వేరికోస్ వేయిన్స్ అనేది తరచుగా చలనం లేని కారణంగా సంభవించే ఒక వ్యాది. కదలకుండా ఎక్కువ సేపు నిల్చొని లేదా కూర్చొని ఉద్యోగం చేయవలసి వచ్చే వ్యక్తులకు వేరికోస్ వేయిన్స్ సంభవించే ప్రమాదం ఎక్కువగా వుంటుంది.

ఇంకొక మాటలో చెప్పాలంటే, రోజుకి నాలుగు గంటల కంటే ఎక్కువ సేపు నిల్చొని పాఠాలు చెప్పే ఉపాధ్యాయ వృత్తిని కొనసాగించే ఉపాధ్యాయులకి గాని లేదా ఎం.ఎన్.సి సంస్థల్లో గంటల తరబడి కదలకుండా అలాగే కూర్చొని వుండే కంప్యూటర్ వృత్తిలో వుండే ఉద్యోగులకి గాని, వారి జీవితంలో ఏదో ఒక సమయంలో వారి సహోద్యోగుల కన్నా కూడా వారికే ఎక్కువ శాతం వేరికోస్ వేయిన్స్ సంభవించే అవకాశం వుంటుంది.

ఎక్కువ సేపు ఎటువంటి శారీరక కదలిక లేకుండా ఉంటడం వలన కాళ్ళలోని మరియు పాదాలలోని నరాలు అధిక శ్రమకి గురౌవుతాయి, ఆ పరిస్థితి తరువాత రక్తం గడ్డకట్టడానికి దారి తీస్తుంది. ఆ విధంగా నరాలలో పెరిగిన ఒత్తిడి చివరికి కవాటాల బలహీనతకి దారి తీస్తుంది. ఈ బలహీన పడిన కవాటాలు కావలసినంత రక్తం తిరిగి గుండెకి చేరే విధంగా సహకరించవు, తద్వారా ఈ పరిస్థితి చివరికి వేరికోస్ వేయిన్స్‌కి దారి తీస్తుంది.

వేరికోస్ వేయిన్స్ అనేవి సాగిన మరియు వాచిన నరాలుగా మారి చర్మం ఉపరితలం నుండి పైకి ఉబ్బెత్తుగా కనిపిస్తాయి. ప్రభావిత ప్రాంతంలో దీర్ఘకాలిక నొప్పి మరియు అసౌకర్యంతో కూడిన బరువు మరియు దురద ఉంటుందని తరచుగా రోగులు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తారు.   

వేరికోస్ వేయిన్స్ యొక్క అవకాశాలను ఎక్కువ చేసే కొన్ని వృత్తులు మరియు జీవన మార్గాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం:

  1. విద్య: విశ్వవిద్యాలయ ఆచార్యులు మరియు పాఠశాల ఉపాధ్యాయులు గంటల తరబడి తరగతి గదుల్లో నిలబడే బోధిస్తారు. అంతేకాకుండా, పాఠ్య ప్రణాళికలను రూపొందించడం, ప్రశ్నా పత్రాలు తయారు చేయడం మరియు జవాబు పత్రాలను దిద్దడం మొదలైన సమయాల్లో కూడా ఎక్కువ సమయం వరకు కూర్చొనే వుంటారు. ఇది వారి యొక్క నరాల ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావం చూపెట్టి, వేరికోస్ వేయిన్స్ ప్రమాదం బారిన పడేస్తుంది. గర్భంతో వున్న సమయంలో మరియు ఎత్తు చెప్పులు ధరించడం వలన, మహిళా ఉపాధ్యాయులు వారి మగ సహోద్యోగుల కంటే కూడా వేరికోస్ వేయిన్స్ బారిన పడే అవకాశం ఎక్కువగా వుంటుంది.
  • ఆతిథ్య గృహాలు, సౌందర్య పరిశ్రమలు, చిల్లర వర్తక సంస్థలు: ఇటివలీ పరిశోధనల నుండి సేకరించిన గణాంకాల ప్రకారం, రోజుకు 10 గంటల కంటే ఎక్కువ సేపు పని చేసే 45 ఏళ్ళు మించిన కేశాలంకరణ నిపుణులు (Hairdressers) అదే వృత్తిలో పనిచేసే యువ నిపుణుల కంటే కూడా వేరికోస్ వేయిన్స్ బారిన పడే అవకాశం ఎక్కువగా వుంటుంది.

హోటళ్ళలో పని చేసే ఉద్యోగులు, చిల్లర వర్తక ఉద్యోగులు, సామాను తనిఖీ చేసేవాళ్ళు, రెస్టారెంటు రిసెప్షన్‌లో పనిచేసే వాళ్ళు, దుకాణాల్లో ఆహ్వానం పలికేవాళ్ళు, మొదలైన ఒకే రకమైన పని సారూప్యం కలిగిన సంస్థల్లో పనిచేసే ఉద్యోగులందరూ కూడా వేరికోస్ వేయిన్స్ బారిన పడే ప్రమాదం వుంది.

  • వైద్యం: ఎక్కువ సమయం తీసుకునే శస్త్రచికిత్సలు నిర్వహించే వైద్యులు మరియు నర్సులకి, మరీ ముఖ్యంగా ఎక్కువ సేపు నిలబడి పనిచేసే నర్సులకి వారి జీవిత కాలంలో ముందుగానైనా లేదా తరువాతి కాలంలోనైనా వేరికోస్ వేయిన్స్ సంభవించే ప్రమాదం అవకాశం ఎక్కువగా వుంటుంది.
  • కార్యాలయం లేదా సాంకేతిక పరమైన ఉద్యోగం: కార్యాలయ ఉద్యోగులు, బ్యాంకు సిబ్బంది, లేదా కంప్యూటర్ రంగంలో పనిచేసే ఉద్యోగులు ఎక్కువ సేపు కూర్చొని పని చేయాల్సి వుంటుంది. కంప్యూటర్ తయారీ పరిశ్రమలు, సమాచార సాంకేతికత సంస్థలు, వినియోగదారుల సేవాకేంద్రాలు మొదలైన వాటిల్లో పనిచేసే ఉద్యోగులు తరచుగా పోటీ వాతావరణంలో, నిర్థిష్ట కాలపరిమితిలో, మరియు ఒత్తిడితో కూడిన వాతావారణంలో పనిచేస్తూ కనీసం మధ్యాహ్న  భోజనానికి కూడా విరామం తీసుకోకుండా వారి డెస్కుల దగ్గరే భోజనం చేస్తారు. ఇలాంటి ఉద్యోగాలు నరాల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసి వేరికోస్ వేయిన్స్ ప్రమాదానికి దగ్గరగా తీసుకొని వెళతాయి.
  • రవాణా: ట్యాక్సీ డ్రైవర్లు, బస్సు డ్రైవర్లు, లారీల నిర్వాహకులు మరియు విరామం లేకుండా గతుకుల రోడ్లపై దూర ప్రయాణాలు చేసే లారీల డ్రైవర్లు కూడా వేరికోస్ వేయిన్స్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా వుంటాయి. డ్రైవర్లు 10 గంటల కంటే ఎక్కువ సేపు కదలకుండా కూర్చుంటారు. అంతేకాకుండా, కొన్నిసార్లు తిమ్మిరిని కూడా అనుభవిస్తారు.

మీరు చేసే ఉద్యోగ రకం పైన పేర్కొనబడనప్పటికీ, పైన పేర్కొనబడిన వృత్తులకి మరియు మీరు మీయొక్క ఉద్యోగ రకానికి పోల్చుకోగలిగే లక్షణాలకి మధ్య పోలికలు వున్నాయని మేము ఖచ్చితంగా చెప్పగలము. మీరు ఏ జీవనోపాదిని కొనసాగిస్తున్నారనే విషయాన్ని కాస్త ప్రక్కన పెడితే, మీరు చేసే ఉద్యోగంలో ఎక్కువ సేపు నిల్చోవడం గాని లేదా కూర్చోవడం గాని వుంటే, వేరికోస్ వేయిన్స్ సంభవించే అవకాశాలను కొట్టి పారేయకుండా మీరు ఖచ్చితంగా జాగ్రత్త వహించి కావలసిన నివారణ చర్యలు తీసుకోవాల్సి వుంటుంది.

మీరు చేస్తున్న ఉద్యోగం వేరికోస్ వేయిన్స్ బారిన పడేయడం వైపు మిమ్మల్ని తీసుకెళ్తూ వుందని మీరు గుర్తిస్తే గనుక, అది సంభవించకుండా ఉండటానికి మీరు ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోవాలి.

  1. పని సమయంలో ఖచ్చితంగా తరచుగా విరమాల్ని తీసుకుంటూ వుండండి. మీరు కంప్యూటర్ ముందు గనుక పనిచేస్తూ వుంటే, వరుస విరామాలు తీసుకుంటూ కాస్త లేచి గదిలోనే కాసేపు అటు ఇటూ నడవండి. ఒకవేళ మీరు చేస్తున్న ఉద్యోగంలో ఎక్కువ సేపు నిల్చొని ఉండాల్సి వస్తే గనుకా, చిన్న చిన్న విరామాలు తీసుకుంటూ కోర్చోవడం లేదా మీయొక్క చీలమండలను మరియు పాదాలను కదిలించే అలవాటుని పెంపొందించుకోండి.
  • సాధ్యమైనప్పుడల్లా, మీయొక్క కాళ్ళను మీ గుండె వరకూ ఎత్తుతూ వుండండి.
  • మీరు ప్రతీ రోజూ చేసే పనితో సంబంధం లేకుండా, ప్రతీరోజు వ్యాయామం చేసే అలవాటుని పెంపొందించుకోండి. ఇలా చేయడం నరాలు కావలసినంత పనిచేసే విధంగా చేసి కాళ్ళలోని రక్త ప్రసరణ కొనసాగేలా చేస్తుంది. ఆ విధంగా వేరికోస్ వేయిన్స్ సంభవించే అవకాశాల్ని అది తగ్గిస్తుంది.
  • సహాయకారిక సాక్సులుగా కూడా పిలవబడే పీడనంతో కూడిన సాక్సుల గురించి, మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి మీకు సూచించాల్సిన దాని పరిమాణం మరియు వాడకం గురించి మీయొక్క వైద్యునితో చర్చించండి.
  • చిరుతిళ్ళకు బదులు పోషకాహారం తీసుకోవడం ద్వారా, అంతేకాకుండా ధూమపానం మరియు మద్యపానాన్ని వదిలిపెట్టడం ద్వారా మీయొక్క జీవన శైలిని మెరుగుపరుచుకోండి.

ఈ చిన్న చిన్న మార్పులు మీయొక్క నరాల ఆరోగ్యాన్ని పెంపొందించి మీకు వేరికోస్ వేయిన్స్ సంభవించే అవకాశాలని తగ్గిస్తాయి. వేరికోస్ వేయిన్స్ లక్షణాలని మీరు గమనిస్తే గనుక వెంటనే ఒక వైద్య సలహా తీసుకోవడానికి ప్రాధన్యమివ్వండి. ఎందుకంటే, గుర్తింపు పొందిన వైద్యులు ఇటువంటి అనారోగ్య పరిస్థితి విషమించకుండా చూస్తారు. అవీస్ వాస్కూలర్ సెంటర్ వేరికోస్ వేయిన్స్ కొరకు ఖచ్చితమైన రోగ నిర్థారణ మరియు నొప్పిలేని చికిత్సా విధానానికి ప్రసిద్ధి చెందినది. అధునాతన పరికరాలు మరియు అత్యంత నాణ్యమైన సదుపాయాలు కలిగిన అవీస్ వాస్కూలర్ సెంటర్, అన్ని రకాల నరాల వ్యాధులకు హైదరాబాదులోనే ప్రముఖ వైద్య కేంద్రమని చెప్పవచ్చు.

అంతర్జాతీయ స్థాయిలో అర్హత పొందిన మరియు అపూర్వమైన శిక్షణా అనుభవం కలిగిన రేడియోలాజిస్ట్ అయినటువంటి డా. రాజా వి కొప్పాలా గారి నాయకత్వంలో ఈ వైద్య కేంద్రం నడుస్తోంది. తన యొక్క 24 ఏళ్ళ వైద్య అనుభవంలో, వేరికోస్ వేయిన్స్ వ్యాధికి సంబంధించి లేజర్ చికిత్సా విధానంలో ఆయనెంతో నైపుణ్యం గడించారు. డా. రాజా వి కొప్పాల గారు ఎంతో విజయ శాతాన్ని నమోదు చేసుకొని తన చికిత్స మరియు వైద్య సహాయం వలన పూర్తిగా సంతృప్తి చెంది ఆనందించిన ఎంతో మంది రోగులని సంపాదించుకున్నారు.     

నరాల వ్యాధుల కొరకు శస్త్రచికిత్స అవసరం లేని మరియు త్వరిత ఉపశమనం కలిగించే చికిత్స కొరకు మీరు అన్వేషిస్తుంటే గనుక, నరాల నిపుణులు శ్రీ. డా. రాజా వి కొప్పాలా గారి నుండి మాత్రమే మీరు పూర్తి భరోసాని ఆశించవచ్చు. ఈరోజే మీయొక్క అపాయింట్‌మెంటుని బుక్ చేసుకోండి!