*క‌ళ్ల‌తో చూసే దానిక‌న్నా అస‌లుది ఎక్కువ‌* అనే ఓ సామెత‌ను వినే ఉంటారు. అలాగే కాళ్ల‌లో న‌రాల వాపు వ్యాధి ( వేరికోస్ వెయిన్స్ విష‌యంలో అత్య‌ధికులు ఇది ఒక కాస్మోటిక్ స‌మ‌స్య‌గానే గుర్తిస్తారు. అయితే ఇది అన్ని సంద‌ర్భాల‌లో నిజం కాదు. ఇక్క‌డే పైన పేర్కోన్న సామెత గుర్తుకు వ‌స్తుంది.  కాస్మోటిక్  స‌మ‌స్య‌గానే భావిస్తే ఇది విప‌రీత ప‌రిణామాల‌కు దారితీస్తుంది.
కాళ్ల‌లో నరాల వాపు వ్యాధి ( వేరికోస్ వెయిన్స్‌)తో వివిధ ర‌కాల ప్ర‌మాదాలు పొంచిఉన్నాయి:
(1) ర‌క్తం గ‌డ్డ‌క‌ట్ట‌డం:
 కాళ్ల‌లో నరాల వాపు వ్యాధి ( వేరికోస్ వెయిన్స్‌)లో ర‌క్తం గ‌డ్డ‌క‌ట్ట‌డం అన్ని ప్ర‌మాదాల‌కు మూల‌కార‌ణంగా నిలుస్తుంది.  చ‌ర్మానికి ఉప‌రిత‌లంలోని సిర‌ల‌లో ర‌క్తం గ‌డ్డ‌క‌ట్ట‌డం క‌నిపిస్తుంది. వీటినే సూప‌ర్‌ఫీషియ‌ల్ (ఉప‌రిత‌ల‌) సిర‌లు అంటారు. సిర‌ల‌లోని లోతైన ప్రాంతాల‌లో ఈ ర‌క్తం గ‌డ్డ‌క‌ట్టవ‌చ్చు. ఇది అత్యంత ప్ర‌మాద‌క‌రం. ఇది ప్రాణాంత‌క‌మూ కావ‌చ్చు. ఈ ర‌క్త‌పు గ‌డ్డ‌లు ర‌క్త ప్ర‌స‌ర‌ణ‌లో క‌దిలి కొన్ని ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ మార్గాల‌ను నిరోధించ‌వ‌చ్చు లేదా ఊపిరితిత్తుల‌లో అడ్డంకిని క‌లిగించ‌వ‌చ్చు. ఇవి ఊపిరితిత్తుల‌కు చేరితే అక్క‌డి ర‌క్త‌నాళాలకు అడ్డంకి ఏర్ప‌డి ధ‌మ‌నులను ప్ర‌భావితం చేయ‌డంతో జీవ‌నానికే ప్ర‌మాదం కావ‌చ్చు. మీరు పీల్చే ప్రాణ‌వాయువులో తేడాలు ఏర్ప‌డి క్ర‌మేణా ఇత‌ర అవ‌య‌వాలు కూడా దెబ్బ‌తింటాయి. ర‌క్తం గ‌డ్డక‌ట్ట‌డంతో కాళ్ల‌లోని మోకాలి కింద‌గ‌ల పిక్క‌ల‌లోని సిర‌ల నిశ్వాస‌ముతో నిస్తేజ‌మ‌గును. దీంతో సిర‌లు ఎర్ర‌బ‌డి కాళ్ల‌లో దురద‌, మంట‌ల‌తోపాటు బాధ‌ను క‌లిగిస్తాయి.
(2) అధిక ర‌క్త‌స్రావం:
కాళ్ల‌లోని సిర‌ల ప‌ట్టును స‌డ‌లించేలా ఉప‌రిత‌ల సిర‌ల‌ను క‌త్తిరిస్తే ర‌క్త‌స్రావం జ‌రుగుతుంది. అత్య‌ధిక కేసుల‌లో ఈ అధిక ర‌క్త‌స్రావాన్ని ఆప‌లేక‌పోతే చివ‌ర‌కు భారీ ర‌క్త‌న‌ష్టం జ‌రిగి ప్రాణాలు పోవ‌డానికి అవ‌కాశం క‌లుగుతుంది.
(3) దీర్ఘ‌కాలిక వ్యాధి సిర‌ల‌తో ఇబ్బందులు:
సిర‌ల‌లోని గోడ‌లు మామూలుగా పనిచేయ‌కుండా ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ‌కు అవ‌రోధాన్ని క‌లిగించే అవ‌కాశాలు ఉన్నాయి. దీనినే ముదిరిన సిర‌ల వాపు వ్యాధిగా పేర్కొన‌వ‌చ్చు. ఫ‌లితంగా సిర‌ల పుండ్లు, లైపోడెర్మ‌టోస్కెల‌రోసిస్‌, అనారోగ్య సిర‌ల తామ‌ర వ్యాధికి దారితీయ‌వ‌చ్చు.
(4) కాళ్లలో పుండ్లు:
కాళ్ల‌లో ఏర్ప‌డే స‌మ‌స్య కార‌ణంగా కాళ్లు వాచిపోయి అనారోగ్యం స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. సిర‌ల దుర్భ‌ర ప‌రిస్ధితి కార‌ణంగా కొద్దికాలంనే  అతిగా చ‌ర్మం రంగు మార‌డం లేదా పూర్తిగా చ‌ర్మం న‌ల్ల‌బ‌డ‌డం జ‌ర‌గ‌వ‌చ్చు. ఈ పరిస్ధితుల‌లో కాళ్ల‌లో పుండ్లుతో  అతి బాధాక‌ర‌మైన స్ధితిని ఎదుర్కోవ‌ల‌సి ఉంటుంది. ఇది సిర‌ల తీవ్ర అనారోగ్యానికి సూచిక‌మే. ఈ పుండ్లు చీల‌మండ‌పైన, కాలిలోప‌లి పాదంలోనా ఏర్ప‌డ‌వ‌చ్చు. ఇటువంటి సంక్లిష్ట ప‌రిస్ధితుల‌ను అధిగ‌మించేందుకు తొలుత  ఈ సిర‌ల‌లోని అనారోగ్యాన్ని వ‌దిలించుకోవాలి. వెంట‌నే త‌గు చికిత్స చేయించుకోవ‌డ‌మే దీనికి ఉత్త‌మ మార్గం. * ఎవిస్ వాస్క్య‌ల‌ర్ సెంట‌ర్ * హైద‌రాబాద్‌లో అత్య‌త్త‌మ వైద్యాన్ని అందించే కేంద్రంగా వాసిగాంచింది.
సిర‌ల సంబంధిత వ్యాధులు, స‌మ‌స్య‌ల‌కు చ‌క్క‌టి, లోతైన ప‌రిష్కారం  చూప‌డంలోనూ,  కేవ‌లం అతి తేలికైన అత్యాధునిక స‌ర్జ‌రీలు చేయ‌డంలోనూ ఈ కేంద్రం ప్ర‌ముఖంగా నిలిచింది. అవుట్ పేషెంట్ విభాగం ద్వారా రోగుల స‌మ‌స్య‌ల‌ను గుర్తించి సేవ‌లు అందిస్తుంది.  ఈ కేంద్రంలో బ్రిటిష్ బోర్డు నుంచి డిగ్రీ ప‌ట్టాను పొంది, భార‌త దేశంలోనే  ఉత్త‌మ వైద్యునిగా  పేరుగాంచిన డాక్ట‌ర్ రాజా.వి.కొప్పాల‌గారు అందుబాటులో ఉంటారు. చ‌క్క‌టి మార్గ‌ద‌ర్శ‌నం చేస్తారు. మీ కాళ్లలో ప‌రిస్ధితిపై అప్ర‌మ‌త్త‌త‌తో వ్య‌వ‌హ‌రించి స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌డానికి ఉత్త‌మమైన  చికిత్స ఒక్క‌టే మార్గం!