మీకు తెలుసా? భారత దేశంలో ప్రతీ ఐదుగురిలో ఒకరు వేరికోస్ వేయిన్స్ గురించి ఫిర్యాదు చేస్తున్నారు. గుండెకి తిరిగి రక్తాన్ని పంపు చేసే కవాటాలు సరిగ్గా పనిచేయక పోవడం వలన వేరికోస్ వేయిన్స్ అనేవి సంభవిస్తాయి.

ప్రారంభ దశలలో, వేరికోస్ వేయిన్స్ సూక్ష్మ కంటికి కనిపించవచ్చు లేదా కనిపించక పోవచ్చు. కాని కాలగమనంలో, నరాలు ఒక సాలీడు గూడును పోలిన విధంగా కాళ్ళపై కనిపించడం మొదలవుతాయి.

గడ్డకట్టిన రక్తం నరాలను సాగే విధంగా, ఉబ్బే విధంగా మరియు కాళ్ళ యొక్క, పాదాల యొక్క చర్మం లోపలి నుండి బయటకి కనిపించే విధంగా చేసినపుడు వేరికోస్ వేయిన్స్ సంభవిస్తాయి.

చికిత్సలో ఆలస్యం చర్మం యొక్క రంగు మారటంతో పాటు నీరు పట్టడం లాంటి సమస్యలకి దారి తీసి తద్వారా లోపలి నరాలలో పుండ్లకి, శాశ్వత నరాల అసమర్థత మరియు రక్తం గడ్డకట్టడానికి దారి తీస్తుంది.

లక్షణాలు

వివిధ రకాల బాధితులు ఈ క్రింద పేర్కొనబడిన వివిధ రకాల లక్షణాలని అనుభవిస్తారు:

1. కాళ్ళ యొక్క కింది భాగంలో తీవ్రమైన నొప్పి మరియు అసౌకర్యం కలగడం.

2. ప్రభావిత ప్రాంతంలో చిరాకు మరియు దురద వుండటం.

3. చీలమండ చుట్టూ విపరీతమైన ఒత్తిడి మరియు వాపు వుండటం.

4. పిక్కలలో బరువుగా మరియు ఇరుకుగా అనిపించడం.

5. సళుపుట (కొట్టుకుంటున్నట్టుగా నొప్పి రావడం)

6. కాళ్ళలోని 85% వరకు పుండ్లు వేర్కొస్ వేయిన్స్ ద్వారా సంభవిస్తాయి.

కారణాలు

వేరికోస్ వేయిన్స్ వీటి వలన సంభవించవచ్చు:

1. పద్దతి లేని జీవన శైలి.

2. మధుమేహం మరియు శారీరక క్రియల లోపం.

3. అతిగా పొగ తాగడం మరియు మద్యం సేవించడం.

4. చర్మానికి అతుక్కు పోయే దుస్తులు ధరించడం మరియు/లేదా ఎత్తు చెప్పులు వేసుకోవడం.

5. ఎక్కువ సమయం వరకూ అలాగే కూర్చోవడం లేదా నిల్చోవడం.

6. గతంలో రక్తం గడ్డకట్టిన సందర్భాల చరిత్ర కలిగి వుండటం.

7. వారసత్వ మరియు జన్యుపరమైన కారకాలు.

8. గర్భం. 

చికిత్సా రకాలు

వేరికోస్ వేయిన్స్‌కి చికిత్స చేయడానికి ఎన్నో చికిత్సా పద్ధతులు అందుబాటులో వున్నాయి.

1. నరాలని ముడివేయడం (Vein ligation)

2. నరాలని లాగేయడం (Vein stripping)

3. స్క్లేరోథెరపీ (Sclerotherapy)

4. రేడియో ఫ్రీక్వన్సీ అబ్లేషన్ (Radio frequency)

5. ఎండోవీనస్ లేజర్ చికిత్సా విధానం.

లేజర్ అబ్లేషన్ యొక్క ప్రయోజనాలు

ఈ క్రింది కారణాల వలన లేజర్ చికిత్సా విధానం ఇతర అన్ని చికిత్సా పద్ధతుల కంటే కూడా ఎంతో ప్రయోజనకరమైందిగా చెప్పవచ్చు.

1. నొప్పి లేకపోవడం.

2. తక్కువ కోత కలిగివుండటం.

3. త్వరితమైనది మరియు సమర్థవంతమైనది.

4. తాత్కాలిక మత్తుమందు మాత్రమే అవసరం రావడం.

5. కోతలు లేకుండా, కుట్లు లేకుండా, మచ్చలు ఏర్పడకుండా చేయగలగడం.

6. అదే రోజున డిచ్చార్జి చేయగలగడం.

7. తక్కువ విశ్రాంతి.

8. ఎక్కువ విజయ శాతం అవకాశాలు.

9. దుష్ప్రభావాలు లేకపోవడం.

10. మళ్ళీ సంభవించడానికి అతి తక్కువ అవకాశం.

11. శస్త్రచికిత్స తరువాతి సంరక్షణ యొక్క అవసరం లేకపోవడం.

అవీస్ వాస్కూలర్ కేంద్రంలో రోగిని చూసే విధానం.

మా అవీస్ వాస్కూలర్ కేంద్రంలో, మేము సులభమైన మరియు ఖచ్చితమైన వైద్య విధానాన్ని అవలంభిస్తున్నాము. మీయొక్క నమోదు పూర్తైన తరువాత మీకు ఒక అనువభజ్ఞుడైన వైద్యునితో ప్రాథమిక సంప్రదింపు కుదర్చడం జరుగుతుంది. వేరికోస్ వేయిన్స్ యొక్క ఉనికిని తనిఖీ చేయడానికి ఆయనే ప్రభావిత ప్రాంతం యొక్క పరీక్షని నిర్వహిస్తారు.         

తరువాత, వేరికోస్ వేయిన్స్ యొక్క ప్రదేశం మరియు దాని తీవ్రతని నిర్ధారించడానికి ఒక డుప్లెక్స్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ నిర్వహించబడుతుంది. రెండవ సంప్రదింపులో ఇంటర్వెన్షనల్ రేడియోలాజిస్ట్ మీయొక్క అల్ట్రాసౌండ్ స్కానింగ్ నివేదికల గురించి మీతో వివరంగా చర్చిస్తారు. ఎండోవీనస్ లేజర్ చికిత్స కంటే ముందు మీరు ఒకే ప్యాకేజీ ఖర్చుని అర్థం చేసుకోవడంలో మీకు సాయం చేయడానికి వీలుగా ఒక ఖచితమైన మరియు లోతైన ఆర్ధిక పరమైన కౌన్సెలింగ్ చేయబడుతుంది.

ఇక తరువాత అత్యున్నత అర్హత కలిగిన ఇంటర్వెన్షనల్ రేడియోలాజిస్ట్ తాత్కాలిక మత్తుమందుని ఇవ్వడం ద్వారా ఎండోవీనస్ లేజర్ అబ్లేషన్‌ని నిర్వహిస్తారు. మీరు అదే రోజున డిశ్చార్జి చేయబడతారు మరియు మీరు త్వరగా కోలుకునే విధంగా మా యొక్క వైద్యులు మీకు సాయపడతారు.

అవీస్ వాస్కూలర్ సెంటర్ యొక్క వ్యవస్తాపకులు, శ్రీ డా. రాజా వి కొప్పాలా గారు ఒక  ప్రఖ్యాతి గాంచిన ఇంటర్వెన్షనల్ రేడియోలాజిస్ట్. 24 సంవత్సరాలు పైబడిన వైద్యానుభవంతో మరియు 12000కు పైగా సంతృప్తి చెందిన రోగులతో, వైద్య రంగంలో ఒక ప్రసిద్ధి చెందిన వైద్యునిగా, వేరికోస్ వేయిన్స్‌కి నొప్పిలేని మరియు తక్కువ కోతతో కూడిన చికిత్స చేయడంలోని ఆయనకు గల నైపుణ్యానికి ఖ్యాతి గడించారు.      

తిరిగి సంభవించడం

ఎండోవీనస్ లేజర్ చికిత్సలో అవీస్ వాస్కూలర్ కేంద్రానికి అత్యధికంగా విజయవంతం రేటు 97% శాతం వరకూ వుంది. వేరికోస్ వేయిన్స్ తిరిగి సంభవించే అవకాశాలని తగ్గించుకోవడానికి పోషకాహారాన్ని తీసుకునే మరియు రోజువారి వ్యాయామాన్ని అవలంభించే ఒక జీవన విధానాన్ని పెంపొందించుకోవలసిందిగా మేము మీకు సలహా ఇస్తున్నాము.

Varicose Veins Treatment
Varicose veins on a man leg, front plane.