశంలోనే వేరీకోస్ వేయిన్స్ చికిత్సకి సంబంధించి ఒక గొప్ప ఆసుపత్రిగా పేర్కొనవచ్చు.

అవీస్ వాస్కులర్ సెంటర్ అందరికీ కూడా ఒక సౌకర్యవంతమైన మరియు విసుగు లేని చికిత్సా విధానాన్ని అందించడానికి అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఫ్లెబోలజీ జారీ చేసిన ప్రాథమిక నియమాలన్నింటినీ కఠినంగా అమలు చేస్తుంది, అంతేకాకుండా వేరికోస్ వేయిన్స్ చికిత్స కొరకు యు.ఎస్.ఎఫ్.డి.ఏ దృవీకరించిన వైద్య విధానాలను కూడా పాటిస్తుంది. అవీస్ వాస్కులర్ సెంటర్ ఒక స్వంత డాప్లర్ స్కాన్ సౌలభ్యాన్ని కలిగివుంది, అంతేకాకుండా రోగిని చేర్చుకొనే సమయంలో 100% వరకు డబ్బు హామీ కూడా ఇస్తోంది.

అవీస్ సెంటర్, హైదరాబాదులో గాని, అవీస్ సెంటర్, బెంగళూరులో గాని లేదా అవీస్ సెంటర్, చెన్నైలో గాని మీకు వైద్య పరీక్ష లేదా చికిత్స కొరకు మీరొక అపాయింట్‌మెంటుని బుక్ చేసుకోవచ్చు. ఈ ఆసుపత్రులు ప్రపంచ స్థాయి వైద్య సదుపాయాలని కలిగివున్నాయి, అంతేకాకుండా సంపూర్ణ వృత్తి నిపుణులైన వైద్య నిపుణుల బృందం ద్వారా చికిత్స అందించడం జరుగుతుంది.

వేరికోస్ వేయిన్స్ చికిత్సలో అవీస్ వాస్కూలర్ సెంటర్ 98% విజయవంత రేటుని మరియు అతితక్కువ వ్యాధి పునరావృత రేటుని కలిగివుంది. ఈ ఆసుపత్రి అందించే చికిత్సా పద్ధతులు అన్ని వయస్సుల వారికి అనుకూలంగా వుంటాయి. మీరు అదే రోజు ఇంటికి తిరిగి వెళ్ళి, మీ రోజువారి పనులని తరువాతి రోజు నుండే చేసుకోవచ్చు.

భారత దేశంలోనే కాదు, భారత దేశం అవతల కూడా వేరికోస్ వేయిన్స్ చికిత్స కొరకు అవీస్ వాస్కులర్ సెంటర్ ఒక అత్యుత్తమ వైద్య సంస్థని చెప్పవచ్చు. మీరు భారత దేశం అవతల ఎక్కడ నివసించినా సరే, అవీస్ ఆసుపత్రిలోని మా యొక్క అవుట్-స్టేషన్ టీం మీ యొక్క అపాయింట్‌మెంట్లు, హోటల్ వసతులు, మరియు విమాన బుకింగులకి సంబంధించిన పనులన్నింటినీ చూసుకుంటుంది. ఆ విధంగా మీరు ఒక సౌకర్యవంతమైన ప్రయాణం చేసి, వేరికోస్ వేయిన్స్‌కి వీడ్కోలు చెప్పడానికి ఒక గొప్ప వైద్య సహాయానికి సులభమైన ప్రవేశం పొందొచ్చు.

అవీస్ వాస్కులర్ సెంటర్ భారత దేశంలోని అన్ని ప్రముఖ జాతీయ భీమా సంస్థల నుండి ఒక మెడిక్లెయిం (ఆరోగ్య భీమా) సహాయాన్ని కూడా అందిస్తోంది. ఇంకా ఎక్కువ సేపు ఆలోచించకండి, మీ అపాయింట్‌మెంటుని బుక్ చేసుకొని అవీస్ వాస్కులర్ సెంటరులో తక్కువ ధరకే గొప్ప చికిత్సని పొందండి.